సంతృప్తి - అచ్చంగా తెలుగు
సంతృప్తి
రవి భూషణ్ శర్మ కొండూరు

విజయవాడ రైల్వే స్టేషన్లో జన సందోహంతో బాగా రద్దీగా ఉంది; ఇసుక వేస్తె రాలదు అంతమంది జనం తొక్కిసలాట; పైగాఅయ్యప్ప స్వాముల సీజను; నువ్వు కాస్తజాగ్రత్తగా ఉండు. నల్ల డ్రస్సులో ఉన్న వారందరూ అయ్యప్పలు కాదు; నువ్వో పెద్ద పిచ్చి మాలోకానివి; అందరిలో దేవుడున్నాడని తెగ జాలి పడతావు; వాళ్ళు వీళ్ళు ఎదో ఇచ్చారని రైలులోఅవి ఇవీ తినవాకు; రోజులు అస్సలే బాగోలేదు;అందులో మందు మాకు పెట్టి మనల్ని దోచేస్తారు; చాలాపొద్దున్నే నిద్ర లేచావు; అలానిరైలులో నిద్ర పోవాకు; మేడలో గొలుసు, చేతికి గాజులు పిచ్చివి వేసుకున్నావా? పోయినసారి లాగా బంగారమే ఉంచు కున్నావా? నీవి రెండు చాల్తీలు; ఒకటి నీ హ్యాండ్ బ్యాగ్గు రెండు నీ సూట్కేసు; అవి జాగ్రత్త; నీకు కావలసిన పేపర్లు అన్నీ తీసుకున్నావా?ఏంటి ఇందాకడ్నించి వాగిన దాన్ని వాగినట్టే ఉన్నాను, నీ నుంచి ఉలుకు లేదు! పలుకులేదు!!నేను చెప్పింది విన్నావా? బోధ పడిందా? ఆ... ఊ... అని సమాధానం చెప్పవే? అంటూవిజయవాడ నుంచి చీరాలఉద్యోగ నియామకంనిమిత్తం వెళ్ళుతున్న కూతురుసుధకిజాగ్రత్తలుచెప్పనారంభించిందిసూరమ్మ.
సూరమ్మనోటినుంచిహితబోధలుఆగని జలపాతంలావస్తున్నాయి; ఆమాటల్లోతనకుకూతురు మీద తనకున్న అమితమైన ప్రేమ, అనురాగం, లోకం మీద తనకున్న అపనమ్మకం, తనసొంత జీవితం నుంచితీసుకున్నకొన్ని చేదు అనుభవాల సారము ఇలా అన్నీ కలగలిపి రంగరించి పోస్తుందా అన్నట్టు ఉంది.
ఈ రైలూ పాడు ఎందుకు? హాయిగా AC కారులోవెళ్ళవే అంటేకారు నాన్నకి కావాలి నేను తీసుకెళ్తే ఆయన ఇబ్బంది పడతారు అంటావు; పైగారైలులో జనాల మధ్య వెళ్ళటం నాకు ఇష్టము. పది మందితో ఉండటం నాకు ఇష్టము అంటావు. ఇప్పుడు చూడు ఈ అలాగా జనం మధ్య ఈ తొక్కిసలాటలోచీరాలవరకు ప్రయాణం వంటరిగా చెయ్యాలి?ఎలా చేస్తావో? ఏమిటో?ఏమైనా అర్థం ఉందా? నీ ఈసాహసానికి! అంటూఇంకాఎదో అనబోతున్న సూరమ్మని, వారిస్తూ
అమ్మా! విజయవాడ నుంచిచీరాలకివెళ్ళాలంటేపినాకినిరైలంతసుఖంకారు కాదు కదావిమానంలో వెళ్ళినా రాదు! చక్కగాఉదయం 6:00గంటలకి బయలుదేరి 7:30కల్లా చీరాలస్టేషన్లోఉంటాను; ఇదైనా ఒక పుస్తకమో ఓ పేపరో పట్టుకుంటే అదిపూర్తి అయ్యేలోపల చీరాలరానే వస్తుంది; మరీఅంత కంగారు ఎందుకు అమ్మా? నీ కంగారు కొద్దీ చీరాలలోఉన్న ప్రసాదు మామయ్యకి నన్నుస్టేషన్లోకలుసుకోమని చెప్పావు కదా? మామయ్యా నన్ను చీరాలలోకలుస్తాను అన్నాడా? మరి నీకు కంగారు ఎందుకమ్మా? నేను ఏమైనా చిన్న పిల్లనా? రేపోమాపోదేశ విదేశాలలో తిరగాల్సిన దాన్ని. నాచీరాల ప్రయాణానికేఇంత కంగారు పడితే; రేపునేనుఅమెరికానో, ఇంగ్లాండొ వెళ్ళాల్సి వస్తే అప్పుడు నన్నువెళ్ళ నీయవా? నీకు అంత కంగారు మంచిది కాదమ్మా. హాయిగా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు; ఈపాటికినాన్న గారి పూజ కూడా అయిపోయి వుంటుంది;ఇంకాలేటు చేస్తే బయట కారు డ్రైవరు ఏటో పొతే వాడికోసం మళ్ళీ నువ్వు వెదుక్కోవాలి. అంటూ ఉండగానే.
పినాకినీరైలుఒకటవ నెంబరు ఫ్లాట్ఫారం నుంచి బయలుదేరుటకు సిద్ధంగానున్నది అని ప్రకటన విజయవాడ స్టేషన్ లో మారుమ్రోగింది; అదివినపడగానే సూరమ్మకు ఇక్కడ లేని దుఖం ముంచు కొచ్చింది. అమ్మా! ఎవరాన్న చూస్తె బాగుండదు; ఊరుకో అమ్మా! వొచ్చే వారం నువ్వు నాన్నకలసిచీరాల వొస్తున్నారు కదా; ఒక్కవారం రోజుల భాగ్యానికి ఎందుకు అమ్మా అంత బాధ పడతావు.ఊరుకో.నీకెందుకునేనురోజూ ఫోను చేస్తా, నా వివరాలు ఎప్పటికప్పుడు నీకుతెలియ చేస్తా, సరేనా? అంటూ తల్లిని వోదార్చుతున్న సమయంలో రైలు మెల్లిగాబయలు దేరింది. ప్లాట్ఫారం మీద నుంచిసూరమ్మఒకచేయిఊపుతూమరో చేత్తో చీరకొంగుతోకనీళ్ళు తుడుచుకుంటూ ఉండి పోయింది.
రైలు కాస్త వేగం పుంజు కున్నాక, తన అభిమాన వ్యక్తి తను ఎంతగానో ఆరాధించే వ్యక్తిత్వంకల అబ్దుల్ కలాం గారు వ్రాసిన “Wings Of Fire” అనే పుస్తకం తీసిచదవ సాగింది; రైలుఎంతవేగంగా కదులుతుందొఅంతే వేగంగా పుస్తకం లోనిపేజీలు కూడాకదులుతున్నాయి. మధ్య మధ్యలో తన హ్యాండ్ బ్యాగ్ మీద ఒక చెయ్యి కాళ్ళ దగ్గర ఉంచిన సూట్కేసు మీద దృష్టి పెడుతూ మరు క్షణం పుస్తకంలోకినిమజ్ఞమై పోయింది. ఇది ఇలా ఉండగా టికెట్లు చెక్ చేయటానికి ఒక సారి కండక్టర్, మరో సారి ఇడ్లీలు అమ్మే వాడు, మరో సారి టీ-కాఫీ అంటూ మరొకడు; కాసేపటికి వార పత్రికలూ వార్తాపత్రికలు అమ్మేవాడుఇలాఒకరితరువాత ఒకరు వొచ్చి అరుస్తున్నాఒక్క సెకను పాటు కూడా వారి వైపు చూపు కూడా మరల్చా కుండా తనపుస్తకం మీద ధ్యాస పెట్టిపేజీలు  ఒకటి తరువాత ఒకటి చక చకా తిరుగురున్నాయి. 
ఇది ఇలా జరుగుతుంటే; “అక్కా!! అక్కా!!” అంటూ ఓ గొంతు వినపడింది. తల పుస్తకం లోంచి తీసి, ఒక్కసారి ఎవరా అన్నాట్టు చూసింది సుధ. ఎదురుగాషుమారు తొమ్మిది సంవత్సరాల పిల్లాడు వొంటి మీద చొక్కా లేకుండా, చిరిగి పోయిన మకిలిపట్టిన లాగుతో; చలికిచిట్లిపోయిన శరీరంలో,రెండు మూడు బలమైన మానిన గాయపు గుర్తులతో,చింపిరి జుట్టుతో, ఓనల్లనిగుడ్డతో భోగీ తుడుస్తూ కనపడ్డాడు.ఆభోగీలోమిగిలిన అందరూ ఆపిల్లాడిఉనికిని గానీ, వాడి దుస్థితిని గానీ, వాడి పరీస్థితిని గానీ గమనించ లేదుకదా...  కనీసం వాడి మీద జాలిదయ లేకుండా, ఒకడుఈ పిల్లాడిని ఒక దొంగలాచూస్తూ తన బ్యాగ్గులు సర్దు కుంటున్నాడు, మరొకడుఅసహ్యంగా మొఖం పెట్టాడు, మరొకరు తన కాళ్ళు పైకెత్తి వాడిని అక్కడ తుడవ మన్నాట్టు సౌజ్ఞ చేసాడు. మరొకడు వాడు తినే ఇడ్లీ తింటూపొట్లం మరో పక్కకు తిప్పితినటం కొనసాగించాడు, మరొకరు తన పిల్లలని దగ్గరకు లాక్కుని ఆ పిల్లాడిని కసురు కున్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ పిల్లాడిని చూసి స్పందిచారు. ఆ స్పందనలు పిల్లవాడుఏమాత్రం పట్టించుకోలేదు ప్రతిస్పందన కూడాఏమీలేదు; ఆక్షణంలోఆ పిల్లాడిలో రమణ మహర్షిలానొ భగవత్ గీతలో చెప్పిన స్థితప్రజ్ఞ కలవానిగా తోచింది సుధకి. 
మళ్ళీ“అక్కా!! కాళ్ళు తీయక్కా!! ఆ మూల చెత్త ఉంది అదితీస్తాను అన్నాడు”. సుధావెంటనే,ఆ పిల్లాడి కళ్ళలో తన కళ్ళు పెట్టి సూటిగా చూసి; ఒక చిరు నవ్వు నవ్వి; “వొద్దు నాన్నా! అది నువ్వేమీ తీయనక్కరలేదు, రైల్వే వారు శుబ్రం చేస్తారులే”అని చాలా సౌమ్యంగా నవ్వుతూచెప్పింది; వెంటనే పిల్లాడు లేచి తన చేతిగుడ్డ చంకలో పెట్టుకుని డబ్బు కోసం చెయ్యి చాచాడు. అంతే, అక్కడున్న అందరూ వాడ్ని విసుక్కుని చికాకుగా వెళ్ళు ... వెళ్ళు ... అని గట్టిగా అరిచారు. వాళ్ళా ఆ ప్రవర్తనకి సుధకికొంచెం కోపం వొచ్చింది కానీ ఏమీ అనకుండా తన పర్సు లోంచి ఒక 50 రూపాయలునోటుతీసి ఇవ్వబొయింది. ఆ పిల్లాడు సహజంగారైలులో ఎవరైనా దాతలు ఒక రూపాయో రెండు రూపాయలో ఇవ్వటం పరిపాటి; కానీఈమె ఏకంగా50 రూపాయలునోటు ఇవ్వచూపటంతో; ఇలాంటి అనూహ్యమైన పరిణామానికి కొంచెం ఆశ్చర్యంగ కలిగి; కొంచెం అనుమానంగా చూస్తూ.. “నా దగ్గర అంత చిల్లర లేదు, అక్కా!!” అన్నాడు చాలాఅమాయకంగా. “ఇది నీకోసమే ఏమైనా కొనుక్కో” అని నవ్వుతూ తన చేయిని పిల్లాడికి మరింత దగ్గరగా తెచ్చింది సుధ. పిల్లాడు ఆ డబ్బు తీసుకుని ఆ భోగీలో మరెవ్వరిని అడగకుండా వెళ్లి పోయాడు. ఇదిగో అమ్మా మీలాంటి వారివల్లేఅడుక్కునే వాళ్ళు రోజు రోజుకీ పెరుతున్నారు; అని ఒకడు; ఈ బెగ్గర్స్ పెద్ద మాఫియా అండీ అని ఒకడు. తల్లిదండ్రులు కని రోడ్డు మీద పడేసారు ఇదిగో ఇలా న్యుసెన్స్ క్రియేట్ చేస్తారని మరొకడు; ఈ మధ్య కాలంలో పిల్లలకు డబ్బు విలువ తెలియటం లేదు; ఎంత పడితే అంత పాకెట్ మనీ తల్లిదండ్రులు ఇస్తున్నారు; పిల్లలు ఖర్చులు పెడుతున్నారనిమరొకడు; అంటున్నా సుధ తనకేమీ పట్టనట్టు తనకి సంబంధం లేదు అన్నట్టు మళ్ళీ పుస్తకం లోకి తల దూర్చింది. కానీ ఎందుకొ మునుపు చదివిన వేగం ఇప్పుడు పేజీలు  కదలటం లేదు; మునుపు ఉన్న ఏకాగ్రత ఇప్పుడు లేదు; మునుపు ఎంతమంది భోగీలోకివొచ్చినా? ఎంత అరచినా? గీపెట్టినా? ఏకాగ్రత చెదరని సుధ ఇప్పుడు మాటి మాటికీ ఇదో ధ్యాసలో పడటం మళ్ళీ పుస్తకం చదివేప్రయత్నం చేయటం ఏదో తెలియని లోటు వెలితిగా అనిపించటంతో పుస్తకంలో తను చదువుతున్న పేజీకి గుర్తుగాఒక చిన్న మడత పెట్టి పుస్తకం మూసి; కిటికీకి తల ఆనించి తన ఎఱ్ఱనిచున్నీ ముఖాన కప్పుకుని ఎదో ఆలోచనలో మునిగిపోయిన సుధ మెల్లిగా అప్రయత్నంగా నిద్రలోకి జారుకుంది. 
ఇలోగాఎదోస్టేషన్వొచ్చింది ఎక్కే జనం దిగే జనం ఆ హాడావుడితో, భోగీలో అలజడి వల్ల సుధకి చటుక్కున మెలుకువవచ్చింది; వెంటనేతన చేతికి ఉన్న గడియారంలో 730am అయినట్టు గమనించి కిటికీ కొంచెం పైకి ఎత్తి చూసే సరికి తను దిగాల్సిన చీరాల రానే వచ్చింది; అంతే వెంటనే తన సీటు నుంచి లేవటం, తనహ్యాండ్బ్యాగ్ లగేజీ తీసుకుని చంగుమని ఒక్క అంగలో రైలు నుంచి క్రిందకిదిగింది.
క్రిందికి దిగగానే,సుధప్రసాదు మామయ్యకి ఫోను చేసి; “మామయ్యా! నేను చీరాలలో రైలు ఇప్పుడేదిగాను, రైలుఒకటవనంబరుప్లాట్ఫారం మీద ఆగింది; మీరుస్టేషన్కివొచ్చారా? ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు రానక్కరలేదు నన్ను అటో చేసుకుని మీ ఇంటికి రమ్మంటారా?..”అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది; “నేను దారిలో ఉన్నా తల్లీ! ఇంకో 10 నిమిషాల్లో అక్కడ ఉంటా; చీరాలస్టేషన్ మాస్టారుగా పనిచేస్తున్నమనోహర్రావునా చిన్ననాటి స్నేహితుడు వాడి దగ్గరికి వెళ్ళు ... వాడి ఆఫీసులో ఉండు; నేను అక్కడికే వస్తాను అన్నాడు”.ప్రసాదు మామయ్య.
“ఆలేగే మామయ్యా” అంటూ సుధ ఫోను పెట్టేసి... స్టేషన్ మాస్టారు మనోహర్రావు గారి కార్యాలయం వైపు నడకసాగింది.ప్లాట్ఫారం మీద ఒక పక్కన కొంత మంది గుమ్ముగూడి ఇదో గొడవ పడుతున్నట్టు కనపడింది; అలాంటి విషయాలలో జోక్యం చేసుకోవద్దు అని ఒకటికి పది సార్లు అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చి మళ్ళీ ఇందులో తల దూర్చటం ఎందుకులే అని పట్టించుకోలేదు; ఒకపక్క గొడవ పడుతున్న జనం అరుపులు, మరో పక్క చీరాల నుండి చెన్నై వెళ్ళే రైలు ఒకటవ నెంబరు ప్లాట్ఫారం నకువొచ్చియున్నది అని ప్రకటన; రైలుఇంజనుకూతలు, వ్యాపారుల అరుపుల మధ్యలో లీలగా“నన్నుకొట్టద్దు, కొట్టద్దుప్లీజ్” అంటూ ఏడుస్తూ దీనంగా ఎవరో అరుస్తున్నట్టుసుధ చెవిన పడింది. అదే గొంతు; అదే స్వరం; చాలా పరిచయం ఉన్న గోతులా అనిపించి; ఆ పిలుపు ఎటు నుంచి వొచ్చిందో అటువైపు అప్రయత్నంగా తల తిప్పి చూసింది సుధ. అక్కడకి కొంత దూరంలో ఇందాక రైలు భోగీలో తను 50రూపాయలు ఇచ్చిన పిల్లాడు కనబడ్డాడు; వాడిచుట్టు జనం చేరి తలా ఒక దెబ్బ కొడుతున్నారు; అది గమనించిన సుధ; హుటాహుటినఆ గొడవ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళింది; ఆ పిల్లాడు సుధని చూడగానే “అక్కా!!” అనిపెద్దగాఏడుస్తూ సుధ వైపు పరుగు తీయబోగా అక్కడే ఉన్న ఒక వ్యక్తి పిల్లాడినికాలితో ఒక తన్ను తన్నాడు. దాంతో ఊక బస్తా ఎగిరి పడ్డట్టు ఆ పిల్లాడు దూరంగా మట్టిలోపడ్డాడు; అంతే... సుధకి ఎక్కడలేని కోపం కట్టలు తెంచుకు వొచ్చింది; మీరు మనుషులా? పశువులా? పసి పిల్లాడిని గొడ్డును బాదినట్టు బాదుతారా?  మీకుఈ పిల్లాడిని కొట్టే అధికారం ఎవరుఇచ్చారు?ఈ పిల్లాడు ఏమి చేసాడు; మీరుఇంతఖటినంగా శిక్ష విధిస్తున్నారు? పిల్లల మీద ఎలాచేయి చేసుకుంటారా? ఎదో మందలించి వదిలేయాలి లేకపొతే పోలీసులకి అప్ప చెప్పాలి అంతే కానీ మీరుఇలాచేయి చేసుకుంటారా? తగలరాని చోట తగిలి పిల్లాడికి ప్రాణాపాయ పరీస్థితి వొస్తే? ఏదైనా తీరని ఆరోగ్య సమస్య వొస్తే?మీలో ఎవరు బాధ్యత తీసు కుంటారు? అంటూ వారిమీద విరుచుకు పడింది;భద్ర కాళిలా; దూరంగా పడిన పిల్లాడి దగ్గరకు వెళ్లి వాడినిలేపితన అక్కున చేర్చుకుంది సుధ. ఇది అంతా గమనిస్తున్న పినాకినీ రైలు జనం ఒక్కొక్కరుగారైలు దిగి చూట్టు చేరారు; రైల్వేపోలీసులు వొచ్చి విచారణ మొదలు పెట్టారు; అమ్మా! మీరుబయలు దేరండి?ఈ పిల్లాడి సంగతి మేము చూసుకుంటాము; మీపనికి మీరు వెళ్ళవచ్చు; ఇక ఇక్కడ మీరు ఉండకూడదు; మిమ్మల్ని కూడా బుక్ చేయాల్సి వస్తుంది; ఈ సంగతి మేము చూసు కుంటాము అన్నాడు కానిస్టేబుల్ రంగా రావు; సుధవెంటనేరంగా రావుతోఏంటీ నన్ను కూడా బుక్ చేస్తారా? అంటూ ఇంకా ఎదో మాట్లాడటానికి లేవ బోగా, ఆ పిల్లాడు సుధ చేయి పట్టుకుని తనని వదలి వెళ్ళద్దు అన్నట్టు; పోలీసుతో గొడవ పడవద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపి సౌజ్ఞ చేసాడు; నిన్నువిడిచి నేను ఎక్కడికీవెళ్ళను; అన్న భరోసా తన కళ్ళతోనే పిల్లాడికిస్తూ, నన్ను వీరు ఏమీ చేయరు అని చెప్పి లేచికానిస్టేబుల్ రంగారావుకి తన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఎదో కాగితం తీసి చూపించింది. ఆ కాగితం తీసుకుని చూసికానిస్టేబుల్ రంగారావుకంగారు కంగారుగా“సారీ మేడం, సారీ మేడం, మీరు ఇక్కడే ఉండండి.. మా సారును పిలుస్తాను... సారీ మేడం..” అంటూ అక్కేడేకొంచెం దూరంలో నున్నCI సుందరందగ్గరకిపరిగెత్తుకుంటూ వెళ్లి సుధ ఇచ్చిన కాగితం చూపించాడు రంగారావు. అంతే కూడాCI హడావుడిగా వొచ్చి“సెల్యూట్ చేసి, సారీ మేడం ... మిమ్మల్ని మేము గుర్తించలేదు; సారీ... మీరు ఏమీ అనుకోవద్దు”, మీరుకలక్టరు గారి ఆఫీసుకు చేరే ఏర్పాట్లు నేను చేస్తాను; మీరు ఇక్కడే ఉండండి; అంటూఆ కాగితం తిరిగి సుధ చేతికి ఇచ్చాడు CI సుందరం.ఈలోగాకానిస్టేబుల్ రంగారావు అక్కడ గుమ్ముగూడి ఉన్న జనాన్ని వెళ్ళమని చెప్పి జనం మొత్తంఅక్కడనుంచి వెళ్ళేలా చేశాడు. మేడం మీకు ఏదైనా కారు గానీ జీపు గానీ రెడీ చేయ మంటారా? అని అడిగాడు CI; ఒకకారుఏర్పాటు చెయ్యండి అని చెప్పి, తిరిగి పిల్లాడి దగ్గరకి వెళ్లి క్రింద కూర్చొని “నీ పేరు ఏంటి నాన్నా?” అని అడిగింది సుధ;  పిల్లాడు“గోపాల్ ” అని కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు. సుధ వెంటనే,రంగారావు గారు!  మీరు ఒక్కసారి ఇటు రండి; అని పిలిచి; తన పర్సులోంచి రెండు వేయిరూపాయల నోట్లు తీసి రంగా రావు చేతిలో పెట్టి గోపాల్ కి రెండు మూడు జతల బట్టలు; పిల్లాడు స్నానానికి; భోజనానికి కూడాఏర్పాట్లు చెయ్యండి అనిచెప్పి; ఈ లోగా అక్కడకుస్టేషన్ మాస్టారు మనోహర్రావుతోకలసిప్రసాదు మామయ్యా చేరు కున్నారు;ప్రసాదు మామయ్యా సుధని చూడగానే, కలక్టరు గారికి నమస్కారము అనేటప్పటికి; సుధ లేచి ప్రసాదు మామయ్యాకాళ్ళకు స్టేషన్ మాస్టారు మనోహర్రావు కాళ్ళకు నమస్కరించి; సుధ వినయ విదేయతలకు చలించిన స్టేషన్ మాస్టారు మనోహర్రావు “అమ్మా సుధా... అతిచిన్న వయస్సులోపెద్ద చదువులుచదివి ఈ జిల్లా కలక్టరుగా వస్తూ; నువ్వు చూపిన వినయ విధేయతలకు నాకు చాలా ముచ్చట కల్గించాయి. నాప్రాణ స్నేహితుడి మరదలు ఈ జిల్లాకి కలక్టరుగా ఉంది అంటే అది నాకు చాలా గర్వంగానూ చాలా  ఆశ్చర్యంగానూ ఉంది తల్లీ. మీతల్లిదండ్రులుచాలాఅదృష్ట వంతులు అని ఆశీర్వాదాన్నితెలియ చేసారు; సుధ మర్యాద పూర్వకంగా ప్రసాద్ మామయ్యకిమనోహర్రావు గారికి నమస్కరించి, మామయ్యానాకు ఇక్కడ కాస్త పని ఉంది; అది ముగించుకుని మీ ఇంటికి వొస్తాను అని సాదరంగా ప్రసాదు మామయ్యానిమనోహర్రావు గారికిఇంటికి పంపించి.ఈలోగాపినాకినీ రైలు చెన్నై వైపు ప్రయాణం కట్టింది. ప్లాట్ఫారం మొత్తం ఖాళీ అయ్యింది. గోపాల్ తో మాటల్లో పడింది సుధ;
గోపాల్ నువ్వు ఎక్కడ ఉంటావు? మీ అమ్మా నాన్నలు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?ఇక్కడఎంతకాలం నుంచి ఉంటున్నావు?వెళ్ళు నిన్ను ఎందుకు కొడుతున్నారు? నువ్వు ఎమి చేసావు?అని ప్రశ్న మీద ప్రశ్న వేసింది. ఆ వేగంలో పిల్లాడి గురించి తెలుసు కోవాలివాడికి ఏమైనా సహాయం చేయాలన్న ఆదుర్దా కనిపించింది; అంతకుముందు వరకు అక్కా అక్కా అని సంబోధించిన గోపాల్; సుధ IAS ఆఫీసరని; ఈ జిల్లా కలక్టరని తెలిసి;
గోపాల్:“మేడం, నా పేరు, అదే... నా... నా...  పూర్తి పేరు ... గోపాలకిట్టయ్య;”
సుధ:గోపాల్, నువ్వు నన్ను అక్కా అని పిలువు; మేడం అని అననక్కర లేదు; సరేనా?
గోపాల్: సరే అన్నాట్టు తల ఊపాడు
సుధ: నీ ఇంటి పేరు ఏంటి?నీకు తెలుసా? నీకు గుర్తుందా?
గోపాల్:ఇంటి పేరు... ఇంటి పేరు... గు ... గు... గూండ్ల
సుధ: ఐతే నీ పూర్తి పేరు గూండ్ల గోపాలకిట్టయ్యఅన్న మాట ఐతేముద్దుగా నిన్ను కిట్టయ్య అని పిలవచ్చు; అని చిన్నగా నవ్వింది సుధ; గోపాల్కూడాచిరు నవ్వు నవ్వుతుండగా;
సుధ: నీది ఏఊరు? అమ్మా నాన్నలు ఎక్కడ ఉంటారు?
గోపాల్:అమ్మోళ్ళుకుడితిపాలెంలో ఉంటారు.
సుధ: కుడితిపాలెం అంటే, నెల్లూరు దగ్గర ఊరా? నీకుపూర్తిఅడస్సు తెలుసా?
గోపాల్:తెలియదు; అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ; మాఇంటి కాడ రాములోరి గుడి ఉంది; అని చెప్పాడు;
సుధ: ఓ.. కుడితిపాలెం .. రామాలయం దగ్గరా... మీ ఇల్లు... మరిమీ అమ్మ నాన్నల పేర్లు తెలుసా?వాళ్ళుఏపని చేస్తారు?
గోపాల్:యమ్మ పేరు లచ్చమ్మ.. నాన్న పేరు.. నాన్న పేరు.అనికొన్ని సెకన్లు ఆగి “ఏసు బాబు”;
సుధ: అమ్మా నాన్నలు ఏ పని చేస్తారు? అని మళ్ళీ అడిగింది;
గోపాల్:నదిలో పడవ నడుపుతారు ... సేపలుపడతారు;
సుధ: ఎంత కాలం నుంచి ఇట్లా ప్లాట్ఫారం మీద ఉంటున్నావు?
గోపాల్:ఒక సంవత్సరం నుంచి. అన్నాడు గోపాల్
సుధ:ఇంట్లోచెప్పా పెట్టకుండా వొచ్చావా?
గోపాల్:అవును అని తల ఊపి... అయ్యచచ్చేట్టుకొడతాడు...  అన్నాడు.
సుధ:ఉత్తపుణ్యానికి ఎందుకు కొడతాడు నాన్న? నువ్వు ఏదైనా తప్పు చేస్తే, మరితిట్టకుండా? కొట్టకుండా? మందలించ కుండా ... ముద్దు పెట్టుకుంటారా? తప్పు చేస్తే పెద్దవాళ్ళు కొట్టరా? నువ్వు ఎదో పాడు పని చేసి ఉంటావు అందుకే కొడతారనిఇంట్లోంచి పారిపోయి ఇలా ప్లాట్ఫారం మీద ఉంటున్నావు. అంతేనా?
గోపాల్: మరి మరి ...ఎదో చెప్పబోయి సంకోచించాడు గోపాల్;
ఈ లోగా, మేడం పిల్లవాడికి 3 డ్రెస్సులు; పిల్లాడికిఉదయంఅల్పాహారము రెడీ మేడం; అని కానిస్టేబుల్ రంగారావుచెబుతూచేతిలో చిల్లర నోట్లు ఇవ్వబోగా; ఆమిగిలిన డబ్బులు గోపాల్ కి ఇవ్వండి అని చెప్పింది సుధ;
సుధ:మళ్ళీ గోపాల్ వైపు తిరిగి,ఎమి జరిగింది చెప్పు; నీకు ఏమీ ఇబ్బంది రాదు; చెప్పు; అని భరోసా ఇచ్చింది;
గోపాల్: తమ్ముడు చచ్చి పోయాడు..
సుధ: తమ్ముడుచనిపోయాడా? ఎలాజరిగింది?నువ్వేమిచేసావు? ఏమిజరిగింది? అని ఉత్కంటతతో అడిగింది.
గోపాల్: తమ్ముడు... తమ్ముడు... అని ఎదో చెప్పే లోపు...
సుధ: నీ తమ్ముడు...పేరు ఏంటి? వాడి వయసు ఎంత?
గోపాల్: వెంకటేష్, ఐదు
సుధ: నీ తమ్ముడుకి ఏమైంది.. ఎలా చనిపోయాడు?
గోపాల్: అమ్మ నాన్నలకు తెలియకుండా నేనువెంకటేష్ ... నేనువెంకటేష్ ... నేనువెంకటేష్ ...
సుధ: ఆ చెప్పు.. నువ్వువెంకటేష్ ... ఏమిచేసారు?
గోపాల్: నేనువెంకటేష్, అమ్మ నాన్నలకు చెప్పకుండా.. నదిలోఈతకివెళ్ళాము;
సుధ: నీకు ఈత వొచ్చా?
గోపాల్: ప్చ్.. రాదు..
సుధ: నీతో పాటు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా అప్పుడు;
గోపాల్: ఒకమామఉన్నాడు..
సుధ: ఎవరు ఆ మామ? మీ కుటుంబానికి తెలిసిన వాడేనా?ఆమామ పేరు ఏంటి?
గోపాల్: నాకు ఈత నేర్పే మామ;నాయమ్మకి తమ్ముడు; టైగర్ రమేష్మామపేరు;
సుధ: ఐతే నది దగ్గర ఏమైంది?అడిగింది సుధ; 
ఎదో చెప్పబోతూ; పెద్దగాఏడ్వడం మొదలు పెట్టాడు; గోపాల్;  సుధ వాడిని సముదాయించివిషయ సేకరణఎంత ప్రయత్నించినా; గోపాల్ ఏడుపు ఆపలేదు; ఇంకాగోపాల్ ని ఇలా ఇబ్బంది పెట్టటం సమంజసం కాదని గ్రహించి;రంగారావు గారు, గోపాల్ స్నానం ఏర్పాట్లు చేయించి; ఆ బట్టలు వేసి మంచి భోజనం ఏర్పాట్లు చేయించి తయారుగా ఉంచండి;ఒకకారు డ్రైవర్ ని నాతొ పంపండి; ఇప్పుడు 8:30 కావస్తుంది; నేను ఒకటి రెండు గంటల్లో వొస్తాను; గోపాల్ ని జాగ్రత్తగా చూసుకోండి; ఇక్కడికీ వెళ్ళ నివ్వకండి; అని చెప్పి గోపాల్ నువ్వు స్నానం చేసి టిఫిన్ చేసి రెడీగా ఉండు నేను కూడా స్నానం చేసి మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడనుంచి బయలు దేరింది;
కారులో బయలు దేరిన; గోపాల్ చెప్పిన వివరాలు మరొక్కసారి మననం చేసుకుంది; గోపాల్ అమ్మ నాన్నల పేర్లు; లక్ష్మమ్మ; ఏసు బాబు; తమ్ముడి పేరు వెంకటేష్; మామ పేరు టైగర్ రమేష్; ఊరుకుడితిపాలెం; ఇంటి దగ్గర రామాలయం ఉంది; అని ఆలోచించు కుంటూ.కారు డ్రైవర్తోనెల్లూరుకుడితిపాలెం రామాలయందగ్గరకు పోనీ అని చెప్పింది; మేడం అది షుమారు 4 గంటలు పడుతుంది అన్నాడు డ్రైవర్ జానీ బాషా; నువ్వుఉదయం టిఫిన్ చేసావా? అడిగింది సుధ; లేదు అన్నాడు జానీ; ఐతే ముందు ఏదైనా భోజన హోటల్ కి తీసుకెళ్ళు అక్కడ టిఫిన్ చేసి మనం బయలుదేరుదాము అంది సుధ; అలాగే ఇద్దారు టిఫిన్ చేసి; చీరాల స్టేషన్ నుంచి నెల్లూరు ప్రయాణం కట్టారు; రోడ్డు విశాలం ఉండటం; కాస్తంత రద్దీ లేకపోవటం వల్ల 4 గంటల ప్రయాణం షుమారు 3 గంటల్లో ముగించారు;కుడితిపాలెం రామాలయం చేరుకున్నారు; అక్కడ చిన్న బస్తీలా ఉంది అక్కడున్న వారిని  టైగర్ రమేష్ గురించి ఏసు బాబు గురించి వాకబు చేసింది; సాధారణమైన దుస్తులు; బిళ్ళ బంట్రోతులు పోలీసు సిబ్బంది ఎటువంటి ఆర్భాటం లేకుండాఆ బస్తీలో తిరిగి చివరికి టైగర్ రమేష్ ని కలుసుకుంది సుధ;టైగర్ రమేష్ నుంచి గోపాలకిట్టయ్య ఇల్లు కన్నుక్కొని; వారిగుడిసేకిడ్రైవర్ జానీ భాషాతో చేరింది;తను కలక్టరు నని చెప్పకుండా; ఎదో పత్రికా విలేఖరినని చెప్పి వారి వివరాల కోసం వొచ్చాను అని చెప్పింది; వారితో మాటల్లో కధ తనకు పూర్తిగా అర్థం అయింది;
ఒక రోజున టైగర్ రమేష్, గోపాల్, వెంకటేష్ ఈత కోసం నదికి వెళ్లి నట్టు; పడవలో అందరూ కూర్చొని ఉన్న తరుణంలో పెద్ద అల వొచ్చి పడవ బోల్తాపడిందని; టైగర్ రమేష్ సాహసం చేత చిన్న కొడుకు వెంకటేష్బతికాడనిపెద్ద కొడుకు గోపాల్ నదిలో కొట్టుకు పోయాడని వారి నుంచి తెలుసుకుంది; ఐతేపాపం గోపాల్ చనిపోలేదని తల్లిదండ్రులకు తెలియదు తమ్ముడు చనిపోలేదని క్షేమంగా ఉన్నాడన్న విషయం గోపాల్ కి తెలియక నా వల్ల తమ్ముడు చనిపోయాడని ఇంటికి వెళ్తే తండ్రి కొడతాడని భయపడి ఇంటికి రాలేదని అప్పటి నుంచి ప్లాట్ఫారం మీద దుర్భర జీవనం గడుపుతున్నాడని తెలిసి జాలి పడింది; సుధ; ఐతే గోపాల్ బతికే ఉన్న విషయం వారి తల్లి తండ్రులకి చెప్పకుండా; మీరు త్వరగా తాయారు అయి నాతొ పత్రికా కార్యాలయానికి రావాలని మీ విషాదకధమా పత్రికలో వ్రాస్తామని మీ ఫోటో తీస్తామని ఎంతోకొంత డబ్బు కూడా ఇస్తామని చిప్పి వారిని తనతో పాటు కారులో చీరాల రైల్వే స్టేషన్ దగ్గరకు తెచ్చి గోపాల్ ను తన తల్లిదండ్రులకు అప్ప జెప్పింది; ఆక్షణలో గోపాల్ తల్లిదండ్రులు దగ్గరకి వెళ్ళకుండా సరాసరి తమ్ముడు దగ్గరకుచేరి ముద్దు పెట్టుకుని అందరూ ఆనంద భాష్పాలు కార్చారు;
ఉద్యోగంలో చేరిన మొదటి రోజున ఒక కుటుంబానికి జీవితాంతము తీరని లోటునుతీర్చిన తృప్తి సంతృప్తి నాకు మిగిలింది అని తన డైరీలో వ్రాసుకుంది సుధ;ఉదయం చీరాల స్టేషన్లో దిగినప్పటినుంచి అమ్మకి నాన్న గారికి ఫోన్ చెయ్యలేదని, మామయ్యా ఇంటికి కూడా వేళ్ళ లేదనిగుర్తుకు వొచ్చి నాలిక కరుచుకుని; వెంటనేఅమ్మకి ఫోన్ కలిపిజరిగినవిషయం వివరించి; అమ్మా చూసావా? నువ్వు చెప్పినట్టు నేనుకారులో కనుకచీరాల వొచ్చివుంటే నాకుమీకు ఈ సంతృప్తి లభించేదా?అని అడిగింది; దానికి తల్లి “నీ మంచి తనం, నీ ఉద్యోగం పట్ల నీకున్న ఆసక్తి, నిబద్ధత, ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్ష ఉన్నన్నాళ్ళూ నీకు సంతృప్తి కలిగించే అంశాలు ప్రతిక్షణం లభిస్తాయి, లభించాలి అని మా కోరిక”.
(అతి చిన్న వయసులో కలక్టరుగా ఎంపిక కాబడిన సుధ, తనఉద్యోగ నిర్వహణలో మొదటిరోజు ఎదురైన ఈ విచిత్రమైన సంఘటనని ఎలా పరిష్కారించింది, ఆ పరిష్కారం ఒక కుటుంబానికి ఎంతటి ఆనందాన్ని కల్పించింది, తనకు తన తల్లిదండ్రులకు ఎంత సంతృప్తినిచ్చిందన్న ఇతివృత్తం మీద రవీందు కలం వ్రాసిన ఈకధ “సంతృప్తి”, మీకు“సంతృప్తి” నిచ్చింది అని ఆశిస్తూ..... శ్రీ రవి భూషణ్ శర్మ కొండూరు,  శ్రీమతి ఇందు కిరణ్ కొండూరు)

No comments:

Post a Comment

Pages