శిలాక్షరాలు - అచ్చంగా తెలుగు
శిలాక్షరాలు
నాగ్రాజ్

గతం
చెరపలేవు
భవిష్యత్తు
రాయలేవు

వర్తమానం
సమయపు కాగితాలని
నీకందిస్తుంది

విచక్షణా
కలం అందుకో
వివేచనా
సిరా నింపుకో

కాలం 
యుగాలని మింగేసినా
చెరగని శిలాక్షరాలని 
నీ పేర లిఖించుకో

***

1 comment:

  1. నా కవితని ప్రచురించి ప్రొత్సహించిన సంపాదకులకు హృదయపూర్వక
    ధన్యవాదం

    ReplyDelete

Pages