అలరించిన ఉగాది సంబురాలు - అచ్చంగా తెలుగు

అలరించిన ఉగాది సంబురాలు

Share This
అలరించిన ఉగాది సంబురాలు
ఓరుగంటి సుబ్రహ్మణ్యం 



ఆంధ్ర కళా సమితి మరియు రాష్త్రేతర తెలుగు సమాఖ్య సంయుక్తంగా  విళంబి నామ ఉగాది వేడుకలు  నిర్వహించారు. శ్రీమతి పద్మావతి త్యాగరాజు ఆధ్వర్యంలో  గంట సేపు సాగిన కర్ణాటక  శాస్త్రీయ  ఫూజన్ సంగీతం ప్రేక్షకులను అలరించింది. శాస్త్రీయ  సంగీతంలో ఎన్నడూ ఉపయోగించని  డ్రంస్, గిటార్, జాజ్  వాద్యాలతో   చక్కని గీతాలాపన చేసి శ్రోతల  మన్ననలు పొందారు. 
న్రుత్యకళాంజలి సారధ్యంలో  దశావతారాలు న్రుత్య రూపకం ప్రదర్శించి ఆహుతులను పర్వశింప చేసారు. తెలంగాణ  ప్రభుత్వ సహకారంతో ప్రదర్శించిన జానపద పాటలు న్రుత్యాలతో  యువతను  ఉర్రుతలూగించాయి.  
ఈ కార్యక్రమానికి స్తానిక నిర్మాణ సంస్త అధిపతి శ్రీ ఎల్.ఆర్.వెంకట్రామన్ గారు  ముఖ్య అతిథిగా, ప్రఖ్యాత కూచిపూడి   నాట్యాచార్యులు  శ్రీ ఎం. శ్రీరామచంద్రమూర్తి గారు గౌరవ అతిథిగా విచ్చేసారు.  ఆంధ్ర కళా సనితి, రాష్త్రేతర తెలుగు సమాఖ్య ప్రతినిధులు సంయుక్తంగా అతిథులను ఘనంగా సన్మానించారు. అశ్వనీకుమార్ గారి  వందన సమర్పణతో పన్వెల్లో విళంబి ఉగాది వేడుకలు ముగిశాయి.

No comments:

Post a Comment

Pages