రవళిప్రణవం - అచ్చంగా తెలుగు
రవళిప్రణవం 
పెమ్మరాజు అశ్విని 
       
సాయంత్రం ఏడు కావొస్తుంది మాములుగా విశాఖ బీచ్ వారం మధ్యలో అంత రద్దీగా వుండదు, ప్రేమికులకి అనువైన ప్రదేశం సరదాగా నవ్వుతు తుళ్ళుతూ వుంటారు ,కాని ప్రేమికులైన ఆరోజు రవళి  ప్రణవ్  ఇద్దరుఎడమోహంపెడమొహంగావున్నారు,అందుకుకారణం:      “రవళితాలూకుప్రవర్తన,చదువుమీదశ్రద్ధలేదుఉద్యోగంచేసేఇష్టంలేదుఅలాఅనిఇంటిపనులులాంటివాటిమీదఆసక్తిలేదు,ప్రణవ్ తో ప్రేమాయణం మొదలయ్యి అప్పటికి ౨ సంవత్సరాలు గడిచింది ఇంతకూ ముందు కొన్ని సార్లు ఈ ప్రస్తావన వస్తే నాకు ఆడుతూ పాడుతూ ఉండడమే  ఆనందం తప్పింఛి వేరే ఏ విధమైన తాపత్రయం లేదు అంటూ దాటేసింది”.
        రవళి ప్రణవ్ ఇద్దరి కుటుంబాల వారు చిరకాల మిత్రులు నెమ్మదిగా వీరిద్దరూ ప్రేమికులుగా మారడం వారికి అభ్యంతరం లేదు,కాని రవళి లో ఈ భాద్యతా రాహిత్యం తను తట్టుకోలేకపోతున్నాడు, ఎన్ని సార్లు చెప్పినా తను శ్రద్ద చుపట్లేదు, ఇవాళ ప్రణవ్ తేల్చి చెప్పేసాడు నువ్వు కెరీర్ చూడకపోతే నేను నీతో ఉండలేను అని ,ప్రణవ్ ఒక వ్యాపారవేత్త ,తన వరకు ఎవరైనా సమయం వృధా చేస్తే నచ్చదు ,మొదట్లో రవళి చదువుకుంటోంది,చూడచక్కని పిల్ల అని చక్కగా అందరి  తో కలిసి పోతుందని ఇష్టపడ్డాడు,కొద్ది రోజుల్లో ఆ స్నేహం ప్రేమ గా మారింది ,కాకపోతే కొన్ని విషయాలు తనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి ,అలా అని ప్రేమించిన పిల్ల మనసు నొప్పించలేక ఇన్నాళ్ళు మెల్లిగా చెప్పాడు,ఇవాళ కొత్త సంవత్సరం వేడుక కి ముందు గట్టిగా అడిగాడు ,కాని రవళికి ప్రణవ్ అంటే ప్రాణం ,తను ఇలా కించపరచడం తట్టుకోవడం కష్టంగా వుంది.

     మర్నాడు పొద్దున్న రవళి ముభావంగా వుండడం గామినించిన రవళి బామ్మా గారు “ఏమైంది రా రవళి ఒంట్లో బాగోలేదా లేక ఇంకేమైన సమస్య ఎప్పుడు గలగలలాడే మా రవళి ముగాబోయిందేమి” అంటూ అనునయంగా తల నిమిరింది బామ్మ “బామ్మా ప్రణవ్ నన్ను కోపడ్డాడు ,నాతో ఉండను అని అంటున్నాడు ,ఇదివరకు లాగ ప్రేమగా ఉండట్లేదు ,నాకు ప్రణవ్ ని వదలాలని లేదు ,కాని నేను భాద్యత లేకుండా వున్నాను అని దెబ్బలాడుతున్నాడు ,నాన్న కి చెప్తే ప్రణవ్ మాట కరెక్ట్ అని వంతపాడారు ,నేను ఏమి చెయ్యను బామ్మ నాకు చదువు ఎక్కట్లేదు. నేను వద్దు అన్న వినకుండా చదువుకో ఎగ్జామ్స్ ,ఎంట్రన్స్ అంటూ నన్ను హింస పెడుతున్నారు ,చదవకపోతే నాతో ఉండను అని పేచి పెడుతున్నాడు,మొన్న ప్రణవ్ వాళ్ళ అమ్మగారు,అక్క కూడా నన్ను హేళన చేసారు,నేను ఎందుకు పనికి రాను అని నాన్న పక్కన లేకపోతే నాకు విలువ లేదు అని వారు అంతా నన్ను గడ్డిపోచ గా తీసిపారేస్తున్నారు . ప్రణవ్ అంటే నాకు ఇష్టం తనని వదిలి ఉండలేను ఇప్పుడేమి చెయ్యాలి బామ్మా అని బాధ పడింది రవళి “.
     రవళి సమస్య అంత విన్న బామ్మ “ఓసి నా పిచ్చి తల్లి ఇంతేనా నీ సమస్య ,సరే ఇలా రా టిఫిన్ తిను నీకు పరిష్కారం నేను చెప్తాను అంటూ అనునయంగా టిఫిన్ చేసి తినిపించింది బామ్మ “అన్నట్టు అమ్మడు నీకు తెలుసా నాకు పెళ్ళయ్యే నాటికి 12 ఏళ్ళు మీ తాతగారికి 18 ఏళ్ళు ,ఆయన అప్పుడు కాలేజీ లో చదువుకునే వారు నాకు అయ్యానని చూడాలంటే భయం అయన మా ఇంటికి వస్తే నేను తలుపు చాటున ,మా అమ్మ కొంగు లో దాకునేదాన్ని మెల్లిగా 14 ఏళ్ళకి నన్ను కాపురానికి పంపించారు ,అప్పుడు నాకు కూడా ఏ పనులు వచ్చేవి కాదు కనీసం కూర తరగడం,నా జడ వేసుకోవడం,ఇల్లు తుడువడం లాంటి చిన్న చిన్న పనులు కుడా రావు మీ తాతగారు ఇంత ఎత్తున లేచారు నేను బిక్క మొహం వేసి కుర్చున్నాను నేను,నెమ్మదిగా మీ తాతగారు పక్కన కుర్చుని అలా కాదు సత్య పనులు నేర్చుకోవాలి కదా సరే ఒకపని చెయ్యి రోజు కి ఒక కొత్త పని నేర్చుకుని చూపించు అందులో మజా నీకు అర్ధం అవుద్ది . అని చెప్పారు ఆ మజా ఏంటో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న ,చదువే అన్ని కాదు ఒక పని చెయ్యి నీకు అందంగా అలంకరించుకోవడం,రకరాల ఫాషన్  ఇష్టం కదా వాటికి తగిన ఏదైనా కోర్స్ ఎంచుకో,ఎందుకు చెప్తున్నాను అంటే ఆడవాళ్ళు వారి కాళ్ళ మీద వారు నిలబడాలి .
       అప్పుడే రేపు ఏ సమస్య వచ్చిన ఎదురుకునే దమ్ము మనకి వుంటుంది,అలా అని సంసారం కులదోస్కోమని నేను చెప్పను కాని ఇవాళ మనది ,రేపు ఎలా వుంటుందో మనకి అంటూ ఒక సొంత గుర్తింపు ఉండాలి ,ఫలానా వారి అమ్మాయి,భార్య,కోడలు వీటితో పాటు “రవళి అంటే ఎవరు అనే గుర్తింపు తెచ్చుకోవాలి మరి దానికి నీ ప్రయత్నం మొదలు పెట్టు  ,అప్పుడు చూడు నీ ప్రణవ్ నీ కోసం వస్తాడు ,అసలు నీకంటూ ఒక లక్ష్యం లేకపోతే ఎందుకు బతుకుతున్నాము ,ఎదో తినడం కోసం బతకడం ,బతకడం కోసం తినడం ఇంతేనా జీవితం మన వల్ల ఎవరికీ ఉపోయోగం ,కాసేపు ప్రణవ్ సంగతి పక్కన పెట్టు ,నీ లైఫ్ అంటే నీకే బోర్ కొడుతుంది ఒకేలాగా కాలాన్ని వృధా చేస్తే ,అందుకని నేను చెప్పిన విషయం కాస్త ఆలోచించు,నీ సత్తా నువ్వు నిరూపించుకునేందుకు ఏమి కావాలో ఏమి చెయ్యాలో చూడు ,దాని ప్రకారం ఏమి చెయ్యొచ్చు అనేది నిర్ణయిద్దాం. “ 
       బామ్మా చెప్పింది మొత్తం  విని ఆలోచన లో పడింది రవళి,నెమ్మదిగా ఇంటర్నెట్ లో బ్రౌస్ చేసి మంచి బ్యుటిసియన్  అండ్ ఫాషన్ డిజైన్ కోర్స్ ఎంచుకుని అందులో కోర్స్ చేసింది ,తనకి తెలిసిన సర్కిల్ లో నెమ్మదిగా తానూ డిజైన్ చేసిన చీరలు,డ్రెస్సెస్ లాంటివి నెమ్మదిగా అందరు ఇష్టపడ సాగరు తన గురించి వెత్తుకుంటూ చుట్టూ అందరు వస్తున్నారు ,ఆన్లైన్ లో కూడా చాల మంది కొంటున్నారు,మెల్లిగా ఒక బోటికు పెట్టె ఆలోచన లో వుంది రవళి   ,మెల్లిగా రవళి కుటుంబ సభ్యులలో రవళి మీద అభిప్రాయం మారింది , దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రణవ్ ఒక రోజు రవళి కి ఫోన్ చేసాడు “రవళి నేను నిన్ను కలవాలి సాయంత్రం కుదురుతుందా” అని అడిగాడు కాదనలేక ఔనంది రవళి .
      సాయంత్రం వారు ఇది వరలో కలిసిన ప్రదేశం లో కలిసారు ఇరువురు ప్రణవ్ ని చూడంగానే రవళి “చాలా థాంక్స్ ప్రణవ్ నాలో పంతాన్ని రెచ్చగోట్టి ,నాలో వున్న సత్తా నాకు తెలియజేసావు కాకపొతే ఇప్పుడు నాకు అంటూ ఒక లక్ష్యం వుంది ,నేను ఇప్పుడు వున్న రంగం లో నేను కొంచెం బయటకి తిరగాలి ,మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందో లేదో కనుక్కో  మళ్ళి ఆ తర్వాత నీకు నచ్చిన కెరీర్ ఎంచుకోలేదు అంటూ వెనకడుగు వేస్తె నేను ఏమి చెయ్యలేను , అందుకో నువ్వు ఒకసారి ఆలోచించుకో “ అని ప్రణవ్ కేసి చూసింది ,తన మాటలు విని ప్రణవ్ “నన్ను క్షమించు రవళి నీ మీద తొందరపడి అరిచాను అలా నిన్ను కోప్పడ్డాను ఆ తర్వాత నేను నీకు కాల్ చేద్దాం అని అనుకున్న ధైర్యం చెయ్యలేదు,కాని నువ్వు నా మాటలను ఇదివరకు లాగ ఖాతరు చేయవనుకున్నాను ,కాని  పంతం పట్టి ఇంత తక్కువ సమయం లో నువ్వు ఇలా వృద్ది లోకి వస్తావు అని అనుకోలేదు,నన్ను క్షమించు మా అమ్మ వాళ్ళని నేను ఒప్పిస్తాను,నువ్వు బొటిక్ పెట్టుకో ,నువ్వు ఇలాంటివి ఎన్నో సాదించాలి ,డానికి నేను పూర్తిగా సహకరిస్తాను, మనం కలిసి నడుద్దాం” అంటూ పక్కన కూర్చున్నాడు,రవళి మనసులోనే బామ్మ కి కృతఙ్ఞతలు తెలుపుకుంది .

1 comment:

 1. కథ, కథనం రెండూ బావున్నాయి.!
  అమ్మాయిలకు నిర్దిష్టమైన లక్ష్యం లేకపోతే ఈ రోజుల్లో అబ్బాయిలు ఇష్టపడడం లేదు అన్నది సత్యం.!
  రోజులు మారుతున్నాయి కాబట్టి వంటింట్లో కుర్చుంటానంటే అబ్బాయిలూ ఒప్పుకోవడం లేదు.!
  ఈ అంశాన్ని తీసుకుని 'బామ్మ' గారి చేత జ్ఞానబోధ చేయించడం బావుంది.!
  వయసు మళ్ళిన వారు ఇలాగైనా ఉపయోగపడితే/ఉపయోగించుకుంటే మంచిదే.!
  కాకపోతే అక్షర దోషాలు చాలా ఉన్నాయి, అవి ఇబ్బంది పెట్టాయి.!

  ReplyDelete

Pages