గురువంటే? - అచ్చంగా తెలుగు
 గురువంటే?    
-ఆదూరి.హైమావతి..

గురువంటే -- ఓవ్యక్తికాదు - విఙ్ఞానఖని.    
అమ్మనాన్నలతర్వాతమన్నించవలసిన ‘మహామనీషి’ ,
అక్షరఙ్ఞానాన్నిచ్చి,-- ప్రకృతినిగురించితెలిపేప్రక్రియలో,   
తనప్రఙ్ఞనురంగరించి  --  పసిహృదయాల్లోనింపేశిల్పి,    
తప్పుచేసినపుడుసరిచేసేఓమాతృమూర్తి.   

దయాగుణంతోనేదండించేఓతండ్రి,   
జీవనమార్గాన్నినిర్దేశించే ఓఙ్ఞాని,   
 సమాజాన్నిగురించిఅవగాహనకల్పించి,  
 విలువలునేర్పి- వాల్యూబెస్డ్విద్యనిచ్చేఓదక్షుడు, 
ఆక్షరాలుఎలావ్రాయాలోచేయిపట్టిచూపి,  
పదాలఉఛ్ఛారణపెదవులతోపలికినేర్పి,  
 వాక్యాలకూర్పునేర్పుగాఅల్లిఅభ్యసింపజేసి,  
ఛలోక్తులువిసరడంచాకచక్యతచెప్పి,  
 చదువంటేభయంబాపి,-- నేర్పరైనవిద్యార్ధిగానవపధాననిల్పి,  
జననినీ - జన్మభూమినీసమ్మానించేవిధంవివరించి,   
 సత్యధర్మాలమర్మంవిప్పి,-- శాంతిప్రేమలమాధుర్యంరుచిచూపి,  
అహింసామార్గానికిచక్కనిబాటవేసి,  
          జాతిగర్వపడేపౌరునిగాతీర్చిదిద్దే ,-- మహనీయముర్తిగురువంటే!. 
మానవులకుగురువులేకనిపించేదైవాలు  !గురువులందరికీనమోవాకాలు.. 

***

No comments:

Post a Comment

Pages