నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -"పండు వెన్నెల పూసింది " - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -"పండు వెన్నెల పూసింది "

Share This
నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -"పండు వెన్నెల పూసింది "
శారదాప్రసాద్ 

అలా ముమ్మిడివరంలో ఉద్యోగం  ఆడుతూ పాడుతూ చేస్తున్నాను.నా సహోద్యుగులు అందరూ మంచివారే !ప్రతిరోజూ ఎవరో ఒకరు నన్ను మధ్యాహ్నపు ఫలహారానికి ఆహ్వానిస్తూనే ఉంటారు.మొదటి నుంచీ నాకు తెలుగు భాషమీద మక్కువ ఎక్కువ!చిన్న ఊరు కావటం చేత ఈ విషయం సాహితీ ప్రియులందరికీ తెలిసింది.సాయంత్రం వేళల్లో నా నివాసానికి వచ్చి ఏదో ఒక గోష్ఠిని నిర్వహించేవారు.దానికి నేను సంధాన కర్తగా ఉండేవాడిని.ప్రఖ్యాత బుర్ర కధ నిపుణులు నిట్టల బ్రదర్స్ తో కూడా నాకు స్నేహం ఏర్పడింది.వారు చెప్పే బుర్ర కధలో నేను చెప్పిన చెణుకులు  వాడుకునే వారు.నా మిత్ర బృందంలో అన్నివయసుల వారు కూడా ఉన్నారు.క్రమం తప్పకుండా రోజూ నన్ను ఇద్దరు కలుస్తారు.వారిలో ఒకరు సీతారాం .చాలా చురుకైన విద్యార్థి.విద్య పూర్తి కాగానే అతనికి కూడా ఆంధ్రాబ్యాంక్ లోనే ఉద్యోగం వచ్చింది .అయితే,అతి చిన్నవయసులోనే అకాల మరణం చెందాడు!అతనికి నా స్మృత్యంజలి. 

ఇక రెండవ శిష్య మిత్రుడు శ్రీ జయంతి లక్ష్మీ నరసింహం (గారు).ఇప్పుడు హాస్యావధానాల ద్వారా బాగా ప్రఖ్యాతి చెందాడు.అతను అందరికీ సుపరిసుతుడే!నన్ను మించిపోయాడు,ఆకారంలో సహా!ఇంత సరదాగా జీవితం గడుస్తున్నా,నాకు ఇంటి మీద బెంగ ఎక్కువ!ఒకసారి ఒక జనరల్ మేనేజర్ బ్రాంచ్ విజిట్ కు వస్తే,నన్ను గుంటూరుకు ట్రాన్స్ఫర్ చేయించమని ప్రాధేయపడ్డాను!కారణం ఏమిటని ఆయన అడిగారు.ఇక్కడి నీళ్లు నాకు పడలేదని instant సమాధానం చెప్పాను.దానికి ఆయన,"Then ,Stop Drinking Water!" అని ఆయన కూడా జోక్ గా అన్నారు."మీరిచ్చే జీతంతో రోజూ బీరు ఎక్కడ తాగమంటారు సార్?"అనే సమాధానం ఆయనకు చెప్పాను.ఈ సమాధానం,నా ధైర్యం ఆ నోటా,ఈ నోటా పడి మా ప్రియతమ  నాయకుడు శ్రీ దువ్వూరి కృష్ణమూర్తి గారి చెవిలో పడింది.ఆయన వెంటనే తన అనుచరులతో--ఇతని చొరవ,ధైర్యం చూస్తుంటే ,మనకు బాగానే ఉపయోగపడుదాడని చెప్పారట!వెంటనే ఆయన స్టాఫ్ మేనేజర్ ను కలిసి,సాధారణ బదిలీల టైం లో నన్ను గుంటూరు రీజియన్ కు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడు.

జనరల్ మేనేజర్ చెప్పింది కూడా వినరేమో కానీ ,ఆయన మాటను కాదనే ధైర్యం ఆ రోజుల్లో ఎవరికీ ఉండేది కాదు!నా పేరును ట్రాన్స్ఫర్స్ లిస్ట్ లో పెట్టారని,నేరుగా కృష్ణమూర్తి గారే నాకు ఫోన్ చేసి చెప్పారు.ఆ రోజుల్లో బ్యాంకు సంవత్సరాంతపు లెక్కలు డిసెంబర్ 31 న జరిగేవి.జనవరి 1 తేదీ సెలవు ఉండేది.అందరం 30 తేదీన రాత్రి మొత్తం కూచొని పని చేసుకొని ,31 ,1 సెలవు తీసుకునేవారం.ఆ రోజుల్లో అమలాపురం కొబ్బరి తోటల్లో 31-12 న full moon లైట్ పార్టీ జరిగేది. కోనసీమలోని అన్ని తరగతుల ఉద్యోగులు దానికి హాజరు అయ్యేవారు.ఆ ఫంక్షన్ లో ప్రత్యేకత ఏమిటంటే,కళావంతుల నాట్య ప్రదర్శన!పెద్దాపురం నుంచి పేరెన్నిక కన్నవారిని పిలిపించేవారు!ఆ  ప్రదర్శనలో మా సీనియర్ ఉద్యోగులందరూ నన్ను ముందు వరసలో కూచోపెట్టేవారు.ప్రదర్శన ప్రారంభం కాగానే,"మందార గంధమిది,బుగ్గపై పులిమెదరా!" అని పాడుకుంటూ వచ్చి ఆ గంధాన్ని నా రెండు బుగ్గల మీద వ్రాసేవారు.ఇన్నేళ్లు గడిచినా ఆ గంధపు వాసన నా స్మృతిలో అలానే ఉంది.ఏనాటికి కూడా ఇరిగిపోని గంధమది!అలా వారు గంధం వ్రాసి , నాకు ఒక తాంబూలం ఇచ్చేవారు.అందులో నా చేత ఒక 100 రూపాయలను పెట్టించారు,నా సీనియర్స్.

ముమ్మిడివరంలో మరొక  ప్రత్యేకత ఏమిటంటే,సినిమాకు continuous గా టికెట్స్ అమ్మేవాళ్ళు.మనకు వీలు కుదిరిన టైం కు వెళ్లి,మిగిలిన భాగాన్ని సెకండ్ షో లో కూడా చూడొచ్చు!ప్రతి పదిహేను రోజులకు,నెలకు గుంటూరు వచ్చేవాడిని.మేనేజర్ గారు ఫ్రెంచ్ లీవ్స్ ఇచ్చేవారు.ఇంతలో గుంటూరు నుండి నాకొక తీపి కబురును ఫోన్ ద్వారా మా నాన్న గారు తెలియచేసారు.అదేమిటంటే,29-01-1974 లో నాకు ప్రధమ సంతానంగా స్త్రీ శిశువు జన్మించింది.తల్లీ,పిల్లా క్షేమం ,పిల్ల తెల్లని మల్లె పువ్వులాగా ఉందని కూడా నన్ను ఊరించే కబురు చెప్పారు.ఒకేసారి నామకరణ మహోత్సవానికి రమ్మని నాన్నుగారు చెప్పారు.తెలిసిన బ్యాంకు ఉద్యోగులు,మిత్రులు కోరిక మీద ఒక పెద్ద పార్టీనే ఇచ్చాను.నామకరణం రోజుకల్లా నేను గుంటూరుకు చేరాను,నేను మా నాన్న మాట ఎన్నడూ జవదాట లేదు.

"ఏమి పేరు పెట్టాలని అనుకుంటున్నావు?'అని నాన్న గారి ప్రశ్నకు, నా సమాధానం--నాకు ఏ ఐడియా లేదు,మీరే నిర్ణయించండి !అని చెప్పగానే,మా నాన్నగారు పరమానంద భరితులై,"వెంకట లలిత "అనే పేరును ప్రతిపాదించారు!దానికి నా తమ్ముడు కొద్దిగా పొడిగింపుగా "వెంకట లలితా జ్యోత్స్న" అనే పేరు ను నిర్ణయించాడు.దానికి అందరూ సమ్మతిని తెలియచేసారు. లలితా జ్యోత్స్న అనే పేరు చాలా అర్ధవంతంగా ఉందని  అని నాకు కూడా అనిపించింది .ఎందుకంటే, She has brought light into my life!మా దంపతుల కడుపున'పండు వెన్నెల 'పూచింది, కాచింది! భగవంతుడి దయవల్ల ఆ సౌభాగ్యవతి భర్త ,పిల్లలతో హాయిగా జీవితాన్ని గడుపుతుంది.అంతా భగవంతుడి అనుగ్రహం ,మా నాన్న గారి ఆశిస్సులు! మరిన్ని కబుర్లతో మరో సారి!
***

16 comments:

 1. చాలా బాగుందండీ!

  ReplyDelete
 2. Style of narration is excellent

  ReplyDelete
 3. Nicly narrated in a very free use of the language. ok

  ReplyDelete
 4. బాగుందండీ!

  ReplyDelete
 5. "పండువెన్నెల పూసింది!" వ్యాసాన్ని చక్కటి తెలుగులో చదివిన అనుభూతి చాల గొప్పగావుంది శారదా ప్రసాద్ గారు.​మనకు ​కలిగిన లక్ష్మీ(ఆడపిల్లలు) సంతానం గురించి మీరు వ్రాసిన వెలకట్టలేని వ్యాఖ్యానాలను నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి.నాగయ్య

  ReplyDelete
 6. Dear sastry garu naa daughter name kuda SARADA (my brother's daughter) keerthana ani suggest chesindi.

  ReplyDelete
 7. Hello SARADA prasad garu, can we call the attraction between a boy and a girl during school days or college days as love. Can you write an article on love marriage and arranged marriage.

  ReplyDelete
 8. Your experiences are interesting.

  ReplyDelete
 9. మిత్రమా,
  చాలారోజులతర్వాత మళ్ళీ నీకునచ్చిన నీకధ మాకు (వినిపించావు) చెప్పావు. మీ దంపతుల భాగ్యోదయ ఆశాజ్యోతి మీ ల.సౌ. చి.వెంకట లలితాజ్యోత్స్న ను పరిచయంచేశావు. పండువెన్నెలచల్లని ప్రసరణలాగా వెంకటలలితా జ్యోత్స్న మీజీవితంలొ క్రొత్తవెన్న్నెలలు కురిపించింది. వెంకటజ్యోత్స్నకు, అల్లుడుగారు, పిల్లలకు శుభాశీస్సులు. నీ కధ ఉత్కంఠ గా సాగుతోంది.
  ...వి.యస్.కె.హెచ్.బాబురావు.


  మిత్రమా,
  చాలారోజులతర్వాత మళ్ళీ నీకునచ్చిన నీకధ మాకు (వినిపించావు) చెప్పావు. మీ దంపతుల భాగ్యోదయ ఆశాజ్యోతి మీ ల.సౌ. చి.వెంకట లలితాజ్యోత్స్న ను పరిచయంచేశావు. పండువెన్నెలచల్లని ప్రసరణలాగా వెంకటలలితా జ్యోత్స్న మీజీవితంలొ క్రొత్తవెన్న్నెలలు కురిపించింది. వెంకటజ్యోత్స్నకు, అల్లుడుగారు, పిల్లలకు శుభాశీస్సులు. నీ కధ ఉత్కంఠ గా సాగుతోంది.
  ...వి.యస్.కె.హెచ్.బాబురావు.


  ReplyDelete

Pages