నిను చేరిన మనసు - అచ్చంగా తెలుగు

నిను చేరిన మనసు

Share This
నిను చేరిన మనసు 
సుజాత తిమ్మన


బాహ్య  పొరలను చీల్చు కుంటూ..
నీ చూపు..ఎదను తాకిన వేళ
స్పందనలను మరచి ...
పులకింతలకు దాసోహమంటుంది..
.
మనసు విచక్షణకు వీడ్కోలు చెప్పి..
నీ చుట్టూపరిభ్రమిస్తుంది...
నీ అవసరాలకు అవాసమవ్వాలనే 
వయసు వలపు సెగలు చిమ్ముతుంది..

నాలోని నన్ను గుర్తించలేని 
అలసత్వంలోని నీ ప్రవర్తన..
హృదయానికి రంధ్రం  చేసి...
రుధిర ధారల స్రవింప జేస్తుంది..

కళ్ళెం వెయ్యాలని చూసినా..
ఆగని కాలపు గుఱ్ఱపు...
భారమైన డెక్కల చప్పుడు 
శ్వాసించనివ్వని ఆలోచనల కంచెలో చిక్కుకుంది..

పరి పరి విధాల పరిగెడుతూ..
లో లోన ఆరాటాన్ని..
నీతో చెప్పుకోలేనితనం...
నాలో నన్నే...విగత జీవిని చేస్తుంది.....!!

*****************

No comments:

Post a Comment

Pages