ఎందుకూ?
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
రాయడానికి ఎన్నో విషయాలుండగా 
నీగురించే ఎందుకు రాస్తుంటాను?
చూడటానికి ఎన్నో అందాలుండగా
నీవైపే ఎందుకు చూస్తుంటాను?
నడవటానికి ఎన్నో దారులుండగా 
నీవైపే ఎందుకు అడుగులు వేస్తుంటాను?
ఆలోచించటానికి ఎన్నో తీరులుండగా
నీగురించే ఎందుకు ఆలోచిస్తుంటాను?
మరచిపోవటానికి ఎన్నో అవకాశాలుండగా
నిన్నేఎందుకు గుర్తుచేసుకుంటూ ఉంటాను?
నవ్వడానికి ఎన్నో ఆసక్తులుండగా 
నీపై విరక్తితోనే ఎందుకు ఏడుస్తుంటాను. 
***
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment