ఉన్నాయి - అచ్చంగా తెలుగు
ఉన్నాయి
పారనంది శాంతకుమారి.


ఆలోచనలో..... 
సంకల్పం, వికల్పం
భావం,అభావం 
జీవం,నిర్జీవం
ఆనందం,ఆవేదన
బంధం,మోక్షం
లుప్తమై ఉన్నాయి.
అనుభవంలో....
మరపు,జ్ఞాపకం
భయం,ధైర్యం
సంతృప్తి,అసంతృప్తి
సంయోగం,వియోగం
ఆసక్తి,విరక్తి
నిక్షిప్తమై ఉన్నాయి.
జీవితంలో......
ఆలోచన,అనుభవం
లీనమై ఉన్నాయి.
జీవితానికి అవే 
ప్రాణమై ఉన్నాయి.

***

No comments:

Post a Comment

Pages