ఆధ్యాత్మిక గురువులు - అచ్చంగా తెలుగు

ఆధ్యాత్మిక గురువులు

Share This
ఆధ్యాత్మిక గురువులు 
ఆదూరి.హైమావతి.

గురుశిష్య బంధాలు గుంటలో పాతేసి,
                  విద్యలన్నియు విక్రయ వీధికొచ్చె
పాశ్చాత్య విద్యలే పరమ సత్యాలనగ,
                ఆర్ష విఙ్ఞానమ్ము అడుగు తాకె,
తల్లి దండ్రులు యింక తమవారు కాదని,
               భార్య బిడ్డలపైన ప్రేమహెచ్చె,
ధనము నార్జించుటే తారక మంత్రమై,
             ధనదేవతకు సదా దాసులైరి, 
   వక్ర మార్గాన పడుతున్నవారినెల్ల
   చక్కజేయగ వచ్చెను సత్యసాయి,
   జన్మ జన్మల నోముల పుణ్యఫలము,
   మహిని సద్గురువు మనభాగ్య కల్పతరువు !
గురువు అనేపదం' గుకారో ' అంధకారోస్తు,' రు ' కారో తన్నిరోధ కృత్.. అనగా'గు'అనే అక్షరం అంధ కార ము, ' రు 'కారం తొలగించేది, అని అర్ధాన్నిస్తుంది.అనగా అఙ్ఞానమనే అంధకారాన్ని తొలగించి ,ఙ్ఞాన మనే జ్యోతిని వెలి గించేవాడే’ గురువు ‘అని శాస్త్రం చెపుతుంది.
ఈరోజులలో ప్రతివాడూ " ఏం గురూ! " అనిచౌకబారుగామాట్లాడుతూ ఉంటారు. 
గురువును  పర్యాయ పదంగా వాడినట్లైతే , స్కూళ్ళలోనూ, కళాశాలలలోనూ మనకు విద్య బోధించే ఉపాధ్యాయులను కూడా   మనం ' గురువు ' లని పిలుస్తాము. 
ఐతే ప్రాపంచిక మైన ఙ్ఞానన్ని అందజేసేవారు గనుక వారు గురువులే కానీ ' సద్గురువులు ' కాలేరు.ఐతే సద్గురువులు అనగా ఎవరు? 
' సత్ ‘వస్తువును   గురించి తెల్పి, ఆ ‘సత్  ‘ను పొందటానికి ,కావలసిన శిక్షణ నిచ్చేవారే సద్గురువులు.' సత్ ' అనగా సత్య మయినది. త్రికాల అబాధితమైనది  అనగా భూత, వర్త మాన , భవిష్యత్ కాలాలలో ఏవిధమైన మార్పు చెందనిది. అదే ' సత్ ' అంటారు.అదే చైతన్యము.అదే ఆనందము, అనగా సచ్చిదా నందము.   ప్రాచీన సాంప్రదాయంలో  ఎంత గొప్ప రాజ పుత్రుడైనప్పటికీ , గురువు ఆశ్రమాలకు పోయి వారికి సేవచేసి, వారి ద్వారా ఆత్మఙ్ఞానాన్ని పొందేవారు.' ఆత్మ’ సంబంధ మైన వివరణ యిచ్చేవారు ‘ఆధ్యాత్మిక గురువులు.' వారే సద్గురువులు. స్వామి వారు ఎనిమిది మంది గురువుల గురించీ చెపుతారు.                                                     
1.బోధ గురువులు:- శాస్త్రాన్ని బోధించి ,నియమ నిబంధనలను తగిన రీతిగా ఆచరించటానికిప్రోత్సహించేవాడు.            
2.నిషిధ్ధగురువు:- కామ్య కర్మలను వివరించి ఇహ పరములందు మోదము నందుకునేవిధమునెరిగించువాడు.     
3. వేద గురువు:-  తత్వార్ధాన్ని బోధించి , తత్వవేత్తగారూపొందించి,మనస్సునుభగవంతునివైపుమరల్చువాడు. 
4.కామ్య గురువు:- పుణ్యకార్యాలను ఆచరింపజేసి ఇహ పర సుఖములను పొందే మార్గము నందించేవాడు. 
5.వాచికగురువు:యోగతత్వాన్నిబోధించిదివ్యత్వమైనఆత్మతత్వాన్నిఅనుభవించువిధానాన్నిబోధించువాడు. 
6. సూచిక గురువు:- శమదమాది ' షట్క్ సంపత్తిని ' వివరించి ఇంద్రియ నిగ్రహ విధానమును బోధించువాడు.                               
7. కారణ గురువు:- జీవబ్రహ్మైక్య సంధానప్రాప్తికి ,తగినశక్తిని అనుగ్రహించివాడు.                                              8. విహిత గురువు:- సందేహ నివృత్తిచేసి, మనస్సును పరిశుధ్ధముగావించి, చిత్తశుధ్ధివలన ఆత్మతత్వాన్ని గుర్తింపజేసేవాడు.  
       వీరందరిలోనూ ' కారణ ' గురువు ప్రధానమైన గురువు.ఆయన ఒక భగవంతుడు మాత్రమే!
ఒకనాడు ఒక గురువుగారు తన శిష్యుని అడిగినారు. వారంపాటు తనశిష్యులతో ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు గురువుగారు, వారి విఙ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో.
" రేపు నీవు ఏవిషయం ఉపన్యసిస్తావు?" అని.                       
అతను"  గురువును గురించీ మాట్లాడుతాను స్వామీ!" అన్నాడు.
గురువుగారు " గురువు , అంటే ఏమి?" అని అడిగారు.
శిష్యుడు" అఙ్ఞానాన్ని తొలగించిఙ్ఞాన జ్యోతిని వెలిగించేవాడే గురువు స్వామీ!  " అని అన్నాడు.
“ఐతే సద్గురువు ఎవరు ?" అన్నారు గురువుగారు.
సంసార తాపాన్నితొ లగించి ,ఆధ్యాత్మిక ఙ్ఞానాన్నిచ్చేవాడు స్వామీ !" అనిచెప్పాడు.
" ఉదాహరణగా ఏదైనా ఒక పాటపాడు “అన్నారు గురువుగారు.
" తమరు  చెప్పిన ' మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం " అని పాడాడు ఆశిష్యుడు. ఆవిద్యార్ధి.
అప్పుడు గురువుగారు " మంచిదిగురుశబ్దానికి మంచి అర్ధం గ్రహించావు. , శంకరాచార్యులవారు జగద్గురువును" అని అన్నారు.                                                                                                                                                     
లోకములో గురువులున్నారు, సద్గురువులూ ఉన్నారు.ఐతే జగద్గురువు లు శంకరా చార్యుల వంటివారు.! 
చెవిలో మంత్రం , చేతిలో దుడ్డు.కోరి శిష్యులను ఆకర్షించేవారూ ఉన్నారు.ఐతే సద్గురువులు ఉదాహరణకు--సాందీపినీమహర్షి, వశిష్టులు, యాఙ్ఞావల్కుడు, ఆదిశంక రులు , రామకృష్ణపరమ హంసలాంటివారు .వీరి శిష్యులు  పరిమిత సంఖ్యలో వుంటారు. వారికి శిష్యులు విశ్వవ్యాప్తంగానూ ఉంటారు.  వారు మహిమలద్వారా ఆకర్షిస్తూ,  జీవితాలను సన్మార్గంలో నడిపిస్తూ, వారిలో ఒక విధమైన 'ట్రాన్స్ ఫర్ మేషన్ ' తీసుకు వస్తుంటారు.వివేకానందులు తమ గురువైన రామకృష్ణ్పరమహంసద్వారా ,అయన మహిమవలన ఎంతో విఙ్ఞానాన్ని గడించి ప్రపంచప్రఖ్యాతులయ్యారు
                                                                                                      
 **********.  

No comments:

Post a Comment

Pages