అన్నమయ్య సూక్తి చంద్రిక(116-140) - అచ్చంగా తెలుగు

అన్నమయ్య సూక్తి చంద్రిక(116-140)

Share This
అన్నమయ్య సూక్తి చంద్రిక(116-140)
(అన్నమయ్య  కీర్తనలలోని  సూక్తులకు    ఆంగ్ల లిప్యంతరీకరణము, ఆంగ్లానువాదము, వివరణములు )
           -డా. తాడేపల్లి పతంజలి

116

ఓరుపే నేరుపు సుమ్మీ వువిదలకు(07-248)
English transliteration
Ōrupē nērupu sum'mī vuvidalaku(07-248)
వివరణం.
ఓర్పు స్త్రీలకు ఆభరణము కదా !
ఆంగ్లానువాదము
endurance is an ornament for women..Indeed!
117
యెంత తొండమున్నా దోమ యేనుగవునటే(07-191)
English transliteration
Yenta toṇḍamunnā dōma yēnugavunaṭē(07-191)
వివరణం.
ఎంత పెద్ద తొండమున్నప్పటికి దోమ- ఏనుగు అవుతుందా? (కాదని భావం)
ఆంగ్లానువాదము
Will it be mosquito becomes elephant even though it has trunk ? !
విశేషాలు
తొండపుదోమ (ఏనుగదోమ) ప్రసిద్ధి కలది. . A mosquito with a proboscis, the female mosquito (which alone has such a proboscis), అని బ్రౌణ్యం.
118
మదమత్సరము లేక మనసుపేదై పో
English transliteration
Madamatsaramu lēka manasupēdai pō
(01-59)
వివరణం.
గర్వము, ద్వేషము లేకపోతే మనస్సు పేదదవుతుంది.
ఆంగ్లానువాదము
The mind becomes poor when it leaves proud and enmity
విశేషాలు
గర్వ ద్వేషములు నిండిన మనస్సు కొంత మందికి సంపద అనిపిస్తుంది . అటువంటి సంపద లేని మనస్సు పేద అవుతుంది. కాని ఆ పేదరికమే ఎంతో హాయి
119
ఎండలోని నీడ యీమనసు
English transliteration
Eṇḍalōni nīḍa yīmanasu
(1-337)
వివరణం.
ఈ మనస్సు ఎండలోని నీడవంటిది.
ఎండలో నీడ ఒక విచిత్రపద బంధం.
ఎండలో ఈ రకాలు ఉన్నాయి.
ఈరెండ,నీరెండ, బాలాతపము, లేయెండ, చలియెండ; చుఱుకెండ; పొడియెండ, మిడియెండ, మిఱిమిడి; మూగెండ.
వీటిలో మూగెండ అన్నమయ్య ఈ పాదంలో చెప్పిన ఎండ అనిపిస్తోంది.
సూర్యుడు మబ్బు చాటున ఉండి కలిగించు ఎండ మూగెండ.
ఈ ఎండలో ఎండయొక్క తాపము ఉంటుంది. అదే సమయంలో నీడ కూడ ఉంటుంది.
సంకల్ప వికల్ప సమ్మిశ్రితమైన మనస్సు కూడా ఈ మూగెండలోని నీడ.
కనబడకుండా చల్లదనమనిపిస్తూ తాపం పెడుతుంటుంది.
ఆంగ్లానువాదము
This mind is Shadow in the sunshine.
120
తొక్కనిచోట్లు దొక్కెడి మనసు
English transliteration
Tokkanicōṭlu dokkeḍi manasu1-276)
వివరణం.
ఈ మనస్సు తొక్కని చోట్లను ఎప్పటికప్పుడూ తొక్కాలనుకొంటుంది. ఒకచోట కుదురుగా ఉండదు. .
ఆంగ్లానువాదము
This mind tries to trample the different places from time to time. It is not in the same place.
121
కంచూగాదు పెంచూగాదు కడుబెలుచు మనసు(2-21)
English transliteration
Kan̄cūgādu pen̄cūgādu kaḍubelucu manasu(2-21)
వివరణం.
ఈ మనస్సు కంచు వంటి లోహము కాదు. ఇంటి కప్పునకుపయోగించు మట్టి పెంకు కాదు. అతిసులభంగా విరిగేది.. .
ఆంగ్లానువాదము
This mind is not like a bronze. The mind is not like a a potsherd ( cullet) used for house roof. The mind is very easy to break ..
122
మనసు నమ్మనేర్చితే మనుజుడే దేవుడౌను(2-352)
English transliteration
Manasu nam'manērcitē manujuḍē dēvuḍaunu(2-352)
వివరణం... .
మనస్సును నమ్మటం నేర్చుకొంటే- మనస్సులో ఉన్న దేవుడిని నమ్మటం నేర్చుకొంటే- మనుష్యుడు దేవుడవుతాడు.
ఆంగ్లానువాదము
If you learn to believe the mind - if you learn to believe in God in the mind - man is God..
123
హరి నీవే బుద్ధి చెప్పి యాదరించు నా మనసు
హరి నీవే నా యంతర్యామివి గాన (2-395)
English transliteration
Hari nīvē bud'dhi ceppi yādarin̄cu nā manasu
hari nīvē nā yantaryāmivi gāna (2-395)
వివరణం.
ఓ వేంకటేశ్వరా ! నువ్వే నా మనస్సుకు బుద్ధి చెప్పి , నా పై దయ చూపించు. ఎందుకంటే నా లోపల కదలాడే వాడివి నువ్వే కనుక.
ఆంగ్లానువాదము
O Venkateswara!
Please admonish my mind and show kindness to me. Because you are the in-dweller
124
ఒకరిగానగ నొడబడదు మనసు (2-395)
English transliteration
Okarigānaga noḍabaḍadu manasu (2-395)
వివరణం.
ఓ వేంకటేశ్వరా ! ఒకరికి కనబడుటకు ఈ మనస్సు అంగీకరించదు.
ఆంగ్లానువాదము
O Venkateswara! This mind does not accept appearance to others.
125
మనసునబొడమిన కోపము మనసునకంటెను ఘనమట
మనసిజుడుద్బోధకుడట మాటల పని యేల(6-44)
English transliteration
Manasunaboḍamina kōpamu manasunakaṇṭenu ghanamaṭa
manasijuḍudbōdhakum̐ḍaṭa māṭala pani yēla(6-44)
వివరణం.
ఓ వేంకటేశ్వరా !
ఈ మనస్సున పుట్టిన కోపము మనస్సు కంటె గొప్పదట. మనస్సున పుట్టిన ఆ మన్మథుడు మేలుకొలుపువాడు. ఇక మాటలతో పని ఎందుకు?
ఆంగ్లానువాదము
O Venkateswara!
  This heartbreaking anger is greater than the mind. Being born in mind, the Cupid is awaking . Then what is the use of words ?.
126
మనసు తనపాలిటి మమకారభూతమై
అనయంబు నిన్నిటికి నాధారమాయ(6-155)
English transliteration
Manasu tanapāliṭi mamakārabhūtamai
anayambu ninniṭiki nādhāramāya(6-155)
వివరణం.
ఓ వేంకటేశ్వరా !
మనస్సు ఎవరికి వారికి ఒక మమకార భూతము లాంటిది.
ఎప్పుడూ ఇది ఎన్నో విషయాలకు ఆధారం.
ఆంగ్లానువాదము
O Venkateswara!
The mind is like a attachment ghost to them.
It is always a basis for many things.
127
కొమ్మమనసు దెలియరాదు(6-50)
English transliteration
Kom'mamanasu deliyarādu
వివరణం.
ఓ వేంకటేశ్వరా !
స్త్రీ మనస్సును తెలుసుకోవటం కష్టం.
ఆంగ్లానువాదము
O Venkateswara!
The woman's mind is hard to know.
128
మనసుకుగమ్మటి నీమనసే తారుకాణ
వెనక ముందరనవి విచ్చిచెప్పరాదు(8-19)
English transliteration
Manasukugam'maṭi nīmanasē tārukāṇa
venaka mundaranavi viccicepparādu(8-19)
వివరణం.
ఓ వేంకటేశ్వరా !
నా మనస్సుకు కమ్మనైన నీ మనస్సే నిదర్శనం.
వెనక ముందర ఏవైతే తీపి జ్ఞాపకాలు ఉన్నాయో వాటిని విడమర్చి చెప్పరాదు.
ఆంగ్లానువాదము
O Venkateswara!
My mind is the proof of your mind which perfumes.
Do not tell sweet memories in pellucid manner.
129
పండి పొల్లవోయీనా పట్టరాని మనసు(8-49)
English transliteration
Paṇḍi pollavōyīnā paṭṭarāni manasu(8-49)
వివరణం.
ఓ వేంకటేశ్వరా !
.ఈ మనస్సు- చేతికి వచ్చినది నోటికి అందకపోయే స్వభావం కలది. పంట పండి కూడా వ్యర్థమైన స్వభావం కలది.
తాలుగింజలను పదేపదే దంచినట్లుగా- వ్యర్థమని తెలిసినా పనికి మాలిన విషయాలను ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది.
ఎప్పటికప్పుడు బింకంగా తానే గొప్ప , తన మాటే చెల్లాలి అని చెబుతుంది. ఈ మనస్సును పట్టలేకుండా ఉన్నాం.
ఆంగ్లానువాదము
O venkateswara
Despite the fact that it is wasted, the mind always thinking
about that useless things constantly. This mind can not be controlled
విశేషాలు
గ్రామీణ ప్రాంతాలలో తిరిగిన అన్నమయ్య ఈ పొల్ల పదంతో అనేక ప్రయోగాలు చేసాడు.
కొన్ని ప్రయోగాలు- వాటి అర్థాలు
పొల్ల - (బొత్తిగా గింజపట్టని ధాన్యం, పొల్లు , వ్యర్థం, )
పొల్లకట్టు-(తూర్పారలో మేలు రాశి పక్కనపడే తాలుగింజలు)
పొల్లకట్టు దంచి దంచి పోగుసేసుకొను – (తాలుగింజలను పదేపదే దంచు.)
పొల్లసేయు - (అలక్ష్యంచేయు . వ్యర్థంచేయు పొల్లుచేయు , నశింపజేయు).
పొల్లువోవు - (అసత్యమగు.)
కల్ల లేదు పొల్ల లేదు - (అసత్యమూ లేదు, వ్యర్థతా లేదు)
130
మనసుకు మనసే మర్మము గాక(9-27)
English transliteration
Manasuku manasē marmamu gāka(9-27)
వివరణం.
మనస్సుకు మనస్సే జీవస్థానం.( కిటుకు. )ఒకరి మనస్సు సంతోషంగా ఉండాలంటే ఇంకొకరి మనస్సులో తనకు చోటు ఉండాలి. వాళ్ళు తనని ప్రేమించాలి. అని అన్నమయ్య సందేశం
ఆంగ్లానువాదము
The mind to the mind is the vital part(a mystery.)
To have happy, there must be some place in others mind. They should love us.. That's the message of the Annamayya
131
మర్మములే వేరుగాని మనసు లొక్కటే పో
కూర్ములే వింతలుగాని గుణము లొక్కటే పో (22-57)
English transliteration
Marmamulē vērugāni manasu lokkaṭē pō
kūrmulē vintalugāni guṇamu lokkaṭē pō (22-57)
వివరణం.
మన మధ్య రహస్యాలు వేరుగా కనిపిస్తాయి కాని, మన మనస్సులు ఒక్కటే కదా!
ప్రేమలు వింతలుగా కనిపిస్తాయి కాని, గుణములు ఒక్కటే కదా !
కంటి రెప్పలు వేరు వేరుగా కనిపిస్తున్నాయి కాని, చూపులు ఒకటే కదా !
(సిద్ధాంతాలు, దారులు వేరు వేరుగా కనిపిస్తున్నాయి కాని, దైవమనేవాడు ఒక్కటే.
ఆంగ్లానువాదము
The mysteries between us are different, but our minds are the same!
Love looks strange, but not the same!
Eyelashes are different, but the gaze is the same!(Theories and paths appear different, but God is the only one.)
132
ఇరుమొన సూదివలె నెందుకౌను నీ మనసు (26 - 491)
English transliteration
Irumona sūdivale nendukaunu nī manasu (26 - 491)
వివరణం.
ఓ వేంకటేశ్వరా ! సూదికి గుచ్చుకోవటానికి వీలుగా ఒక మొన మాత్రమే ఉంటుంది. కాని నీ మనస్సుకు రెండు మొనలు. ( అని మధుర భక్తి సంప్రదాయంలొ అన్నమయ్య ఒక నాయికగా మారి స్వామివారితో చనువుగా అంటున్నాడు)
ఆంగ్లానువాదము
O Venkateswara! There is only one end of the needle to pierce the needle. But two ends for your mind.( In the Madhura Bhakti tradition, Annamayya is a heroine and says to Swami like this.)
133
ఓవరి లోనిది వొకమనసు (16-316)
English transliteration
Ōvari lōnidi vokamanasu (16-316)
వివరణం.
ఓ వేంకటేశ్వరా !
లోపలిగదిలో ఉన్నదానిలా- కనబడకుండా నాగరికతతో మూయబడినది ఒక మనస్సు.
ఆంగ్లానువాదము
O Venkateswara!
As in the inner corner - a mind closed with civilization without being seen.
134
కాంతల మనసులోని కఱవు వాసె
అంతటా జవ్వనమనే ఆమని కాలమున (21-156)
English transliteration
Kāntala manasulōni kaṟavu vāse
antaṭā javvanamanē āmani kālamuna (21-156)
వివరణం.
ఓ వేంకటేశ్వరా !
నీవల్ల-
యవ్వనమనే వసంత కాలంలో -
కోరికలు నెరవేరి
కాంతల మనస్సులోని కరువు పోయింది.
అంతరార్థం
కాంత అనగా కోరదగిన ఆడుది.
మధుర భక్తి సంప్రదాయంలో భగవంతుడు కోరుకొన్న జీవుడు.
ఏకాగ్ర భక్తి అనేది యౌవన వసంతకాలం..
ఆ కాలంలో జీవులకు -అలా ఉన్న భక్తులకు స్వామిని దర్శించాలనే కోరిక తీరిమనస్సులో ఉన్న కరవు పోయింది.
ఆంగ్లానువాదము
O Venkateswara! In the spring of youth -The wishes are fulfilled. So, The Famine of the mind is gone.
inner meaning
KANTA means a beloved or lover woman..In the Madhura Bhakti tradition, God is the One who desires. Unique devotion is the youth spring .At that time, the famine of the mind disappeared ( =desire to visit the Lord) to the devotees.
135
అప్పుడు మనసువచ్చు నన్నిటా నీకు (21-60)
English transliteration
Appuḍu manasuvaccu nanniṭā nīku (21-60)
వివరణం.
ఓ వేంకటేశ్వరా !
అప్పుడు నా మీద (ఈ జీవుని మీద ) నీకు మనస్సు అవుతుంది.
ఎప్పుడు?
నిన్ను చనవులతో పిలిచే స్థాయి నాకు వచ్చినప్పుడు.
ఆంగ్లానువాదము
O Venkateswara!
Then upon me you will be minded.
When?
When I come to you to call you with privilege.
136
ఒక్క మనసుతో నన్ను నుండనీయరా (14-258)
English transliteration
Okka manasutō nannu nuṇḍanīyarā (14-258)
వివరణం.
ఓ వేంకటేశ్వరా !
నన్ను ఒక్క మనస్సుతోనే జీవించేటట్లు చేయి.
ఆ ఒక్క మనస్సు నీగురించి తలచే మనసు.
ఆంగ్లానువాదము
O Venkateswara!
Make me live with one mind.
That mind is the mind of you and your mind.
137
ఇందుకంటే మరి యికలేదు హితోపదేశము వో మనసా (3-101)
English transliteration
Indukaṇṭē mari yikalēdu hitōpadēśamu vō manasā (3-101)
వివరణం.
ఓ మనసా !
శ్రీ వేంకటేశ్వర స్వామిని శరణు వేడి నీ దాసుడిని అని ఒక మాట చెబితే చాలు.
శ్రీ వేంకటేశ్వర స్వామి దాసులకు ఒక్కసారి మొక్కితే చాలు.
శ్రీ వేంకటేశ్వర స్వామి నామజపము ఒక్కసారి చేస్తే చాలు
వాడి జన్మ తరిస్తుంది.
ఇంతకంటే నీకు ఇచ్చే మంచి సలహా ఇంకొకటి లేదు.
ఆంగ్లానువాదము
O my mind!
Take refuge with Sri Venkateshwara Swami and Just say a word that is your slave.
Please do an obeisance or salutation to Sri Venkateshwara Swamys bondsmen for one time
Please chant the name of Sri Venkateshwara Swamy for one time.
There is no better advice than this for you
138
పారకుమీ వోమనసా పంతము విడువకుమీ మనసా
పారిన నీవే బడగయ్యెదవు చేరువ నాడే చెప్పవె మనసా(1-188)
English transliteration
Pārakumī vōmanasā pantamu viḍuvakumī manasā
pārina nīvē baḍagayyedavu cēruva nāḍē ceppave manasā(1-188)
వివరణం.
ఓ మనసా !
ఇంద్రియ సుఖాల వైపు పరుగెత్తకు.
వేంకటేశ్వరుని పాదపద్మాలు ఆశ్రయించి మోక్షము పొందాలి అను పంతము విడువకు.
ఒకవేళ నిగ్రహము చాలక ఇంద్రియ సుఖాలవైపు పరుగెత్తావా !
నువ్వే పాము పడగవు అవుతావు. (భయముతో సుఖముండదు అని భావం)
శరీరం ఆ ఇంద్రియ సుఖాలకు దగ్గరయ్యే సమయంలోనే ఈ విషయాన్ని జీవునికి చెప్పవలసినది.
(మనసు పారు అనగా -మనసుపోవు, ఇష్టమగు.అని మరొక అర్థంలొ కూడా అన్నమయ్య ప్రయోగం ఉంది)
ఆంగ్లానువాదము
O my mind!
Dont  Run towards sensory comforts.
Please take refuge the   Venkateshvara's footpaths. Dont leave the determination of salvation.
If the body is running towards sensory pleasures ,You're going to the shadow of snake's crest or hood.
This is what the mind needs to say when the body is close to that sensory comforts..
139
అప్పుడు చూచేదివో అధికుల నధముల
తప్పక యెచ్చరి యిదే తలచవో మనసా(2-117)
English transliteration
Appuḍu cūcēdivō adhikula nadhamula
tappaka yeccari yidē talacavō manasā(2-117)
వివరణం.
ఓ మనసా!
ఆ సందర్భము వచ్చినప్పడే లోకములో అధికులెవరో,అధములెవరో గ్రహింపవచ్చు
ఇదే నీకు హెచ్చరిక!
దీనిని చక్కగా భావించుకో
ఆంగ్లానువాదము
O my mind!
When that occasion comes, we know about superiors or low fellows in the world
  This is a warning to you!
Think of this very well.
140
నమ్మితి జుమ్మీ వో మనసా నాకే హితవయి మెలంగుమీ
ముమ్మాటికి నే జెప్పితి జుమ్మీ మురహరునామమే జపించుమీ (4-487)
English transliteration
Nam'miti jum'mī vō manasā nākē hitavayi melaṅgumī
mum'māṭiki nē jeppiti jum'mī muraharunāmamē japin̄cumī
(4-487)
వివరణం.
ఓ మనసా!
నిన్ను నమ్మాను.
నాకు మేలు కలిగేటట్లు ప్రవర్తించు
అన్ని విధాలుగా నేను చెప్పాను.
ముర అను పేరుగల రాక్షసుని చంపిన వేంకటేశ్వరుని నామమే ఎప్పుడూ జపించు.
ఆంగ్లానువాదము
O my mind!
I trust you.
Behave like good to me
In all respects I said.
Never forget the name of Venkateshwara who killed a monster named Mura.
***

No comments:

Post a Comment

Pages