అవాల్మీక కదంబమాల-3 - అచ్చంగా తెలుగు
అవాల్మీక కదంబమాల-3
సేకరణ- మాడపాటి సీతాదేవి.

భవభూతి -ఉత్తర రామచరితము
శ్రీకంఠుడని తలితండ్రులు అతనికిడిన నామము.భవభూతి అని ప్రసిద్దికెక్కిన బిరుదు.
శ్లో;ఇయ జ్గేహే లక్ష్మి రియ మమృత
వర్తిర్నయ నయో
రసా వస్యా స్స్పర్శో మవుషి
బహుళ శ్చందనరసః

శ్లో;అవివాహ సమయా ద్గృహే వనే
శైశవే తదను యౌవనే పునః

పెండ్లి సమయము నుండియు ఇంటి యందును, వనము నందును,ఊరిలో ఉన్నప్పుడేమి,అడవిలో ఉన్నప్పుడేమి,మరియెవతె చేతను ఆశ్రయింప బడనిది,రామబాహు నీకు త్లాపి.
ఇంటి యందు లక్ష్మి.నా సకల సంపదలు ఈమయే.నా యింటి యెల్ల సింగారమును ఈమెయె.అమృతంపు సలాక .కన్నులకు చల్లని యానందమును కలుగ జేయునది,కన్నుల కు అమృతంబు వత్తి.
శ్రీరాముడు సీతతో యనెను.
శ్లో: త్వం జీవితం త్వ మసిమే హృదయం ద్వితీయం
త్వం కౌముదీ నయనయో
రమృతం త్వ మ జ్గే ఇత్యాదిభిః
ప్రియ శతై రమ రుధ్య
ముగ్ధాం తామేవ.
నీవే నా ప్రాణమవు.నా కన్నులకు నీవు చల్లని తెల్లని వెన్నెలవు.నా దేహమందు నీవే అమృతమవు.అని యిట్లు లెక్కలేనన్ని ఇచ్చకము లాడి యాడి కడకు దానినే సరి ఇక నాకెందుకులే.ఆ తరువాతి మాట అది అడిగి ఏమి ప్రయోజనము.
( వనదేవత వాసంతి శ్రీరామునితో )

2. సౌమిత్రితో నేగి రావణుని సంహరించి వత్తునని సీత తో రాముడు చెప్పగా,తన అరణ్యవాసము తప్పదని మూడు కారణములు చెప్పును.
1.పారుడోకడు హస్తము చూసి చెప్పును.
2.ధనుర్భంగ సమయమున మ్రొక్కుట.
3.రామాయణములు బెక్కు లాలించితివి.సీతను విడిచి రాముడెన్నడేనియు వనమున కేగుట కలదా.కావున నేను నీ వెంట వత్తుననెను.
3. వశిష్ఠుడు ముందే దశరధునకు, సుమిత్ర,కౌసల్యలకు రాముని వనవాస విషయము చెప్పును.
4.వశిష్ఠుడే రాముని యొద్ద కేగి నీ తండ్రి యభిషేకమొనర్ప దలంచెను.కైక జరగనీయదని చెప్పును.
5.రాముని కోరిక పై వశిష్ఠుడు భరతునకు ,రాముడు విష్ణువని తెలుపును.
6.లక్ష్మణుడు పర్ణశాల చుట్టూ గిరులు గీసి వెళ్ళుట
7.రాముడు విష్ణువని వాలికి ముందే తెలుసు.
8. ఇక్ష్వాకు కులమన్న ప్రజలకు అందెంత అభిమానము.ఊరకే వారేల నింద పలుకుదురు.మరి అందు నిందకు కారణము దైవగతిచే కలిగినది.విశుద్ది కాలమందు యే అద్భుతములు జరిగినవో.ఎక్కడనో లంకా సముద్ర తీరమున జరిగిన దానిని ఇక్కడ ఎవరు నమ్మును? సీత కు రావణునింట వాసము కలిగినది.ఆ నింద అంతయు అత్యద్భుత కర్మలచే అగ్ని శుద్ది, బ్రహంద్రాదులగు ఎల్ల దేవతల సాక్యాత్ సాక్షము మొదలగు వానిచే నిశ్సేషము గా అప్పుడు తొలిగించబడినది.అదెల్ల లంక లో జరిగినది.అంత దూరాన ఉన్న అయోద్య ప్రజలకదెట్లో ఎరుక.వారు దానిని యెట్లు నమ్ముదురు.ఇది జనులు అపవాదము పలుకుటకు రాముని సమాధానము.అది న్యాయమే అనుచున్నాడు.
చిన్నపటి నుంచి పెంచితిని.ఎంతో ప్రీతికి పాత్రమైనది.స్నేహాతిశయమున.నేను తప్ప ఎప్పుడునూ మరి వేరు తలపే లేనిది.అట్టి సీత ను ఏదియో సాకున మృత్య్వ్య్నకు నేనే నా చేతులారా ఒంపగుచున్నాను.గర్భిణిగా నున్న సమయమున అడవిందొపాచి రమ్మని పంపినాను.ఇంతకన్నను భీభత్సము,కౄరము ఉండునా ఎందైనను - మగని చేతకును, రాజు చేతకును ఇటు ధర్మ సంఘర్షణ.

కథా సరిత్సాగరము

1.కథా సరిత్సాగరము నందు రామకథాగానము చేయబడినది.సీత కు లవుడు మాత్రమే కన్నబిడ్డ.ఒకనాడామె స్నార్ధమై శిశువుని కూడా కొనబోయెను.వాల్మీకి మహాముని పసి బిడ్డకై చూడ నెచ్చటను కానరాలేదు.తన తపశ్శక్తి తో కుశను మంత్రించి శిశువుగా మార్చెను.మరలి వచ్చిన సీత కుశుని గాంచి అతనిని గూడ లవుని వలె సాకనారంభించినది.ఇందు కుశుడు కుశోద్భవుడు.
2. రాముడు నరమేధము తలపెట్టుట.
3.వాల్మీకాశ్రమమున్న సీత శీలమును శకించుట
4.వాల్మీకి రచనమును పూర్తిగా వ్యతిరేకించు ఘట్టములు కలవు.

చంపూ రామాయణము ( భోజుడు)

వాల్మీకి రచనమును తరువాతి కవులు ఉపయోగించుకొనుట భగీరధుడు తెచ్చిన గంగను పితృదేవతలకర్పించి తరించుట వంటిదనినాడు భోజుడు.
-----------------------------------------------------------------------------

19వ శతాభ్ధి కవి యగు విట్ఠల ఉపమాక వెంకటేశ్వరకవి చిత్ర కవిత్వమును అపూర్వముగ ప్రదర్శించుచు ముప్పది సర్గములలో గద్యపద్యములలో రామాయణ సంగ్రహమును వ్రాసెను.అతడా గ్రంధ శ్లోకములందుమరి నాలుగు కావ్యములు గర్బితములగునట్లు కూర్చెను.అయోధ్యకాండ నుండి యుద్దకాండము వరకును గల శ్లోకముల ప్రధమాక్షరములన్నియు కలిపి చదివినచో గౌరీ వివాహమను కావ్యమును - ద్వితీయ పాదములందలి ప్రధమాక్షరములన్నియు కలిపించో శ్రీరంగాది క్షేత్రమహత్యము - తృతీయ పాదాద్యక్షరములన్నియు కలిపినచో భగవదవతార చరిత్ర కావ్యమును - చదుర్ధ పాదములందలి అక్షరములన్నియు కలిపినచో ద్రౌపదీ కళ్యాణమును ఏర్పడును.బాలకాండమునందలి శ్లోకముల ప్రధమాక్షరములన్నియు కూర్చినచో రామకవచమేర్పడును.ఇది చతుస్సర్గ కావ్యమున ప్రసంశించబడినది.
వెంకటాధ్వరి కావ్యము విలోమ కావ్యము. అనగా శ్లోకము పై నుండి కిందకు, కింద నుండి పైకి చదివిన ఒకటే పాఠము వచ్చును.ఇందు 300 శ్లోకములు కలవు.
-------------------------------------------------------------------------

వేదాంత దేశికుడు (1208-1367) రాముడు తుంగభద్రానది లోని ఒక హంస చేత సీతకు సందేశమును పంపును.
------------------------------------------------------------------

వంగ దేశీయుడగు కవి యొకడు భ్రమర దూతమును వ్రాసెను.భ్రమరము రాముని సందేశమును సీత యొద్దకు కొని పోవును.అశోకవనమున సీత యున్న దయనీయ స్తితి ని దలుచుకొని రాముడు చింతించుచుండగా అతనికి యొక సరస్సులో పద్మము మీద విహరించు భ్రమర దంపతులు కాననగుదురు.మగ తేనటీగను రాముడు సందేశహరునిగ గ్రహించును.నీకు నీ ఆడ ఈగ తో వియోగము కలగదులే యని రాముడు తేనటీగను సమాశ్వాసించును.

----------------------------------------------------------------------
19వ శతాబ్ధిలో బిందుపల్లి మల్లయ్య శాస్త్రి సంస్కృతబాషలో సితాకళ్యాణము, జానకీ వగ్ని ప్రవేశము లను హరికథలుగా రచించిరి.పురాణ వాచస్పతి అని వీరికి బిరుదు.
అద్భుత దర్పణము
రచయిత మహాదేవుడు

రావణవధకు ప్రతీకారము చేయుటకై శూర్పణక మాయారాముని వేషమును ధరించి,రావణుని వనమున చిరకాలముంటివి కావున నేను నిన్ను చేకొననని సీత తో చెప్పును.అందుమీద సీత అగ్ని లో దుముకును.ఆ విశుద్దచరితను అగ్నిహోత్రుడు అంటలేక పోవును.ఇంతలో నిజ రాముడేతెంచి అగ్ని పరిశుద్ద యైన అర్ధాంగిని చేకొనును.రాక్షసుల మాయలకు రాముడు బిత్తరపోయినట్లును, లక్ష్మణుడు స్తిరచిత్తుడై యున్నట్లును,
అద్భుతములు గల ఆ దర్పమున లంకలోని గాధ యంతను ప్రతిబిబించును.

================================================
భారత దేశములోని వివిధ ప్రాంతములందలి వివిధ భాషా ప్రాంతముల వారందరు అర్ధమునర్ధించి, యశవము నూహించి ,మోక్షమును కాంక్ష చేసి రామగాధా కలితములగు గ్రంధములను వ్రాసిరి.గీర్వాణ బాషలో గ్రధితములైన ఆయా గ్రంధములను ఆయా దేశ బాషలలోనికి ఎప్పటికప్పుడు అనువాదములగుచున్నవి. మూలములతో బాటు అనువాదములును ఆమోదయోగ్యములగుచున్నవి.ఈ సంధర్భమున భారతీయ రామాయణమునకు ఎంతగానో ఋణబడియున్నారు.

క్రీడాభిరామం - వినుకొండ వల్లభరాయుడు.
పదమూడవ శతాభికి చెందిన శిరా కవి కృతమైన రామచరితము మళయాళములో రామ కథాసాహిత్యముననే గాక మళయాళ సాహిత్యమున కు తొలి రచనము.
నంబూద్రిమణి ప్రవాళ బాషకు మధుర భావనకు సరియగు ఉదాహరణ మొకటి-
"మందీ భూతే జనేఘి పరిమళ బహుళం
మందారా భోగ మందస్మిత మధురము భీ
మంగళ స్త్రీ సమేతా మందం మందం
నయంతీ ఘన జఘన భరం
ప్రాభృతప్రాయ మగ్రీ మందారాక్షాలంకృతాక్షి
మనసిజ కళికా మైధిలీ సా,నడన్నాళ్."
కళ్యాణ వేదికరుగుచున్న సీతాదేవి వర్ణనమిది.ఇందు కైయల్ ( చేతిలో),వడన్నాళ్ ( నడచెను) అను రెండు పదములే మళయాళ శబ్ధములు.మిగిలినవన్నియు సంస్కృత శబ్ధములే.
గుజరాతీ వాజ్ఞ్మయమున రామాయణం

దివాలీబాయి.ఈమె వితంతువు.గురువు తో అయోద్య యాత్ర చేయు సరికి ఆమే రామ భక్తు రాలాయెను.ఐదు నూరుల పద్యముల తో శ్రీరామ చంద్రుని జీవితమును వర్ణించి చెప్పెను.
పట్టాభిషేక సంధర్భమున సింహాసనమునధిష్ఠించు సమయమున సీత యెట్టి పట్టు పుట్టమును ధరించుటయా యని తబ్బిబ్బు పడినదట.ఆ తబ్బిబ్బును నొక సుధీర్ఘ పద్యమున వర్ణించినది దివాలీబాయి.
నేను రేపటి దినమున ఏ చీర కట్టుకొనవలెను, నలుపు రంగు నిషేదము గదా.ఎరుపు రంగు, పసుపు రంగులు నాకు కిట్టవు.పాటల వర్ణము గల ఈ పట్టు చీరెను కట్టుకొనమనెదువా రామా అని ప్రశినించినదట.
మహాసామ్రాజ్య పాలకునకు మహారాణి పుట్టపు రంగు నిర్ణయించుటకు సమయమా అది-

(మరిన్ని రామాయణాల విశేషాలు వచ్చే నెలలో )

No comments:

Post a Comment

Pages