రమణీయం – శ్రీ శ్రీనివాస కళ్యాణం
ఓరుగంటి సుబ్రహ్మణ్యం
ముచ్చటగా మూడు సంస్థలు - తెలుగు కళా సమితి, నవీ ముంబయి అన్నమాచార్య సప్తగిరి సంకీర్తన సంస్థ, శ్రీ సిద్ధేశ్వరీ పీఠ సేవా సంఘం - సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ది.15.7.2018న జరిగింది.
వాషి వేదికగా శ్రీదేవి - భూదేవి సమేత అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ శ్రీనివసుని కళ్యణమహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కుండపోతగా వర్షం కురుస్తూన్నా, భక్తజనం తండోపతండలుగా విచ్చేసి శ్రీనివాసుని కళ్యాణం కనులారగాంచి స్వామివారి ఆశీస్సులనందుకొని తరించారు. శ్రీవారి కళ్యాణం
తరువాత కుర్తాళం శ్రీ సిద్ధేశ్వర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్య సిద్ద్ధేశ్వరానంద భారతి స్వామివారి అనుగ్రహ భషణం విని భక్తులు భక్తితో పరవశించారు. అన్నప్రసాద వితరణ తరువాత ఈ కార్యక్రమం ముగిసింది.
***
No comments:
Post a Comment