నేను-అరిషడ్వర్గాలు - అచ్చంగా తెలుగు
నేను-అరిషడ్వర్గాలు
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

నిగ్రహంగా ఉందామని ప్రయత్నిస్తుంటే
అరిషడ్వర్గాల్లో ఏదోఒకటివచ్చి  
నాపై ఉచ్చుపన్నుతూ ఉంటాయి.
నా నిగ్రహాన్ని రెచ్చగొడుతూ ఉంటాయి.
ఒకసారి కామం కడలిలా వచ్చి
నా నిగ్రహాన్ని ముంచివేస్తుంది.
మరోసారి క్రోధం కరుకుగా వచ్చి
నా నిగ్ర హాన్ని కాటేస్తుంది.
ఇంకోసారి లోభం లోపాయికారిగా వచ్చి
లోపలలోపలె నా నిగ్రహాన్ని లోబరుచుకుంటుంది. 
వేరొకసారి మోహం వరదలా వచ్చి
నా నిగ్రహాన్ని ముంచేసి పోతుంది. 
వేరొకసారి మదం మెల్లగా వచ్చి
నా నిగ్రహంపై కదం త్రొక్కిపోతుంది.
మరొక్కసారి మాత్సర్యంవచ్చి తాత్సారం చేసి 
నా నిగ్రహాన్ని చీత్కారం చేస్తుంది.
***
                 

No comments:

Post a Comment

Pages