కళ్ళు తెరవండి కంచె ఐలయ్య గారు! - అచ్చంగా తెలుగు

కళ్ళు తెరవండి కంచె ఐలయ్య గారు!

Share This
కళ్ళు తెరవండి కంచె ఐలయ్య గారు!
శారదాప్రసాద్ 

1940-70 దశకంలో తమిళనాడులోని ద్రవిడ ఉద్యమం అంతా  బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా మారిందని చెప్పటం సత్యదూరం కాదు.నిజానికి దీని మూలాలు తెలుగుదేశం నుంచే ప్రారంభం అయ్యాయి. త్రిపురనేని రామస్వామి చౌదరి గారి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం,తమిళ దేశానికి కూడా పాకింది.ద్రవిడ ఉద్యమ నిర్మాత EVR రామస్వామి నాయకర్ గారు రామస్వామి చౌదరి గారి నుండి స్ఫూర్తిని పొందిన వారే.ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు శిష్యుడు కూడా!ఈ ఉద్యమం వెర్రి తలలు వేసింది.బ్రాహ్మణత్వాన్ని వ్యతిరేకించిన తెనాలి ప్రాంతానికి చెందిన కొందరు కమ్మ కులస్తులు విడ్డూరంగా బ్రాహ్మణత్వాన్ని అనుకరించారు, అనుకరిస్తున్నరు. వీరు జంధ్యం ధరిస్తారు.వీరిలో కొందరు పెళ్లిళ్లు కూడా చేయిస్తారు.వారు 'కమ్మ బ్రాహ్మణులు'గా పిలువబడుతుంటారు.బ్రాహ్మణత్వాన్ని వ్యతిరేకించిన వారే ,అదే బ్రాహ్మణత్వాన్ని అనుకరించటం విడ్డూరమే కదా ! అలానే తమిళనాడులోని ద్రవిడ ఉద్యమకారులు రాముడిని నిందించి రావణుడిని  ఆరాధిస్తారు.మరి రావణుడు బ్రాహ్మణుడనే సంగతి వారికి తెలియదా?ఈ ద్వంద్వ విధానాలు కేవలం సమాజంలోని కుల తత్వాలను రెచ్చకొట్టటానికే !ఈ ఉద్యమాల వల్ల సమాజంలోని 
అట్టడుగున ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ నేటికీ కూడా వారు రాజ్యాధికారానికి రాకపోవటానికి కారణం --వారి స్థితిగతులు పెరగక పోవటం ,పాలకులు వారిని అణగత్రొక్కటం!అత్యల్పులుగా ఉన్న కొన్ని కులాలకు చెందిన వారే అధికారంలోకి వస్తున్నారు.దీనికి కారణం వారికున్న ధన బలం!విద్యాధికులు ఎక్కువగా ఉన్న బ్రాహ్మణ కులస్తులు ఆర్ధిక స్థితిగతులు నేడు సరిగా లేవు.చాలామంది దారిద్ర్య రేఖ దిగువనే  ఉన్నారు.రాజకీయంగా కూడా ఈ జాతి నిర్లక్ష్యానికి గురౌతుంది. దానికి కారణం బ్రాహ్మణులలో ఐకమత్యం లేకపోవటం ,భిన్న భావాలు కలిగి ఉండటం.సాధారణంగా చదువురాని బ్రాహ్మణులు కూడా వైదిక వృత్తినే అనుసరిస్తారు. అంటే,క్రతువులు చేయించటం కాదు! శని,అప మృత్యు దానాలను స్వీకరించటం,శవ వాహకులుగా ఉండటం,వంట చేయటం...లాంటి అనేక వృత్తులను ఎంచుకుంటారు. చాలామంది స్మశానాన్నే ఆశ్రయిస్తున్నారు.ఇప్పుడు వంట చేయటం లాంటి వృత్తులకు కూడా దూరం అవుతున్నారు.భారీగా కేటరింగ్ చేసే వాళ్ళు వీళ్ళను ఆ వృత్తి నుండి కూడా తరిమేశారు. ఒక ప్పుడు 50 మంది శాసన సభ్యులు ఉన్న మన రాష్ట్రంలో ఇప్పుడు ఒకే ఒక బ్రాహ్మణ శాసన సభ్యుడుగా ఉండటం ఆశ్చర్యాన్ని  కలిగిస్తుంది. మారుతున్న కాలంలో బ్రాహ్మణుల స్థితి గతులు మారటం లేదు.మధ్య తరగతి బ్రాహ్మణులకు వరదాయిని software పరిశ్రమ!దీనివల్ల  చదువుకున్న వాళ్ళు రిజర్వేషన్ ల ప్రాబల్యం నుండి తప్పించుకొని చక్కగా స్థిరపడటానికి ఈ పరిశ్రమ దోహదపడింది !ఇందులో సందేహం లేదు.ఇక విషయానికి వస్తే, 1960-70 దశకంలో తమిళనాడులో నేనొక వాల్ పోస్టర్ చూసాను.ఆ పోస్టర్ లోని సారాంశం--"Show us a Brahmin who is working as a cobbler.One lakh cash award!"ఆ పోస్టర్ వేసిన వారి ఉద్దేశ్యం ఏమంటే--బ్రాహ్మణుడు తిండి లేకపోతే ,పస్తులుంటాడు.అంతే కానీ జీవన భృతిని సంపాదించుకుంటానికి కొన్ని వృత్తులను చేపట్టడని భావం!ప్రభుత్వం బ్రాహణ కార్పొరేషన్ అని స్థాపించింది.అయితే అందులో లబ్దిపొందిన వారు అతి తక్కువమంది. వారందరూ అధికార పార్టీకి అనుకూలురు అయితేనే వారికి లబ్ది చేకూరేది.అగ్రహారాలు కరిగిపోయాయి.పరిస్థితులు దారుణంగా మారాయి.నేను ఈ మధ్య కాలంలో కొందరు బ్రాహ్మణులు 
భవన నిర్మాణ పరిశ్రమలో కూలీలుగా ఉండటాన్ని చూసాను.అయితే వారు బిల్డర్స్ కు తమ కులాన్ని తప్పుగా చెబుతున్నారు.కారణం--కులాన్ని నిజంగా చెబితే ఆ వృత్తి కూడా వారికి దక్కదనే భయం!మరీ దారుణం ఏమంటే--ఈ మధ్యనే నేను గుంటూరులో చెప్పులు కడుతూ,పాలిష్ చేస్తున్న బ్రాహ్మణ కులస్తుడిని చూసాను. అతనిని అభినందించాను.ఏ వృత్తి  అయినా అది దైవ స్వరూపమే!ఎందుకంటే ఆ వృత్తి అతనికి జీవనాన్ని ప్రసాదిస్తుంది కనుక!ఈ విషయాన్ని మన రాష్ట్రంలో ఉన్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా వ్యాసంతో సహా తెలియచేసాను.దాన్ని ఎవరూ పట్టించుకోలేదు.కారణం మీడియా అంతా ధనికుల(ఒకే) వర్గానికి చెందింది కావటం.6 TV వారు తక్షణమే స్పందించి ,ఆ విషయాన్ని వారి ఛానెల్ లో ప్రసారం చేశారు. అయితే వారు కూడా నేను వ్రాసిన అంశాలను ప్రస్తావించలేదు. అయినా నేను బాధ పడలేదు.విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు వారికి అభినందనలు!దాన్ని మీకు కూడా ఇక్కడ చూడండి!కులాభిమానమంటే మన కులంలోని వాడు ఎన్ని తప్పులు చేసినా సమర్ధించటం కాదు!ఇటువంటి వారిని ఆదుకొని,వారి జీవన ప్రమాణాలు పెరిగేలా చూడటం!బ్రాహ్మణులను సోమరి పోతులుగా చిత్రించిన కంచె ఐలయ్య లాంటి వారికిది కాను విప్పు కావాలి! కళ్ళు తెరవండి కంచె ఐలయ్య గారు!
***

6 comments:

 1. Sastry Garu
  Situation in Telugu community has been detiorating since 50s of last century.
  Progressively Brahmins were pushed down and we now it reached rock bottom.
  Yes, one of the factors for the fall is lack of unity and the other factor is pseudo-equality. We want to look good by allowing the blatant discrimination against Brahmins to go unchecked.
  Brahmin families lost land that was given to others to cultivate. We did not develop skills to survive, fight back and gain control. We have to enter into other areas of endeavor(business, as an example).
  Dhanamulam Jagat
  There is an inherent talent to excel and that has to be channeled to help us move upward.
  You brought out a good point when you highlighted that one person was from Brahmin community among fifty in the field of politics. We did have some individuals (Tanguturi Prakasam, Tenneti Viswanatham, etc) but we did not continue to support our candidates.
  Software industry did, as you mentioned, help to bring back some economic stability but we are still at the very bottom.
  You referred to newer generation began working in non-traditional places. That is admirable as it shows we are adaptable and can change as the situation demands.
  We need, at this time, a re-awakening of our heritage and in time we will rise, again, to the top.
  I wrote the following a couple of years ago and it is relevant that I quote it here
  Vipro dadathi vidya na yachate vittam
  Namasthe

  ReplyDelete
 2. Dear Sastry,
  You have explained the naked facts of the state of affairs of Brahmans very clearly, without mincing words. During Composite Madras state, when my parents used to live in 'Madras'; DMK, I am told, used to show all its hatred for Brahmans, and used to carry a scissors in their pockets, to cut the "yejnopaveetham" of any Brahman seen on the street alone. Most of the intelligent Tamil Brahmans, left Madras obtaining IAS degrees and went away to Delhi.Rest went to US, in search of greener pastures, and to avoid the day to day harassment, in daily life.

  It is unfortunate that the learned Mr.Illaiah, instead of choosing subjects of interest thay would help the poor, has chosen to criticize one caste or other. The Caste hatred itself becomes a reason for his doom one day. Umasutarao C

  ReplyDelete
 3. కంచ ఐలయ్య నిజంగా ప్రోఫ్హేసరేనా? కనీస సామజిక భాద్యత లేకుండా మాట్లాడుతారు.

  ReplyDelete
 4. బ్రాహ్మణుల స్థితిగతులను గురించి చక్కగా వివరించిన రచయితకు ధన్యవాదాలు!

  ReplyDelete

Pages