ఎండమావి ! - అచ్చంగా తెలుగు
 ఎండమావి !
  కె.బి. కృష్ణ


“హార్టీ వెల్ కమ్ సర్ ? అంటూ కొంతమంది ఇంజనీర్స్ మరియు తదితర సిబ్బంది కారు లోంచి దిగుతున్న నన్ను చుట్టుముట్టారు. ఫ్లవర్ బొకేలు, దండలు, హైబ్రిడ్ గులాబీ పూలు, నాకు అందిస్తూ పోటీల పడి నా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. " ఓకే -- ఓకే ?" అంటూ నేను మూడు ఫ్లోర్స్ ఉన్న మా కంపెనీ లో ప్రవేశించాను. 
నాన్నగారు కంపెనీ హెడ్ కోసం ప్రత్యేకంగా తన చాంబర్స్ కి వెళ్లడానికి లిఫ్ట్ ఏర్పాటు చేయించారు. ఇంకెవరికీ ఆ లిఫ్ట్ లో ప్రవేశం లేదు.
నా చాంబర్స్ డోర్ మీద గులాబీపూలతో “వెల్కమ్ టు న్యూ బాస్ “ అని అలంకరించారు. నిజంగా నేను ఆనందాతిరేకం తో ఈ చాంబర్స్ లో ప్రవేశించాలి. కాని ఇప్పడు తప్పనిసరి తాంబూలంలా, బలవంతపు బ్రాహ్మణార్థంలా విచారంగా చాంబర్స్ లోకి వచ్చాను. నా వెంట ఉన్నవాళ్లందరూ వినయంగా నన్ను ఫాలో అవుతున్నారు, చాంబర్స్ తలుపు తెరవడం ఆలస్యం ఎదురుగా కుడి వైపున మెరూన్ కలర్ టేబుల్ మీద నాన్నగారి నిలువెత్తు పెయింటింగ్ నాకు గోచరించింది. " అయ్యో నాన్నా ఎందుకు ఇలా చేశారు ? ప్రగతిపధం లో నడుస్తున్న మన కంపెనీ ని దిక్కు లేకుండా చేసి, చదువు తప్ప ఏ మాత్రం వ్యాపారానుభవం లేని నా భుజాలమీద ఉన్నపళంగా ఈ కంపెనీ బాధ్యతలను అప్పచెప్పేశారే ? ఎంత అన్నాయం చేశారు ? ?" అనుకుంటూ విచారవదనంతో ఉన్న నా చేతికి గులాబీదండ ఇచ్చి నా పి.ఏ "నాన్నగారి ఫోటో కి వేసి నమస్కారం చేసి విధుల్లో చేరండి సార్" అన్నాడు.
హుందాగా సూటూ బూటూ లో ఎదుటివారి కళ్ళల్లోకి చూస్తున్నట్లుగా నాన్నగారి మెస్మరైజింగ్ చూపులకు బందీనైపోయి, నారి కళ్ళు తడి అవుతుండగా –
“నాన్నగారు ఎందుకు ఇలా చేశారు ?” అని నాలో నేను చిన్న స్వరం తో అనుకుంటూంటే,  "బాధపడకండి సర్ జరగాల్సిన కార్యక్రమం చూడండి. మీరు సీట్లో కూర్చుని రిలాక్స్ అయ్యాక మన సిబ్బందిని తమకు పరిచయం చేస్తాను-“ అని పి.ఏ అంటోంటే, పొడవాటి నా బల్ల వద్దకు వెళ్ళి, నా ఛైర్ లో కూర్చున్నాను. 
ఎదురుగా నాన్నగారు బంగారం తో చేయించిన వినాయకుని ప్రతిమ, వేంకటేశ్వరస్వామి, అలివేలుమంగల ప్రతిమలు భక్తితో నన్ను నమస్కరింపచేశాయి.
“ పి.ఏ గారు ఒక గంట పోయాక పిలుస్తాను. లెట్ మి రిలాక్స్” అంటూంటే పి.ఏ వెళ్ళిపోయాడు. నేను ఛైర్లో సర్దుకుని కూర్చుని, మరలా నాన్నగారి పెయింటింగ్ వైపు తదేకంగా చూస్తోంటే-- నా ఛాంబర్స్ లో గాలివాన వచ్చేటప్పడు ఆకాశం లో నిలువునా మెరుపు మెరిసినట్లుగా ఒక మెరుపు మెరిసింది. ఐదున్నర అడుగుల కన్నా ఎత్తులో మెరూన్ కలర్ చీరలో, నల్లని రంగు జాకెట్ ధరించి, ఒక అమ్మాయి ప్రవేశించింది. చందమామ లాంటి ఆమె ముఖం లో కళ్ళు తారకల్లా మెరిసిపోతూంటే, నాసిక పొడవుగా కొనదేరి బహు చక్కగా వుంది. ఆ నాసిక మీద బంగారు రంగు కోటింగ్ లో సన్ గ్లాసెస్ వున్నాయి. ఆమె పెదవులు లేత గులాబీ రంగు లో గులాబీ మొగ్గల్లా ఉన్నాయి. నుదురు లో పెద్ద కుంకుమ బొట్టు ఆకట్టుకుంటోంది. బుల్లిగెడ్డం చక్కగా వుంది. ఆమె నన్ను చూసి నవ్వింది సమ్మోహనంగా, అప్పడు ఆమె బుగ్గలు సొట్టలు పడ్డాయి, ఈ డింపుల్సే మగాళ్ళని మత్తెక్కిస్తాయని విన్నాను. ఒక్కసారి నన్ను చూడగానే పైట భుజం మీదకు లాక్కుని నిండుగా కప్పకుంది. వెనకటి హిందీ తార జయాబచ్చన్ లాగా ఎంత రాయల్ గా క్లాస్ గా వుందో చెప్పలేను. ఏది ఏమైనా ఆడాళ్ళు చీర కట్టులోనే పొందికగా సౌందర్యం తో వెలిగిపోతుంటారు.
ఆమె ఎత్తుకు తగిన శరీరసౌష్టవం తో చాలా ఆకర్షణీయంగా మిల్కీబ్యూటీ అని అంటారే అచ్చం అలానే వుంది. బ్రహ్మదేవుడు ఈమెను సృష్టించే సమయంలో తదేకంగా గమనిస్తూ చేశాడేమో ! ఆమె చూపులు మన్మధబాణాల్లా గుచ్చుకుపోతాయి మగాళ్ళకు ఇదేగా మగవాడి పతనానికి తొలి మెట్టు. ఆమె నా ఎదురుగా వచ్చి వందలాది గులాబీలు ఉన్న గుత్తి నా చేతిలో ఉంచి-- " నా పేరు మోహన, మీ నాన్నగారి పెర్సనల్ సెక్రటరీని. నాన్నగారి సెక్రటరీ నా కెందుకు అనుకోకుండా నన్నే కంటిన్యూ చేసినందుకు మీకు ఎంతగానో ఋణపడి వుంటాను. ధ్యాంక్యూ-- వెరీమచ్ -- పెర్సనల్ సెక్రటరీ అంటే కంపెనీ లో ప్రోగ్రాములూ, టూర్స్ వగైరాలలో సహాయపడడమేగాకుండా, వ్యక్తిగతంగా, ఐ మీన్, పెర్సనల్ గా మీకు కలిగే మానసిక శారీరక ఇబ్బందులు కూడా నాతో పంచుకోవచ్చును, వితవుట్ ఇనహిబిటేషన్స్ దటీజ్ మై స్పెషాలిటీ- ?" అంటూ హస్కీవాయిస్ తో మాట్లాడుతోంది, ఆమె చూపులు నా పై ప్రసరించగానే, ఏమిటో నా బ్రహ్మచారి శరీరం ఒక్కసారి ఎగిరి గెంతులేసినంత పనైంది. నాకు ఎవరైనా వెనుక వీపు మీద మెల్లగా తట్టి ధైర్యం చెబితే బాగుండునని అనిపించింది సుమా, కొంచం తేరుకుని-- “ఓకే -- ఓకే- నేను మా డాడీ లా ఎక్కువగా మాట్లాడను. అందుకని నాకు ఇగో ఎక్కువని అనుకోవద్దు. యువర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇంప్రెస్డ్ మీ- యూ కెన్ గో టు యువర్ రూమ్” అన్నాను.
నా ఛాంబర్స్ కి కుడి ప్రక్కగా రెండు రూమ్స్ ఉన్నాయి. ఒకటి నాకు రిలాక్సింగ్ రూమ్ రెండోది పెర్సనల్ సెక్రటరీది. యడమ ప్రక్కన ఒక విండో, వెనుక ఒక డోర్, ఆ డోర్ లోంచి బాల్కనీ లోకి వెళ్ళచ్చు ఆమె వయ్యారంగా నడుచుకుంటూ తన రూమ్ లోకి వెళ్తుంటే, యాంత్రికం గా అటు చూశాను, ఆమె వెనుక భాగం కదలికలు, జాకెట్కీ, చీరకీ మధ్యన నున్నిని గీత మత్తెక్కించేలా వుంది. నా చూపులు గుచ్చుకున్నాయేమో, చటుక్కున వెనక్కి తిరిగింది. అప్పడు తెలుగు సినిమాల్లో ప్రఖ్యాత దర్శకులు పళ్ళతోనూ,
పూలతోనూ, పక్షులతోనూ ఆడుకునే మెరిసే నున్నని పొట్ట మధ్యభాగం కనుపించింది. ఆమ్మో ఈమె అందచందాలు నన్ను మోహావేశుణ్ణి చేసి పతనావస్థకు చేర్చేటట్లున్నాయి.
స్త్రీల అందచందాలకు ఆకర్షితులవడమనే విషయంలో యువకుల నుండి, వృద్దుల వరకూ, పెద్దగా తేడా లేదు. అయితే ఆ ఆకర్షితులవడం లో అందగత్తెలకు పాయింట్ ఉంది. యువకులతో ప్రమాదం పొంచి ఉంటే, వృద్దులతో ఏమీ ప్రమాదం లేదు. 
నాన్నగారు ఈమె సౌందర్యలహరిలో కొట్టుకుపోయేవారని వెంట పడేవారనీ అందరూ చెవులు కొరుక్కుంటూంటే ఏమో అనుకున్నాను, కాని ఇప్పడు నాకు అనుమానం పొడసూపింది. మగవాళ్ళ చరిత్ర లో అలనాటి ద్రౌపది నుండీ కాంతాదాసులయ్యారు గదా, అయితే నేను అలా కాకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఇదేమిటి కంపెనీ బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే స్త్రీ సౌందర్యం నన్ను ఆడిస్తోంది మానసికంగా, అనుకుంటూ లేచి నిలబడి ఆయిల్ పెయింటింగ్ లో నాన్నగారికి చేతులు జోడించి “ సేవ్ మీ “ అన్నట్లుగా నమస్కరిస్తోంటే ఆయన కనుబొమలు ఎగరేసినట్లు గా అనిపించింది నాకు.
పాపం నాన్నగారు-- ఐ పిటీ హిమ్, ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ఏభైసంవత్సరాలు దాటేక కంపెనీల్లో ఆఫీసుల్లో సంస్థల్లో పనిచేసే
యజమానులు తమతమ సెక్రటరీలుగా అమ్మాయిలనే నియమించుకుని వారినే మోహిస్తుంటారు మౌనంగా, వారి పొందు కోసం ఆరాటపడుతుంటారు. కారణం తెలియక ఏమిటీ ఈ ముసలాడు నా తండ్రి వయసు వాడు నన్ను మోహిస్తున్నాడు, వెధవ, తన కింద పని చేస్తున్నానని లోకువ అనుకుంటూంటారు. కాని అది నిజం గాదు. పెళ్ళైన కొత్తల్లో భార్యతో వున్నప్రేమానుబంధం పిల్లలు పుట్టేక కొంచం తగ్గుతుంది, పిల్లల్ని పెంచుకోవడం, పెద్దాళ్ళయ్యాక అందులో సగం తగ్గిపోతుంది. మిగతా సగ భాగం బయట పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపించడం తో తనను పట్టించుకోకపోవడంతో పూర్తిగా తగ్గిపోతుంది. అంటే మగాడికి ఏభైదాటే సమయానికి భార్యాభర్తల్లో ఒకరంటే ఒకరికి ప్రేమ, ఆకర్షణ, పూర్తి తగ్గిపోయి భర్తను దగ్గరకు రానీయరు. మరి పులుపు చావని భర్త ఏమయిపోవాలి? మా అమ్మకు ఎప్పడూ సోషల్ సర్వీసు, మహిళామండలి, క్లబ్బులూ, ఒహటేమిటి ? ఇదే యావ. 
ఒకవేళ మా డాడీ “ఇవ్వాళ భలే ఉన్నావే” అన్నారే అనుకో, “ చాల్లెండి “ పిచ్చివేషాలు పిల్లలు పెద్దాళ్ళయిపోయారు అంటుంది. పైగా సంతోషం, ఐశ్యర్యం కలగలిసి తన శరీరం మీద శ్రద్ధ తగ్గించి పొడవుగా పై నుండి కింద దాకా ఒకే కొలతల తో పీపాలా తయారయిపోయింది. మరి మగవాడు ఆ స్థితిలో బయట గడ్డి కరవక చస్తాడా ? మా నాన్నగారి పరిస్థితి సరిగ్గా ఇలా నే తయారైంది.నేను అనేక సార్లు వాళ్ళని గమనించాను.
ఒక గంట పోయాక కంపెనీ సిబ్బంది అందరూ వచ్చి నన్ను అభినందించి, వాళ్ళందరినీ మా నాన్నగారిలాగే ఆదరించి తమ బాగోగులు చూసుకోమని అర్ధించారు. ఓ.కే అన్నాను. ఫైనాన్సియల్ అడ్వైజర్ వచ్చి కంపెనీ స్టార్టప్ నుండీ నేటివరకూ కంపెనీ ఆర్థిక ప్రగతి ని వివరించాడు. మరి
ఎందుకు నాన్నగారు ఇలా ? మరలా ప్రశ్న మొలకెత్తింది నాలో నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ నా రెండో ఫోనులో " హలో నాన్నగారూ-?" అంటూ మోహన గొంతు వినపడింది. ఓహెూ ఆమెకు ఫోన్ వచ్చిందన్నమాట. సౌండ్ తగ్గించి స్మార్ట్ ఫోన్ చెవులకు దగ్గరగా పెట్టుకుని ఆసక్తి గా వినసాగేను.
"హలో నాన్నగారూ, మీకు తెలుసా, చనిపోయిన మా బాస్ కి నేనంటే ఎంతిష్టమో, ప్రాణమో, నేను చేరి నెల రోజులు అయిందా ? ఈ నెల రోజుల్లో ఎన్ని గిఫ్ట్లు ఇచ్చారో లెక్కలేదు. ఎప్పడూ మీరు నన్ను తిట్టేవారు, ఎందుకూ పనికి రాకుండా పోతావని. నేను చేరిన పది రోజులకే బాస్ నాతో చాలా చనువుగా ఉండడం మొదలు పెట్టాడు. ఎప్పడూ నన్ను తాకాలని విశ్వప్రయత్నం చేసేవాడు. నేను చేరిన మూడో రోజునే యాపిల్ కంపెనీ ఆ రోజునే విడుదల చేసిన మార్కెట్ లోకి వచ్చేసిన అతి ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. ఫోన్ నా చేతికి ఇచ్చేటప్పడు నా వేళ్ళ ఆయన్ను తాకితే ముగ్గులైపోయి -- 'ధ్యాంక్యూ మోహనా’ అన్నారు కైపుగా నన్ను చూస్తూ. మరో నాలుగు రోజులు గడిచేక "కంపెనీ కి ఎలా వస్తున్నావ్ ?’ అని అడిగారు.
తలవంచుకుని సిగ్గు పడుతూ ' ఎలా వస్తాను ? సర్, మేమేమైనా రిచ్ పీపుల్సా మీలాగా, ఆటో నెలకు మాట్లాడుకున్నాను. దారి పొడుగునా మగాళ్ల
చూపులదాడికి తట్టుకుని, ఎవడు నన్ను ఏం చేస్తాడో అనే భయం తో వణికి పోతూ కంపెనీకి వస్తున్నా ఏం చేయను ? ?' అని గోముగా అనగానే  'ట్రాష్ ఉండు ? అని వెంటనే ఫోన్ చేసి ఒక గంట లో నా కోసం బుల్లి కారు కొనేశారు.
డ్రైవింగ్ స్కూలు లో నేను అంతకుముందే డైవింగ్ నేర్చుకోవడం తో కారు నేనే నడుపుకుంటూ కంపెనీ కి వస్తుంటే ఎంత సంబరపడిపోఎవారో. నన్ను ఎవరూ
చూడడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. అందుకని మా కంపెనీ బిల్డింగ్ లో బాస్ ఛాంబర్స్ కి వెళ్లడానికి ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేయించుకున్న లిఫ్ట్ లోనే ఆయన లాగే నేనూ ఆయన ఛాంబర్స్ కి రోజూ వచ్చి పోతూండేదాన్ని అంతా బాగానే ఉంది. ఆయన ఎప్పడూ నన్ను ముట్టుకుని, ఏదో చేసేయాలనీ, తన వడిలో కూర్చోబెట్టుకోవాలని ఉందనీ ఒహటే చెబుతుండే వారు. “సార్ నేను చేరి మరీ కొన్నాళ్ళే గదా అయింది. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్ ? అని అర్ధించాను. ఆయన వెంటనే "మోహనా, మగాడు ఆడదాని అనుమతి లేకుండా శృంగారం లో దిగితే అది రేప్ అవుతుంది. అందులో మమేకం కావడం గాని, సంపూర్ణ తృప్తి ఆనందం గానీ వుండవు. నువ్వు ఎప్పుడయితే నన్నుకోరుకుంటావో, అప్పుడేలెటజ్ ఎంజాయ్ బెడ్ టూ రీచ్ హెవెన్” అని నన్ను అదోరకంగా, అంటే దాదాపు నన్ను నా అందచందాలను కొరుక్కుని తినేసేట్లుగా చూసేవారు. నాకు చాలా భయం గా వుండేది,ఎందుకో తెలుసా? ఉదయం పదినుండి ఒక్కోసారి రాత్రుళ్ళు ఏడు గంటలవరకూ మేమిద్దరమే ఉండేవాళ్ళం బాస్ ఛాంబర్లో. నాన్నగారూ మీకు ఇంతవరకూ నేను ఒక భయంకరమైన విషయాన్ని నేను చెప్పనేలేదు, ఎందుకంటే, మీరు వెంటనే నన్ను ఉద్యోగం మానేయామంటారు.
అందుకని. ఆ రోజు ఆదివారం నేను పెర్సనల్ సెక్రటరీ గా చేరి ఇరవై రోజులైంది. అప్పటికే ఖరీదైన స్మార్ట్ ఫోనూ, బుల్లి కారూ, పెర్ఫ్యూమ్స్ ఎన్నో ఖరీదైన చీరలూ, నైటీలు, ఇలా ఎన్నో కానుకలు ఆయన చేతుల మీదుగా వర్షించాయి నాకు. ఆ రోజు ఆదివారం మా బాస్ నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎందుకంటే నగరం లో గేటెడ్ కమ్యూనిటీ లో ఒక పోష్ డ్యూప్లెక్స్ విల్లా నా కోసం కొంటున్నాననీ, నన్ను ఆ రోజు ఆ విల్లా డాక్యుమెంట్స్ మీద సైన్ చెయ్యాలనీ, ఒక నాలుగు రోజుల్లో ఆ డ్యూపైక్స్ విల్లా కు నన్ను వెళ్ళిపోమనీ, ఆ తరువాత ఆ ఫర్నిష్డ్ విల్లాలో తనకు నన్ను అర్పించుకోవాలనీ ఆయన చాలా సార్లు అర్ధించారు. 
నేను సరే లెండి అలాగే, అన్నాను. ఆయన విల్లా కొన్నప్పటి సంగతి గదా అనుకున్నాను. కాని ఆవేళ ఆయన డాక్యుమెంట్స్ తెచ్చేసారు. ఒక ప్రక్కన నా కోసం చాలా ఖరీదైన విల్లా కొంటున్న సంబరం, మరో ప్రక్కన ఆ విల్లా బెడ్రూమ్ లో ఆయనతో సంగమం, నా పరిస్థితి అగమ్యగోచరం గా తయారైంది. అప్పడు నేను బాస్ దగరగా ఉండగా నాకు ఫోన్ వచ్చింది, బాస్ బల్ల మీద ఫోన్ కి . నేను వెంటనే కార్డ్లెస్ పోను ఎత్తాను, ఫోనులో మీరే మాట్లాడుతున్నారు. నేను వినయంగా మీతో మాట్లాడడానికి వెనకాడుతోంటే, ' మోహనా మీ డాడీ తో మాట్లాడు నో ప్రోబ్లమ్-- ?' అన్నారు. నాన్నగారూ ఇక్కడ మీకు మా బాస్ గురించి కొంచం చెప్పాలి. ఆయన వయసు అరవైకి దగ్గర పడుతున్నాసరే, ఆయన నలభై సంవత్సరాల వ్యక్తి లా చాలా చలాకీ గా ఆకర్షణీయం గా డ్రెస్ చేసుకుంటారు. ఆయన ఏదో పోగొట్టుకున్నట్లు గా బిహేవ్ చేసేవారు. ఆయనకు ఇంటి దగ్గర బెటర్హాఫ్ తో అనుబంధం పెనవేసుకుని లేదేమో ఆయన కు కావాల్సిన రేంజ్ లో ఆమె ప్రవర్తన లేదేమోననిపించింది నాకు. ఆయనకు ఆ వయసు లో కూడా స్త్రీల నుండి ఇంకా ఏదో కావాలన్నట్లు గా ప్రవర్తిసుండేవారు. నేను నా రూమ్ లోకి కార్డ్లెస్ రిసీవర్ తీసుకెళ్ళి మాట్లాడసాగేను. మీరు ఎప్పడూ నన్ను తిడుతూండేవారుగా. అమ్మ చిన్నప్పటి నుండీ గౌనూ, లంగాలూ వేసి పెంచింది, పెద్దయ్యాక లంగా వోణీలు, నేను మగాడినని ఎవరికీ తెలియకుండా ఆడపిల్లలాగే పెంచింది. చివరికి నాకు కూడా ఆడపిల్లలాగానే తయారవడం అలవాటైపోయింది. మనం సైకాలజిస్ట్ ని సంప్రదిస్తే నాకు ' ట్రాన్స్వెస్టిజం ? అనే మానసిక జాడ్యం వుందనీ ఇంక మీ అబ్బాయి అబ్బాయి కాదు అమ్మాయే అనుకోండి అన్నారు ఆ రోజు డాక్టరుగారు. అప్పడు మీరు నన్ను వెధవా ఎందుకూ పనికిరాకుండాపోతావ్, వేస్ట్ ఫెలో, ఒక వేళ అమ్మ ఆడపిల్లల్లా డ్రెస్ లు వేసిందే అనుకో, వెంటనే విప్పిపారేయక ఆడామగా కాకుండా తయారయ్యావ్ అని తెగ తిట్టేవారు గుర్తుందా. ఇప్పడు చూడండి, మా బాస్ నా కోసం దాదాపు కోటి రూపాయలు పోసి డ్యూఫ్లెక్స్ విల్లా కొంటున్నారు. రేపే రిజిస్టేషన్ మరి బాస్ తో సంగమం ఎలా అంటారా ? వెరీ సింపుల్ మగాళ్ళ శృంగారసమయం లో వలచిన వనిత ఏం చేయమంటే అదే చేసేస్తారు, అప్పడు నేను ఏదో ఆలోచిస్తాను లెండి-- అంటూ పకపకా నవ్వుతున్నాను.
ఇంతలో దడాల్న మా బాస్ రూమ్ లో బాల్కనీ వేపు తలుపు తెరిచిన చప్పడు వినిపించి, గబగబా నా గది లోంచి బయటకు వచ్చేటప్పటికి బాస్ ఛాంబర్స్ లో లేరు. బాల్కానీ లోంచి చూద్దును గదా, బాస్ బిల్డింగ్ మూడు ఫ్లోర్స్ కింద నేలమీద నిర్జీవంగా పడి ఉన్నారు. ఆయన తల పగిలిపోయింది.
ఆ తరువాత జరిగిందంతా మీకు తెలియదు. అందుకే ఇప్పడు చెబుతున్నాను,ఢిల్లీ లో బి.బి.యమ్ చదువు అయిపోయి పెద్ద పెద్ద కంపెనీల్లో
అప్రెంటిస్ గా వుంటున్న ఆయన కొడుకు ఉన్నపళం గా వచ్చి ఆయన స్థానం లో కూర్చున్నాడు. నేను అతన్నీ వదిలిపెట్టనులే, అందులో పెళ్ళికాని కుర్రాడు, నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతున్నారా పెద్దవాళ్ళు పోష్ మనుషులు కదా, ఒక సెక్రటరీ గురించి చనిపోయాడంటే పరువూ ప్రతిష్ణా పోతాయి గదా, అందుకని క్రంపెనీ లో ఏదో ప్రోబ్లమ్ వచ్చిందనీ, షాక్ తిని సూసైడ్ చేసుకున్నారనీ, పెద్దగా గోల చేయలేదు.
పోలీస్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేసేశారు. అందువలన నేను సేవ్ అయిపోయాను. చూశారా నాన్నగారూ నేను ఎందుకూ పనికిరాను వెస్ట్ ఫెలో అన్నారు. కాని ఎంత ಆಸ್ತಿ సంపాదించానో చూశారా !" -- ఆమె విపరీతంగా సైకిక్ గా నవ్వుతోంది. 
నేను వెంటనే నా చేతిలో సెల్ ఫోను ఆమె రూమ్ డోర్ కి గట్టిగా తగిలేట్లుగా విసిరికొట్టాను. తలుపు తెరుచుకుంది, బయటకు వచ్చి ఆమె ఛీ -ఛీ - కాదు వాడు అయోమయం గా చూస్తున్నాడు. చకచకా వెళ్ళినా శక్తికొద్దీ బలమంతా ఉపయోగించి ఆమెను ఛీ -ఛీ - వాడిని గదిలోకి తోసి బయట బోల్ట్ వేసి తన డాడీ తో జరిపిన సంభాషణ రికార్డ్ అయిన నా రెండో సెల్ఫోన్ తీసుకుని, వెంటనే--నా ఫ్రెండ్ డి.యస్.పి కి ఫోన్ చేసి – “మా నాన్నగారి అత్మహత్య కు అసలు కారణం తెలిసిందండీ. అందరూ చెవులు కొరుక్కుంటున్నట్లు గా పెర్సనల్ సెక్రటరీ వల్లనే ఆయన చనిపోయారు. యూ నో వాట్ హేపెన్స్ ? సెక్రటరీ ఈజ్ నాట్ ఫిమేల్ హి ఈజ్ ఎ మేన్ ఇన్ లేడీ డ్రెస్ విత్ సమ్ సైకలాజికల్ ప్రోబ్లమ్. హి చీటెడ్ ఆల్ ఆఫ్ అజ్ -- - “నో నో ఆమె ను ఛీ -ఛీ - వాడిని నాకు కనుపించకుండా ఏంచేస్తారో నాకు తెలియదు. మూడో కంటికి తెలియకుండా ఆమెను ఛీ -ఛీ - వాడిని మాయం చేసేయండి. నేను ఈ పనికి అయ్యే ఖర్చంతా భరిస్తాను. చాలా సీక్రెట్. నాకు దాన్ని, కాదు కాదు వాడిని చూస్తే గుండెల్లో గునపాలు దిగిన ఫీలింగ్ కలుగుతుంది. నేను దానిని కాదు- కాదు- వాడిని చూడలేను. సారీ, ఆ మోసగాడిని చూసి తట్టుకోలేను—
సారీ సర్ మిమ్మల్ని కేసు పరిశోధన చేయనిస్తే విషయం తెలిసిపోయేది. ఎక్యూజ్ మీ, మా నాన్నగారి ముఖం చూసి నన్ను క్షమించండి—“ అంటూ ఉద్రేకం గా మాట్లాడుతోంటే డి.యస్.పి గారు-- ' కూల్ డవున్, ఉ విల్ లుక్ ఆఫ్టర్ ది ఎంటైర్ ఇష్యూ- ‘ అని ఫోన్ పెట్టేశారు.
నాన్నగారి ఆయిల్ పెయింటింగ్ వేపు చూస్తూ – నాన్నగారూ నన్ను రక్షించారు. మోసం చేసే వాళ్ళు ఎల్లకాలం అందరినీ మోసం చేయలేరు. ఏదో ఒక తప్పు చేసి దొరికిపోవడం ఖాయం. ఆమె ఛ-- ఛ-- వాడు పెద్ద వయసులో సహజం గా కలిగే వుమనిజాన్ని ఎన్ కాష్ చేసుకున్నాడు. ఎనీ హౌ మేము మిమ్మల్ని పోగొట్టుకున్నాం. ఎండమావి ని చూసి భ్రమించి దాహం తీర్చుకోవాలని ఆరాటపడ్డారు నాన్నగారూ ఐ పిటీ యూ - కనీసం సిగ్గువిడిచి నన్ను సంప్రదించి వుంటే బావుండేది ? అని ఆలోచిస్తుంటే మెదడు లోని నరనరాల్లో వాడి సమ్మోహన రూపం దూరిపోయి వేధిస్తుంటే- తల పట్టుకుని కూర్చుండగా -- పి.ఏ వచ్చి-- ‘ డి.యస్.పి గారు వస్తున్నారు సర్. తమరికి చెప్పమన్నారు ? అనగానే నేను చకచకా నా స్పెషల్ లిఫ్ట్ లో వెళ్ళిపోసాగేను ఆ ఛీటర్ ని మరలా చూడలేను నేను.

*****

No comments:

Post a Comment

Pages