వ్యాపార లక్షణం - అచ్చంగా తెలుగు

వ్యాపార లక్షణం
- తురగా శివరామవేంకటేశ్వర్లు

"శ్రీ తిరుమల హెయిర్ కేరింగు” అనే పేరుగల ఒక కంపెనీ, వాళ్ళఫ్యాక్టరీలో రంగు రంగుల, రకరకాల దువ్వెన్నలు తయారు చేస్తుంది. క్రిందటి సంవత్సరంలో ఆ కంపెనీ అత్యధికంగా దువ్వెన్నల  అమ్మకంచేసి మునుపెప్పుడూ లేనంత లాభాలు గడించింది. ఆ సందర్భంగా కంపెనీ ఎం.డి. లోకనాధం గారు ఉద్యోగులందరికి ఫలానా తేదీన తనతో మీటింగు ఉంటుందని తెలియపరిచారు. 
అధిక లాభాలు వచ్చినందువల్ల, మీటింగుల్లో ఆందరినీ మెచ్చుకుని బోనస్సులు, ఇంక్రీమెంట్లు, ప్రమ్లోషను ప్రకటిస్తారనుకుని ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నారు.
ఆనుకున్న మీటింగు రోజు రానే వచ్చింది. ఒక్కళ్ళూ మానకుండగా ఉద్యోగులందరూ హుషారుగా హాజరయ్యారు. మీటింగ్ ప్తారంభమైంది. లోకనాధంగారు స్టేజి మీద మైకు పట్టుకుని, ఉద్యోగులందరికీ స్వాగతంచెప్పి, "క్రిందటి సంవత్సరం మును మెప్పుడూలేనంతగా మన కంవెనీ దువ్వెన్నల ఆమ్మకం జరిగింది. లాభాలు కూడా బాగా పచ్చాయి. అయితే ఈ సందర్భంగా మిమ్మలను ఒక ప్రశ్న పేస్తాను. సూటిగా జవాబు చెప్పండి" అన్నారు.
"అడగండి సార్" అని ఒకే గొంతుకతో అన్నారు ఉద్యోగులందరూ. బోనస్సు ఎంత కావాలని అడుగుతారేమో ఆనుకుని.
"మీరు దువ్వెన్నలన్నీజుట్లున్నవాళ్ళకే అమ్మేరు కదూ?" ఆడిగారు లోకనాధంగారు.
'అవును సార్! జుట్టున్న వాళ్ళకే అమ్మినాం!" చెప్పారు ఒకే గొంతుకతో మళ్ళీ.
"అందుకే నేను మిమ్మల్ని మెచ్చుకోలేక పోతున్నాను. జుట్టున్న ప్రతీ వాడు దువ్వెన్న కొనుక్కోక ఛస్తాడా! వాడు మానడు. జుట్టున్నవాళ్ళకి ఆమ్మడంలో మీ పేరు, స్కిల్లు ఏమున్నాయీ ! అందుచేత ఈ సంవత్సరం జుట్టులేని వాళ్ళకి ఆమ్మి మీ స్కిల్సు, నేర్పు చూపండి!. బోడిగుళ్ళవాళ్ళకి దువ్వెన్నలు అమ్మాలయ్యా! మనం! ఐ విష్ యు ఆల్ ది బెస్ట్' అని చెప్పి, స్టేజి దిగి కారెక్కి పెళ్ళిపోయారు లోకనాధంగారు.
ఉద్యోగులందరూ వెర్రి మొహం వేసి, "వ్యాపార లక్షణమంటే!. అదిరా!. ఆనుకున్నారు.
ఆపటినుంచి "మనం బాగా పనిచేయాలి” ఆని చెప్పడానికి "బోడిగుళ్ళు వాళ్ళకి దువ్వెన్నలు అమ్మాలయ్యా” అనే సామెత వచ్చింది.No comments:

Post a Comment

Pages