భారతీయ రైల్వే ల గురించిన కొన్ని విశేషాలు - అచ్చంగా తెలుగు

భారతీయ రైల్వే ల గురించిన కొన్ని విశేషాలు

Share This
భారతీయ రైల్వే ల గురించిన కొన్ని విశేషాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

ఇండియన్ రైల్వేస్ అనేది భారతదేశానికి జీవనాడి వంటిది అతి ముఖ్యమైన పెద్దదైన రవాణా వ్యవస్థ దేశము నలుమూలను కలుపుతూ కొన్ని వేలమందిని వారి గమ్యాలకు సురక్షితముగా చేరుస్తు సరకులను రవాణాచేస్తూ కొన్ని వేలమందికి జీవానోపాధిని కలిగించేది ఇండియన్ రైల్వేస్ పటిష్టమైన నిర్వహణకు ఇండియన్ రైల్వేస్ ను జోన్లుగా విభజించి ఈ మధ్య వరకు ప్రత్యేకమైన బడ్జెట్ ను కలిగి ఉన్న(ఈ మధ్య సాధారణ బడ్జెట్ తో కలిపి రైవే బడ్జట్ ప్రవేశ పెడుతున్నారు) వ్యవస్థ ఇండియన్ రైల్వేస్. అటువంటి రైల్వేస్ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను తెలుసుకుందాము  
1.ఇండియన్ రైల్వేస్ ప్రభుత్వము చేత నడపబడుచున్నఅతి పెద్ద రవాణా వ్యవస్థ ప్రపంచములోని మూడవ పెద్ద రైల్వే నెట్ వర్క్,127,760 కిమీ పొడవు కలిగి ఉన్నది భారతీయ రైల్వే ల మొత్తము మార్గముతో భూమధ్య రేఖ్ను ఒకటిన్నర సార్లు చుట్టి రావచ్చు. సంవత్సరములో సుమారు 8421మిలియన్ల ప్రయాణీకులను,9991 రైళ్లు 7,172 స్టేషన్లనుండి రవాణా చేస్తుంది. కొన్ని దేశాల జనాభా కన్నా మన రైల్వే లు రవాణా చేసే ప్రయాణీకుల సంఖ్య  ఎక్కువ ప్రయాణీకులనే గాకుండా ఏటా 1014. 15మిల్లియన్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తుంది.దేశములో మొట్టమొదటి రైలు ముంబాయి -దానే ల మధ్య ఏప్రిల్ ,1853న పరుగుతీసింది. l ,

2.భారత దేశములోనే కాకుండా ప్రపంచములోనే పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ ఖరగ్ పూర్ ప్లాట్ ఫామ్ దీని పొడవు 2,733అడుగులు. ఇటీవలే ఈ రికార్డ్ ను బద్దలు కొడుతూ గోరఖ్ పూర్ రైల్వే ప్లాట్ ఫామ్ మొదటిస్థానం దక్కించు కున్నది ఈ ప్లాట్ ఫామ్ పొడవు 4,430 అడుగులు. 

3.భారతదేశములోని రెండు రైల్వేలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో స్థానము దక్కించుకున్నాయి అవి ఛత్రపతి శివాజీ టెర్మినల్ మరియు ఇండియన్ మౌంటెన్ రైల్వేస్.ఈ ఇండియన్ మౌంటెన్ రైల్వేస్ లో మూడు రైల్వేలు ఉంటాయి అవి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే ,నీలగిరి మౌంటెన్ రైల్వే,కాల్క- సిమ్ల రైల్వే ఇవి దాదాపు వంద సంవత్సరాల నుండి నడుస్తున్నాయి వీటిలో ప్రయాణించటం ఒక మధురానుభూతి ఛత్రపతి శివాజీ టెర్మినల్ భారతీయశిల్పకళ  మరియు గోతిక్ ఆర్ట్ ల మిశ్రమము .ఆవిధముగా శివాజీ టెర్మినల్ ప్రసిద్ధి గాంచింది.
4. ఇండియన్ రైల్వేస్ లో ఐదు విలాసవంతమైన రైళ్లు ఉన్నాయి అవి. 1.రాయల్ రాజస్థాన్ అం వీల్స్ 2.ప్యాలస్ అం వీల్స్(రాజస్థాన్) 3.ద గోల్డెన్ చారియట్ (కర్ణాటక మరియు గోవా) 4. డా మహారాజ ఎక్స్ ప్రెస్ (ప్రారంభము అయేది ఢిల్లీ అయినా వేరు వేరు డెస్టినేషన్లు ఉంటాయి)  5.ద  డెక్కన్ ఒడిస్సి (ఇది మహారాష్ట్రలో ప్రారంభమై వేరు వేరు ప్రదేశాలకు వెళుతుంది.ఈ రైళ్లు అన్ని ఇండియన్ రైల్వే లకు  గర్వ కారణము విదేశీయ పర్యాటకులు ఈ రైళ్లలో ప్రయాణించటానికి ఉత్సహాము చూపుతారు కాబట్టి ఇవి పర్యటక  రంగానికి మణిహారాలు. వీటిలో ప్యాలస్ ఆన్  వీల్స్ ప్రపంచములోని పురాతన విలాసవంతమైన రైలు. 
5. అస్సాము లోని డిబ్రుగర్ నుండి తమిళ్ నాడు లోని కన్యాకుమారి వరకు నడిచే వివేక్ ఎక్స్ ప్రెస్ ఇండియాలో కెల్ల పొడవైన రైల్వే లైన్ ఈ రైలు 4273 కిలోమీటర్లు ప్రయాణము చేస్తుంది చిన్న రైల్వేలైన్  నాగపూర్ యాజ్ఞి లమధ్యగల లైన్ ఈ లైన్ 3 కిలోమీటరు లు మాత్రమే. దేశములో అత్యంత ఆలస్యముగా నడిచే రైలు గౌహతి -తిరువనంతపురం  రైలు ఇది సగటున 10 నుండి 12 గంటలు ఆలస్యముగా నడుస్తుంది.అత్యంత తక్కువగా కేవలము 3కిమీ మాత్రమే నడిచే రైలు నాగపూర్ -అజ్మీ పాసింజర్ అంతంత వేగముగా నడిచే రైలు ఢిల్లీ -భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇది గంటకు 150కిమీ వేగముతో పరుగు తీస్తుంది. అత్యంత  నెమ్మదిగా నడిచే రైలు మెట్టుపాళ్యము -ఊటీ నీలగిరి పాసింజర్ ఇది గంటకు 10 కిమీ ల వేగముతో ప్రయానిస్తుంది. 
6.మహారాష్ట్రలోని అహమ్మదనగర్ జిల్లాలోని శ్రీరాంపూర్ ,బేలాపూర్ రైల్వే స్టేషన్లు రైల్వే రూట్ లో రైల్వే లైన్ కు అటు ఇటు ఒకే పాయింట్ లో ఉంటాయి. 
7.ఉత్తర ప్రదేశ్ లోని మధుర జంక్షన్ నుండి వివిధ అత్యధిక మార్గాలలో రైళ్లు వెళతాయి ఇక్కడ నుడి వెళ్లే ఏడూ మార్గాలలో ఆగ్రా కంటోన్ మెంట్ కు వెళ్లే బ్రాడ్ గేజ్ ,భరత్ పుర్  లైన్, అల్వార్ లైన్,ఢిల్లీ లైన్ ,మీటర్ గేజ్ లైన్లొ అచ్నేరా లైన్,వృందావన్ లైన్ హత్రాస్ లైన్ ఉన్నాయి.ఉత్తరాన జమ్మూకాశ్మిర్ లోని కాట్రా ,దక్షిణాన కన్యాకుమారి, పశ్చిమాన భుజ్,తూర్పున తీన్ సుకీయాలోని లేడో లు దేశము నలుమూలల ఉన్న చిట్టచివరి రైల్వే స్టేషన్లు  
8.  రైలు పెట్టెల సస్పెన్షన్ యొక్క అనునాదము యొక్క పౌనఃపున్యము ను 1. 2 హెర్ట్జ్స్ లేదా 72bpm గా నిర్ణయిస్తారు. ఎందువల్లో రైలు పెట్టెలలో ప్రయాణించేటప్పుడు ముఖ్యముగా స్లీపర్ క్లాసులలో నిద్రించేటప్పుడు సౌకర్యముగా ఉంటుంది. 
9. రైల్వేలు వారు సంపాదించే రూపాయిలో  94 పైసలు ప్రజల సౌకర్యార్ధము రైళ్లు సక్రమముగా నడవటానికి ఖర్చు చేస్తారు చార్జీలు పెంచకుండా పెంచిన నామ మాత్రముగా పెంచి మిగిలిన  ఆదాయముతోనే రైళ్లను నడుపు తున్నారు. 
10.సెంట్రల్ రైల్వే లోని నాగపూర్ జంక్షన్ ను రైల్వే వారు ముద్దుగా డైమండ్ క్రాసింగ్ అంటారు ఎందుకంటే నాగపూర్ ను టచ్ చేస్తు రైళ్లు  తూర్పు నుండి పశ్చిమానికి  ఉత్తరము నుండి దక్షిణానికి ప్రయాణిస్తాయి. 
11. ఇండియన్ రైల్వేస్ జమ్మూ కాశ్మీరులోని  చీనాబ్ నది మీద బక్కల్ -కౌరీలను కలుపుతు  ప్రపంచములోనే ఎత్తైన రైలు బ్రిడ్జ్ ని కడుతున్నారు ఈ బ్రిడ్జ్ 1,315మీటర్ల పొడవు దీని నిర్మాణానికి 25,000 టన్నులా స్టీల్ వాడుతున్నారు ఈ ప్రాజెక్ట్ 2008 లో మొదలు పెట్టాలి అనుకున్న కారణాంతరాల వల్ల 2010 దాకా మొదలు కాలేదు 2017 నాటికి చాలా మటుకు పని పూర్తి అయింది ఇంకా ఆర్చ్ పని పూర్తికాలేదు. 2019చివరికి పూర్తి అవవచ్చు అని అంచనా,దీని ఎత్తు కుతుబ్ మీనార్ కంటే ఐదు రెట్లు ,ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఎత్తు లో ఉంటుంది అంటే నది జలాలకు 359 మీటర్ల ఎత్తులో ఉండనుంది.  
12. రైలు మార్గాలలో మన దేశములోని పొడవైన సొరంగము జమ్మూకాశ్మీర్ లోని  పీర్ పంజాల్ సొరంగము దీని పొడవు  11. 25 కిలోమీటర్లు.  
13. భారతదేశములో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్ కొలకటా రోజు 974 రైళ్లు వస్తుంటాయి. 
14. రైళ్లలో ఫ్యాన్లు ,లైట్లు మొదలైన విద్యుత్ పరికరాలు అన్ని 110 వోల్టులతో పనిచేస్తాయి మన ఇళ్లలో మాదిరిగా 220ఓల్టులతో పనిచేయవు దొంగతనాలను నివారించటానికి రైల్వేలు తీసుకున్న చర్య ఇది. 
15.ఇండియన్ రైల్వేస్ యొక్క చిహ్నము(మస్కట్)భోలు ఈ భొలు గార్డ్ ఏనుగు దీనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వారు రూపొందించారు దీనిని 16,ఏప్రిల్,2002 న ఆవిష్కరించారు 
16. ఢిల్లీ ఆల్వార్ ల మధ్య గంటకు 40 మైళ్ళ వేగముతో నడుస్తున్న  పర్యాటకుల రైలు (ఫెయిరీ క్వీన్) కు అతి పురాతనమైన బొగ్గు ఇంజన్ ను వాడుతున్నారు ఈ ఇంజన్ 1855లో తయారు అయి 1909లో రిటైర్మెంట్ ఇచ్చారు కానీ 1997 లో మళ్లి  పట్టాలమీదకు ఎక్కించారు భారతీయ పర్యాటక రంగానికి ఇదొక ఆకర్షణ. 
17. ఇండియన్ రైల్వేస్ 1. 4 మిలియన్ల ఉద్యోగులతో ప్రపంచములోని 8వ పెద్ద ఎంప్లాయర్ గా పేరెన్నిక గన్నది. 
18. 1986లో మొదటిసారిగా ఢిల్లీ రైల్వే స్టేషనులో కంప్యూటరైజేడ్ రిజర్వేషన్ ను ప్రారంభించారు. 
19. ఇండియన్ రైల్వేస్ 2007 డిశంబర్  1న రెడ్ రిబ్బన్ ఎక్స్ ప్రెస్ నడపటముద్వారా ప్రజలలో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచటానికి కృషి చేస్తుంది అలాగే విద్యార్థులలో పర్యావరణము మీద అవగాహన పెంచటానికి సైన్స్ ఎక్స్ ప్రెస్ అనే రైలు ను కూడా నడుపుతున్నారు. 
20. భారత దేశములో ఢిల్లీ,కాన్పుర్, మైసూర్, కోలకటా,చెన్నై ,ఘుమ్ మరియు తిరుచిరాపల్లి వంటి నగరాలలో ఎనిమిది రైల్వే మ్యూజియమ్ లను నిర్వహిస్తున్నారు. వీటన్నిటిలో ఢిల్లీ మ్యూజియం ఆసియాలోనే పెద్ద రైల్వే మ్యూజియమ్ 
21. రైల్వే స్టేషన్లలో అతి పొడవైన పేరున్న స్టేషన్ మన రాష్ట్రములోని నెల్లూరు జిల్లాలోగల వెంకట నరసింహ రాజు వారి పేట అతి చిన్న పేరున్న రైల్వే స్టేషన్ ఒడిస్సా లోని ఇబ్(ib) 
22. దేశములో సముద్రముపై నిర్మించిన తొలి రైల్వే వంతెన పాంబన్ బ్రిడ్జ్ ఇది పాంబన్ దీవిలోఉన్న   రామేశ్వరాన్ని ప్రధాన భూభాగములో కలుపుతుంది. 
23. 1891లో మొదటిసారిగా మొదటి తరగతి రైలు పెట్టెలలో మరుగు దొడ్డి సౌకర్యము కల్పించారు 1907లో అన్ని రైలు పెట్టెలలో ఈ సౌకర్యాన్ని కల్పించారు. తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన భూగర్భ రైలు మార్గము కోల్ కతా మెట్రో.  రైళ్లలో ఎయిర్ కూలింగ్ సదుపాయము మొదటిసారిగా 1874లో అందుబాటులోకి వచ్చింది 
24 హౌరా-అమృత్ సార్ ఎక్స్ప్రెస్ కు 115 స్టాపులు  ఉన్నాయి. త్రివేండ్రం -హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ వడోదర -కొత్త మధ్యనాన్ స్టాప్ గా 528 కిమీ లు ప్రయాణిస్తుంది. 
25. నిజామ్ స్టేట్ రైల్వే 1873లోఇంగ్లాండ్ లో ఏర్పాటు అయింది దీనిలో నిజామ్ ప్రభుత్వ వాటా 5 లక్షల పౌండ్లు వీరు నిర్మించిన తోలి రైల్వే లైన్ వాడి -హైదరాబాద్ ప్రస్తుత కాచిగూడ రైల్వే స్టేషన్ నిజాం స్టేట్ రైల్వే ప్రధాన కార్యాలయము. 1930లో మొత్తము రైల్వేల నిర్వహణ నిజాం ప్రభుత్వము తీసుకోవటములో "హిజ్ హై నెస్  ద నైజామ్స్ గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్ గా ఆవిర్భవించింది. స్వాతంత్రము అనంతరము 1952 ఏప్రిల్ లో నిజం రైల్వేస్ అప్పటి సెంట్రల్ రైల్వేలో విలీనము అయింది. 
26, దక్షిణ మధ్య రైల్వే విషయాలకు వస్తే ,దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తోలి రైలు 1864,అక్టోబర్ ఒకటైన రేణిగుంట రెడ్డిపల్లి మధ్య నడిచింది. విజయవాడ మద్రాస్ ల మధ్య తోలి బ్రాడ్ గేజ్ రైలు మార్గము 1899 లో ప్రారంభమయింది. 1969 లో ప్రారంభమయిన గోల్కొండ ఎక్స్ప్రెస్ అప్పట్లో దేశములోనే అత్యంత వేగముగా నడిచే ఆవిరి ఇంజన్ గల రైలుగా పేరు పొందింది.     
ఇవండీ మన ఇండియన్ రైల్వేల గురించిన కొన్ని విశేషాలు రైలు ప్రయాణాలను సంతోషముగా చేయండి. 
***

No comments:

Post a Comment

Pages