కొన్ని ఖండికలు - అచ్చంగా తెలుగు

కొన్ని ఖండికలు

Share This
కొన్ని ఖండికలు
యామిజాల జగదీశ్

1

అన్ని పువ్వులలోనూ

నీ పరిమళం...

2

నా కల

నీ ముందు

చాచిన భిక్ష పాత్ర

3

నీ కనులతోనే

నేను తొలిసారిగా

నన్ను నేను చేసుకున్నాను

4

నీ అందం

నీకు వరం

నాకు శాపం

5

మరణం

నీకన్నా మంచిది

మాట ఇచ్చినా నువ్వు రాలేదు

మాట ఇవ్వకున్నా

వచ్చింది మరణం

6

నీ దారీ

నా దారీ

వేర్వేరు కావచ్చు

కానీ

అవి ఒకే చేతి రేఖలు

7

నీ కోపమూ నాకు సంతోషమే

నాకు తెలుసు

అది నువ్వు నిప్పులతో రాసిన

ప్రేమలేఖ కజదూ

8

నీకోసం కలలో నిరీక్షిస్తున్నా

ఎందుకో తెలుసా

నువ్వొచ్చే చోటదేగా...

9

ఇది కన్నీరు కాదు

ప్రేమ సంతకం

10

నాకు తెలుసు

నిన్ను ప్రేమించడమన్నది

నన్ను నేను

శిలువకెక్కడమేనని

11

పాట దారిలో

మాటలుగానే

నిన్ను కలవడం సాధ్యమవుతోంది

12

నామీద నీ చిరునామా రాశాను

అది కాస్తా

డెడ్ లెటర్ అయిపోయింది

-      తలశిల మహిమ

No comments:

Post a Comment

Pages