వర్ణక్రమ దోషాలు - అచ్చంగా తెలుగు

వర్ణక్రమ దోషాలు

Share This
వర్ణక్రమ దోషాలు
                                                        సేకరణ : జీడిగుంట నరసింహ మూర్తి                                                   
                                                   
కొన్ని పదాలను వ్రాసేటప్పుడు కాని , పలికేటప్పుడు కాని వర్ణక్రమదోషాలు 
దొర్లుతూ ఉంటాయి. ఇవి పైకి సరిగ్గా ఉన్నట్టు అనిపించినా ,రచనలు చేసేవారికి అవగాహన లేక పోయినా , పత్రికల వారికి పెద్దగా పట్టింపులు లేక పోయినా తెలుగు కవులు, పండితులు మాత్రం అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. అటువంటి పదాలలో కొన్నిటిని ఈ క్రింది తప్పొప్పుల పట్టికలో ఇవ్వడం జరిగింది.
తప్పు         -     ఒప్పు 
అశ్రుతాంజలి - భాష్పాంజలి 
అర్థం -            అర్ధం 
ఆధీనం -        అధీనం 
అధిష్టానం -     ఆదిస్థానం 
అనాధ -         అనాథ 
ఆయశ్వర్యం - ఐశ్వర్యం 
ఆస్థి -           ఆస్తి
ఆలశ్యం -     ఆలస్యం 
ఆశీనులు -   ఆసీనులు
ఆగంతకుడు - ఆగంతుకుడు 
ఉదాశీనుడు - ఉదాసీనుడు
ఉచ్ఛరించు -    ఉచ్చరించు 
ఉచ్ఛారణ -      ఉచ్చారణ 
రుణము -      ఋణము
రుషి -            ఋషి
రుగ్వేదం -      ఋగ్వేదం
ఋజువు      - రుజువు 
రుతువు -     ఋతువు
కైవశం -       కై వసం
కృంగు -      క్రుంగు 
జీవశ్చవాలు -    జీవచ్ఛవాలు 
ధర్మామీటర్ -     థర్మామీటర్ 
నిముషం -        నిమిషం
నిషేధితం -        నిషిద్దం 
నశ్యం -            నస్యం 
తృటిలో -          త్రుటిలో
దృవం -           ధ్రువం
ధృవతార -       ధ్రువతార
ధర్మల్ స్టేషన్ - థర్మల్ స్టేషన్ 
దినదిన ప్రవర్ధమానం చెందుతున్న   -   దినదిన ప్రవర్ధమానంఅవుతున్న 
నాస్థికుడు -        నాస్తికుడు 
పటిష్టం -           పటిష్ఠం
పంచాయితీ -     పంచాయతీ 
ప్రశ్నాపత్రం -      ప్రశ్నపత్రం
-
-ప్రాముఖ్యత -    ప్రాముఖ్యం
-యథాతధం -     యథాతథం 
ప్రాధాన్యత -        ప్రాధాన్యం
ప్రావీణ్యత -         ప్రావీణ్యం
మిధునం -        మిథునం
మితృడు -        మిత్రుడు 
యదార్ధం -      యథార్ధం 
యధాప్రకారంగా - యథాప్రకారంగా
రశీదు -         రసీదు 
రాష్ట్రవ్యాపితంగా - రాష్ట్ర వ్యాప్తంగా 
వాయువ్యం -       వాయవ్యం
విషాదఛాయలు - విషాదచ్ఛాయలు 
శక్తివంతం -       శక్తిమంతం 
శాఖాహారం -      శాకాహారం 
స్వాంతనం -        సాంత్వనం 
స్వంతం -           సొంతం 
సంప్రదించు -      సంప్రతించు 
సాంప్రదాయం -    సంప్రదాయం 
సమైక్యత -         సమైక్యం 
సామ్రాట్ -         సమ్రాట్
సమర్ధవంతంగా - సమర్ధంగా
శతృవు -         శత్రువు 
పౌరసత్వం -     పౌరత్వం
శంఖుస్తాపన - శంకుస్థాపన
సీతకన్ను -     శీతకన్ను
సుగర్ -         షుగర్ 
వృద్దురాలు మృతి - వృద్దురాలి మృతి 
యువకుడు హత్య - యువకుని హత్య 
విజయవంతంపై - విజయంపై 
కరసేవ -          కార్ సేవ
గర్భిణీ స్త్రీ -       గర్భిణీ 
***

No comments:

Post a Comment

Pages