ఇంద్రధనస్సు - అచ్చంగా తెలుగు
ఇంద్రధనుస్సు
సుజాత తిమ్మన..
93 91 34  10 29

ఎదురు చూపుల వేదనలకు 
వయసు పై బడి నిలవ లేకున్నవి..

మొహావేసపు కలవరింతలు 
తాపాల సెగలో కాగి కాగి..
విరహపు మబ్బులనాశ్రయించాయి…..


నీ చుపులపైన నిదురపోయిన 
నా రెప్పలు ...
నీరెండ వెలుగులై ప్రసరిస్తున్నాయి..

తలుపులు తెరుచుకున్న 
పరువాల వాకిలిలోకి...
నీ వలపుల పిల్లతెమ్మెరలు 
పరుగు పరుగున వచ్చి చేరుతున్నాయి.


ఎదలోని సంగర్షణలకు సాక్షిగా..
జడలోనుండి విడివడిన ముంగురులు ..
చెల్లా చెదురుగా ఎగురుతూ నిలిచాయి.


ప్రేమ తత్వాన్ని మధువు వోలె 
త్రాగేసిన మన మనసులు 
ఈ విరహపు మబ్బుల రాపిడిలో ..
నలుగుతూ...ఓపలేని స్వేదాన్ని ..
చినుకులై రాలుస్తున్నాయి.


రెప్పలపైని నీరెండలో ..
మెరుస్తూ..చినుకులు..
అహో..! నిన్ను నన్ను కలుపుతూ..
వంతెనై వంగి ..వారధిగా నిలిచిందే..
ముచ్చటైన రంగు రంగుల ఇంద్రధనుసు.

నీకోసం..నీ కోసమే...
వెచ్చని ఊసుల ..
వెన్నెల జలతారు పట్టుకొని..
ఇంద్రధనుసు అంచుల జారుదామా..
ఈ లోకాన్ని మరిచి..
మనదైన మరో లోకంలో విహరిద్దామా...!!

************************

No comments:

Post a Comment

Pages