శివం - 48 - అచ్చంగా తెలుగు
శివమ్మ కధ -21
శివం -48
రాజ కార్తీక్ 


(పాయసం అంతా ఒలికిపోయింది ..కానీ శివమ్మ కనులలో ఆనందం ..)
నేను ఇంకా చిన్న పిల్లాడిగానే ఉన్నాను.
అక్కడ మీ  త్రిమాతలు, బ్రహ్మ దేవుడు ,నారదాదులందరూ ఉన్నారు.

విష్ణు దేవుడు "చెప్పటం మరిచానమ్మా ,ఆ వంటగదిలో నువ్వు చేసిన పాయసం
అక్షయ పాత్ర అయ్యిందమ్మా ,ఒలికిపోయిందని బాధపడకు " అన్నాడు‌.

నేను చిన్న పిల్లాడిలా కేరింత కొట్టాను.
ఇక శివమ్మకు అందర్నీ చూసి ఒకే సారి ఆనందం కలిగింది.
త్రిమాతలు "శివమ్మ తల్లి! మాకు కూడా తమరి పాయసం పెట్టండి. " అని అడిగారు.
బ్రహ్మ దేవుడు ఒకేసారి ౩ తలలతో "నాకు కూడా " అన్నాడు.
నారద స్వామి "మా తండ్రి గారు ఎంతో అదృష్ట వంతులు ,మనం అందరం కేవలం
ఒకమారు  మాత్రమే పాయసం స్వీకరించగలం కానీ తండ్రి గారు మాత్రం ఏక పక్షాన
మూడు సార్లు... "అంటూ చమత్కరించాడు.

నంది ,భృంగి, నాగరాజు చంద్రుడు ..అందరు " "ఆహాహా, భలే భలే నారదుల వా"రు అంటూ నవ్వారు.
మా అమ్మ మాత్రం "సరే, అందరికి తెస్తాను .." అంటూ అందరికి నమస్కరించింది.
శివమ్మ "తల్లులారా, తండ్రులారా, మీరు అందరు నా  కోసం ఇలా రావడం నా అదృష్టం. ఎన్నో
యుగాల జన్మల తపస్సును నేను పూర్ణం చేశానేమో .. " అంది ఆనందంగా‌.

పార్వతి మాత "అవును తల్లి ,నీ భక్తికి స్వామి ఎంతో కరిగిపోయారు. ఆది,
అంతం లేని స్వామి నీ కోసం నీ బిడ్డలా మారారు. తమరు స్వామిని బాలికలా
అలంకరించింది చూసి, అదేమిటి అన్న ఆశ్చర్యంతో మేము ఎంతో ఆనందపడ్డాము "అంది.

నేను మాత్రం పసి బాలుని వలె చిరునవ్వులు చిందిస్తున్నా . వలె ఏమిటి, పసిబాలుడినే కదా, నేను. మా అమ్మతో అందరికి పాయసం తెమన్న సైగలు చేశాను.

లక్ష్మి మాత "వెళ్ళమ్మా, అందరికి నీ పాయసం అంటే అసూయ. ఆఖరికి మాకు కూడా! తమరి లాగా పాయసం చేయటం వల్ల కాలేదు. హర స్వామి కాదు హరి స్వామి కూడా తమరి పాయసం అంటే పరిగెత్తుకు వస్తారంతే .."అంది‌.

మా అమ్మ తేవడానికి వెళ్ళింది.
సరస్వతి మాత "ఇక ఈ చిన్ని శివయ్య తో ఆడుకోవడమే తరువాయి " అంది.
నారద స్వామి వెంటనే వచ్చి, ఒక్కసారి నన్ను ఎత్తుకున్నారు. నేను రాను అని సైగలు చేశాను. అవి ఎంతో ముద్దుగా ఉన్నాయ్ ..అందరిలో నవ్వు ..
"మరి ఎవరు ఎత్తుకుంటే వాస్తవు అనేసరికి," 
నారదుల వారు "నారాయణ నారాయణ "అన్నారు.

అంతే విష్ణు దేవుడు వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దాడారు ..బ్రహ్మ దేవుడు కూడా ..
ఇక త్రిమాతలయితే నన్ను ఒకే రకంగా భావిస్తూ, ఆనందంగా నాతో ఆడుకుంటున్నారు.
నంది "ఈ స్వామే కదా అన్నిటికి ప్రతిక ..అన్ని బంధాలకి, అన్ని శాస్త్రాలకు, అన్ని తత్వాలకు, పరిపూర్ణత ఈ స్వామేకదా." అన్నాడు పరవశంగా‌.
నా అల్లరి హావభావాలు చూసి వారు ఎంతో మురిసిపోయారు. ఆనందబాష్పాలతో ..శివమ్మ తల్లి అదృష్టాన్ని కొనియాడారు.

మా అమ్మ పాయసపు అక్షయపాత్ర తీసుకువచ్చింది ..అందరికి పాయసం ఇస్తోంది.
నన్న త్రిమాతలు  ఆడిస్తున్నప్పుడు, సాధారణ బాలునివలె మా అమ్మని చూడగానే ఆమె దగ్గరకు  పోవటానికి మారాం చేశాను.

శివమ్మ "ఉండు కన్నయ్య, వస్తాను అని "అక్కడ ఉన్న వారందరికి పాయసం పోస్తుంది. విష్ణు దేవుడు అయితే మరొకటి, మరొకటి అని తాగేస్తున్నారు.
 బ్రహ్మదేవుడుకుడా ...

పార్వతి మాత "నంది మాకు కూడాను తీసుకురా. అందాకా ఈ చిన్న స్వామి తో ఆడుకుంటాము " అంది.
నంది వెళ్ళటం ..విష్ణు దేవుడు తాగుతూనే ఉండటం ..ఇక ఇదీ అల్లరి .ఇక మా
అమ్మే వచ్చి  మాతలకు పాయసం పెట్టింది. వారు అది తాగుతూ అర్ధం
చేసుకున్నారు విష్ణు దేవుడు, బ్రహ్మ దేవుడు నేను మిగతావారందరూ ఆ పాయసపు భక్తీ, రుచి ఎందుకలా ఆస్వాదిస్తున్నారో!

విష్ణుదేవుడు "శివమ్మ తల్లి, ఇప్పుడు తమరి కోరిక నెరవేరిందా? స్వామితో మీ ముచ్చట తీర్చుకున్నారా?" అని అడిగాడు.
శివమ్మ "నెరవేరలేదు స్వామి, ఎంత సేపైనా ఆయన్ని  నా బిడ్డలా   ఉంచుకోవాలని ఉంది " అంది.
పార్వతి మాత "తధాస్తు, తల్లి ఎప్పుడూ తమరు స్వామి సమక్షంలోనే  ఉంటారు " అని వరమిచ్చింది.

బ్రహ్మ దేవుడు "శాశ్వత  కైలస ప్రాప్తిరస్తు ." అన్నారు.
లక్ష్మిదేవి, సరస్వతి మాతలు "మీకు పరమేశ్వరుడు ముందే ప్రాప్తి చేసారు కదా "అన్నారు.
శివమ్మ తల్లి  అందరి వైపు ప్రేమగా చూస్తుంది . నా  దగ్గరకు వచ్చి,
మోకాళ్ళ మీద నిలబడి "శివయ్య, నా  కన్నా తండ్రి !"అంటూ తీవ్రమైన
తన్మయత్వంతో నన్ను వాటేసుకుంది. నన్ను ఎన్నో ముద్దులు పెట్టుకుంటుంది.
మరొకసారి తన చేతిలో నా మొహాన్ని పెట్టుకొని చూస్తుంది.

శివమ్మ "శివయ్య నన్ను వదిలి వెళ్ళవు కదా " అని అడిగింది.
నేను యధా రూపం లోకి మారాను ..
నేను "ఎక్కడికి వెళ్తానమ్మా? నువ్వు నా దగ్గరే ఉంటావు ..కైలసం లో కూడా నాకు నువ్వు ఇలాగే  చేసిపెట్టాలి. ఎప్పుడూ నీ  దగ్గరే ఉంటాను. నేను నీ
బిడ్డనమ్మ ,నా మీద సర్వ హక్కులు నీకు ఉన్నాయి, నువ్వు  ఏమి చేయమంటే అది చేస్తా. పదమ్మా, కైలసం వెళ్దాం మనం   " అన్నాడు.

శివమ్మ "శివయ్య, కైలసంలో కూడా నాకు కావలసినప్పుడు పసి బాలుని వలె మారి నాతో ఇలానే ఆడుకుంటావా .." అని అడిగింది.

నేను "నువ్వు ఏమి చెపితే అది అమ్మ, నీ కన్నా నాకు ఎవరు ఎక్కువ? నీ ప్రేమతో నన్ను కట్టిపడేసావు. నన్ను నీ బిడ్డనీ కాదు అమ్మ, బానిసను చేసుకున్నావు. తల్లి ప్రేమ కన్నా ఈ సృష్టి  లో గొప్పది లేదు అని నిరుపించావు ,రా అమ్మ ఈ బిడ్డ దగ్గర కలకలం ఉండి పో..ఇక్కడ ఉన్నవారు అందరు నీ బంటులే " అన్నాడు.

విష్ణు దేవుడు "అవును శివమ్మ తల్లి, సాక్షాత్తూ మహాదేవుడే ఈ భక్తీ  ఉత్సవం చూసి ఆనందపడేలా చేసారు .మేము ఈ లీల చూసి ఆనందపడిన సంగతి అంత ఇంత కాదు  .."అన్నాడు.

మిగతా దేవతలు కూడా ఇదంతా చూసి ఆనందిస్తున్నారు.
నేను "నంది, భ్రుంగి"  అని పిలిచాను. "సిద్దం ప్రభు "అని నంది ,భ్రుంగి 
వాహనంగా మారారు. నాగరాజు వచ్చి నా మెడలో ,చంద్రుడు వచ్చి నా తలలో ఉండిపోయరు.

శివమ్మ తల్లి ఎదురుగ ఉన్న విష్ణు దేవుడు, లక్ష్మి దేవులను ,బ్రహ్మ సరస్వతి లను ,నన్ను పార్వతీ మాతను చూసి కనులార నమస్కరించింది.

శివమ్మ "నా కన్న తండ్రి శివయ్య," అని మైమరుపుతో  ఆనందభాష్పాలతో  నన్ను పట్టుకుంది.
అందరి కళ్ళలో కూడా ఆనందబాష్పాలు ..
శివమ్మ తల్లిని నంది మీద అధిరోహింప చేసుకొని అందరము ఉత్సవం వలె బయలుదేరాము.
శివమ్మ తల్లి ఇంటి నుండి కైలసానికి మార్గం వచ్చింది.
అందరు "హరహరమహదేవ!" అన్నారు.
శివమ్మ "కన్నయ్య , బంగారు తండ్రి . ఎక్కడున్నావు? " అంది.
నేను "నేను ఉన్నా కదమ్మా. ఎప్పుడూ ఉంటాను, ఎక్కడైనా నీతోనే  ఉంటాను ..ఏమైనా నేతోనే ఉంటాను. ఎందుకంటే నువ్వు నా అమ్మవు  ..నేను నీ బిడ్డను  ." అన్నాడు.

 అలా  శివమ్మ తల్లి ఇంటి  నుండి కైలసం కు దారి కనుమరుగయిపోయింది   ఒక్క నిమిషంలో.
శివమ్మ తల్లి ఇంటికి వచ్చారు ..శివమ్మని "అత్త" అని పిలిచే వారు ,శివమ్మ
తల్లి దగ్గర పాలు అడిగి తీసుకున్న వారు, అలా శివమ్మ కోసం అందరు వచ్చారు. శివమ్మ తల్లి  ఇల్లంతా  ఒకరకమైన దివ్య కాంతిలో ఉంది . వారికి ఏమి అర్ధం కాలేదు .

అప్పుడు చూసాడు అతను గోడ లవైపు ..అక్కడ జరిగిన లీల అంత దృశ్య రూప చిత్రపటంలో ఉంది ..  అతను మిగతావారికి  కూడా చూపించాడు.

శివమ్మ తల్లికి నేను ప్రత్యక్షం అయిన దగ్గరి నుండి ..కైలసం వెళ్ళేదాక .. అన్నీ అందులో ఉన్నాయి.
అందరు ఒక్కసారి "శివమ్మ అత్త ..కైలసం వెళ్ళిపోయింది సాక్ష్యాత్తు శివుడే
వచ్చారు. బిడ్డలా మారారు. త్రిమూర్తులు, త్రిమతాలు, అందరు వచ్చి వెళ్ళారు,"అని ఒక్కసారి శివమ్మ అత్త అని ఆనందంగా ఏడిచారు. ఇక నువ్వు  ఇలా వెళ్తే మా బాగోగులు ఎవరు చూస్తారు అని ఆనందంతో  కూడిన బాధ తో అంటున్నారు.  శివమ్మ పరమార్దం చేరుకుంది అని ఆనందపడ్డారు .ఊరంత ఈ విషయం తెల్సుకొని శివమ్మ తల్లి ఇంటిదగ్గర   దేవాలయ ప్రాంగణాన్ని సృష్టించారు.

అతను మాత్రం చెప్పిన మాట గుర్తుకుతెచుకున్నాడు "శివమ్మ అత్త  ఎప్పుడైనా శివయ్య నీకు కనపడితే నీ చేతితో వంట వండి పెట్టు ..ఇక అంతే నిన్ను విడిచి వెళ్ళాడు "అని ..కానీ అతనికి మాత్రం శివమ్మ  అత్త అంటే ఎంతో ఇష్టం .."ఈ శివయ్య విడిచి వెళ్ళకుండా మా అత్త ను తీసుకువెళ్ళాడు "
అనుకుంటున్నాడు. కైలసంలో మేం అంత అది చూసి ఒకటే నవ్వు ..

అక్కడ శివమ్మ ఇంటిని దేవాలయంగా  మార్చారు, శివమ్మని అభిమానించే వారు.
వారందరూ "దేవుడిని బిడ్డలా  చేసి ఆడించిన శివమ్మ తల్లి కూడా దేవతే రా
".. అన్నారు.
అలా మా అమ్మ శివమ్మ తను నన్ను బిడ్డలా  భావించి, అన్నీ పొందింది .మీరు కూడా నన్ను ఎలాగైనా భావించి, నన్ను తలవండి. తప్పక అలాగే వస్తాను ..
మరొక మంచి కధ తో మళ్ళీ  వస్తాను ..
శుభం భూయాత్.

No comments:

Post a Comment

Pages