మాయ! - అచ్చంగా తెలుగు
మాయ !
 భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు 

ప్రధమంగా నిన్ను ఊహిస్తూ
అద్వితీయంగా నిన్నే ప్రేమిస్తూ
త్రికాలాల్లో నీగురించే తలపోస్తూ
నిన్ను కని.....నువ్వు పెరుగుతుంటే...
నలువైపులా నీవెనుక పరుగులు తీస్తూ
పంచేంద్రియాలను నీ సేవలో నియమిస్తూ
షట్కోణాలలో నీ బాగోగులు ఆలోచిస్తూ
సప్తవ్యసనాలను నీకై త్యజిస్తూ
అష్టకష్టాలు పడి నిన్ను పెంచుతూ
నవనిధులు నువ్వే అనుకొని 
మురిసిపోతున్న తల్లిని
దశవిధాల  కారణాలతో ద్వేషిస్తూ
ఏకాదశ విధానాలతో ఏమారుతూ
స్వచ్ఛమైన తన తల్లి ప్రేమకు
ద్వాదశ వికారాలతో దూరమవటమే
.......మాయ!
అదే నిన్ను బయటకు రానివ్వని పెద్ద లోయ!
      ***

No comments:

Post a Comment

Pages