ఎందుకు చదువుకోవాలి - అచ్చంగా తెలుగు

ఎందుకు చదువుకోవాలి

Share This
ఎందుకు చదువుకోవాలి
ఆండ్ర లలిత 

అనగనగా రత్నాపురం అనే ఊళ్లో నాగసాయి శ్రీసాయి అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఆతకాయి చదువులతో కాలక్షేపం చేసేవారు. కాని ఏం చేస్తారు, అమ్మ నాన్న చదువుకోమంటారాయే! పోనీ బడిలో ఉపాధ్యాయులన్నా చదువుకోవద్దు, ఎంత వస్తే అంత చాలంటారా! లేదు, చదువుకోపోతే ఒప్పరు. చచ్చినట్టు చదువుకోవాలి,  ఈ ఎందుకూ పనికి రాని చదువులు. వాళ్ళలోవాళ్ళు ఇలా వాళ్ళ చదువు గురించి ఎప్పుడూ అనుకుంటూ వుండేవారు. ముక్కుతూ మూలుగుతూ  ఏడుస్తూ చదువుకునేవారు. ఎప్పుడూ తరగతిలో వెనక బెంచే! అమ్మా, నాన్నా మరియు ఉపాధ్యాయులు ఏంచెప్పినా అది ఒత్తిడిగానే ఉండేది. ఒకరోజు బడికి వెళ్తూ  పొలం గట్టున నడుస్తుంటే, పొలం పనులు చేసుకుంటున్న నాన్న మాధవుడుని చూసి
“అన్నయ్యా!  ఇంకా బడి సమయం అవ్వలేదుగా, కాళ్ళు లాగుతున్నాయి ఆగుదామా! నాన్ననేదో అడగాలి” అన్నాడు శ్రీసాయి అన్నయ్య నాగ సాయితో పొలంలో నాన్నని చూసిన వెంటనే.
“సరే, నేనూ నాన్నని ఎదో అడగాలి. అదిగో నాన్న! అక్కడే మలన్నకూడా ఉన్నాడు, ఆ కొబ్బరి చెట్టుమీద కొబ్బరికాయలు కోస్తూ. దాహంవేస్తోంది. కొబ్బరిబోండం త్రాగి వెళ్దాము తమ్ముడూ” అన్నాడు నాగ సాయి.
అలా ఇద్దరూ ఆగి,  వాళ్ళ బొజ్జల నిండా ఉన్న ప్రశ్నలకి నాన్న దగ్గర నుంచి సమాధానాలు వెతకసాగారు.
పొలంపనులు చేసుకుంటుంన్నతండ్రి మాధవుడు, పిల్లలి రాక గమనించి “ఎంత బావున్నాయో కదా పాల పిట్టలు. పొద్దున్న బోళ్ళు వస్తాయి” అన్నాడు నాగ సాయి బుజంమీద చేయివేసి.
“నాన్నా పాలపిట్ట ఎంత బాగా ఎగురుతోందో కదా. అలా మనం ఎందుకు ఎగరలేము? మరి విమానం ఎగురుతుందికదా!”అన్నాడు నాగసాయి
“అవును భగవంతుని సృష్టి. రెక్కలు అలా కొట్టుకుంటూనే ఉంటుంది. ఇవన్ని తెలుసుకోవాలంటే లెక్కలు, విజ్ఞాన శాస్త్రం మరియు భూగోళ శాస్త్రం చాలా ముఖ్యం....అవి తెలుసుకునే, ‘Wright brothers' విమానం కనిపెట్టాక దాన్ని చాలా మంది కష్టపడి, చాలా అభివృధ్ధి చేసి పెద్ద పెద్ద విమానాలు, చాలా వేగంగా వెళ్ళేవి, యుధ్ధవిమానాలు చేసారు, ఇంకా చేస్తున్నారు. ఇంకా ఇంకా క్రొత్త రకమైన విమానాలు వస్తాయి కూడా నాగ సాయి. నీలాంటి వాళ్ళు తలుచుకుంటే ఇంకా ఎన్ని చేయగలరో కదా!” అన్నాడు మాధవుడు.
“నాన్నా అయితే నేను చేయాలంటే ఏం చేయాలి నాన్నా?”అన్నాడు నాగసాయి తండ్రి మాధవుడితో.
“దానికి ఇప్పుడు స్కూల్లో బాగా చదుకుంటే  విమాన శాస్తం చదుకుని అర్ధం చేసుకునే సామర్ధత వస్తుంది. ఏది సాధించాలన్నా పై చదువులను అర్ధం చేసుకోగలిగిన సామధ్యత అవసరం కదా. నీకు భాష తెలియక పోతే నేను మాట్లాడేది అర్ధం అవుతుందా”అన్నాడు మాధవుడు.
ఇంతలో, ఉడతలతో ఆడుకుంటుంన్న శ్రీసాయి “నాన్నా ఆకాశంలో చూడు విమానం వెళ్తోంది. నేను నడపాలి, నడుపుతాను .అన్నయ్య నాగ సాయి చేస్తాడు  నేను నడుపుతాను ఒక రోజు, చూస్తూ ఉండు” అన్నాడు శ్రీసాయి.
“అన్నయ్యా నువ్వు చేసిపెట్తావు కదా” అని అన్నయ్య నాగసాయి గడ్డం పట్టుకుని ముద్దుగా అడిగాడు శ్రీసాయి.
“ఓ తప్పకుండా..”అన్నాడు నాగసాయి, తమ్ముడు శ్రీసాయి కోరికకి మురిసిపోతూ.
“నాన్నా విను... ఇప్పుడు అన్నయ్య గాలిపటం చేస్తే నేను ఎగరేస్తాను కదా. కాని అన్నయ్యకి నా మీద  కోపం వస్తుంది నేను సరిగ్గా ఎగరేయకపోతే.  ఎప్పుడూ తెగిపోతూ ఉంటుంది. విమానం అలా కూలిపోకుండా నడపాలి ఆకాశంలో  నేను”   అన్నాడు పంపు దగ్గర ఆడుతూ శ్రీసాయి తండ్రి మాధవుడితో.
“అలాగే నడుపుదువుగాని విమానం, బాగా చదువుకుని. నువ్వు బడికి వెళ్ళి చదువుకునే చదువులు  అన్నీ నేర్చుకోవడాని అవసరం. గాలిపటం దారం తెగకుండా ఎలా ఎగరేయాలో తెలుసుకోవచ్చు శ్రీ సాయి.”అన్నాడు మాధవుడు ప్రేమగా పిల్లలిని దగ్గర కూర్చోపెట్టుకుని.
“శ్రీ సాయి ఆ ఉడతలు వెంట పరుగులు తీయద్దు. అయ్యో బట్టలు పాడైపోతాయి. మట్టీ బురదలో అలా గెంతుతూ ఉంటే”అన్నాడు మాధవుడు.
“లేదు .నేను గెంతటంలేదు. rockets fire చేస్తున్నాను ఉడతలు మీదకి”అన్నాడు శ్రీసాయి.
“చాలు ఆటలు”అన్నాడు మాధవుడు శ్రీసాయితో
“ సమయం కావొచ్చింది.బడికి వెళ్ళి బాగా దృష్టి పెట్టి చదువుకోండి. అప్పుడు కాగితం రాకెట్లూ విమానాలు కాదు. నిజమై నవి చేద్దురుగాని బాగా పెద్ద చదువులు చదువుకుంటే”అన్నాడు మాధవుడు.
“అవునా! అంత పేద్ద విమానం మేమూ చేయగలమా? అయితే ఇప్పుడు స్కూల్లో బాగా నేర్చుకుంటే విమానాలు ఎలా చేయాలో నేర్చుకోడానికి ఉపయోగపడుతుంది  కదా?”అంటూ నాగ సాయి శ్రీసాయి ఇద్దరూ నాన్న మాధవుడి మాటలతో వాళ్ళు ఇప్పుడు స్కూల్లో చదుకునేది ఎందుకో అనే  వాళ్ళని ఎప్పుడూ వేధించే ప్రశ్నకి సమాధానం దొరికి పోయిందని మహదానందాన్ని పొందారు.
“అయ్యో! ఇంత కాలం ఎన్ని నేర్చుకోలేదో మనం. ఇప్పటి నుంచి సమయం వృధా చేసుకోకూడదు  శ్రీసాయి”అన్నాడు నాగసాయి శ్రీసాయితో.
అన్నదమ్మల మాటలు విని మాధవుడు...
“మేము చదువుకోలేదు ఇంత కాలం అని ఆలోచించవద్దు. ఇవాళ నుంచి మొదలు పెట్టండి.  లక్ష్యం సాధిస్తారు”అన్నాడు ఆనందబాష్పాలతో మాధవుడు  నాగ సాయి మరియు శ్రీసాయితో.వాళ్ళ మనసులో దాగియున్న ఉత్సుకతని నిద్రలేపుతూ.
“ఇప్పుడు అర్థమైంది నాన్నా,  విమానాలు చేయ్యాలన్నా గగనంలో మేము నడపాలన్నా ఈ బడి చదువులు ముఖ్యమని. ఇంక బడికెళ్ళి చదువుకోవాలి నాన్నా. పదరా శ్రీసాయి. గబగబా చదువుకుని,మనం గగనంలో విహరించాలి అమ్మా నాన్నలతో. “మరి నీ ఆరోగ్యం జాగ్రత్త నాన్నాఎక్కువ కష్టపడకు ”అన్నాడు నాగ సాయి  దీర్గాలోచనతో మాధవుడితో.
అలా పొలంలో పిల్లలితో తిరుగుతూ, కొబ్బరిచెట్టు మీదనుంచి కొబ్బరి బొండాలు దింపుతున్న మల్లన్నతో “మల్లన్నా  ఓ రెండు బోండాలు ఇటుపడేయ్. పిల్లలికి  కొట్టి ఇస్తాను”అన్నాడు మాధవుడు.
మాధవుడు ప్రేమతో కొబ్బరి బొండాలు కొట్టి త్రాగమని ఇస్తూ, మీరు గొప్పవారై గగనంలో విహరించాలి  అని దీవించాడు మనస్ఫూర్తిగానూ. బడిలోకూడా పిల్లలి మనసుల్లో ఉండే ఆలోచనలు ఫలించాలంటే వాళ్ళు నేర్చుకుంటుంన్న చదువులు అవవసరమనే భావనను కల్పించే ఉపాధ్యాయులు ఉంటే బావుంటుంది కదా అనుకున్నాడు.
ఆ రోజు నుంచి నాగ సాయి శ్రీసాయి వాళ్ళచేతులతో ఎప్పుడెప్పుడు విమానాలు చేస్తామో...ఎప్పుడు నడుపుతామో అని ఉత్సుకుతతో చదువుకోసాగారు.

No comments:

Post a Comment

Pages