శివమ్మ కథ -4 - అచ్చంగా తెలుగు
శివం- 28 
( శివుడే చెబుతున్న కధలు)
శివమ్మ కధ – 4
రాజ కార్తీక్
 9290523901

(శివమ్మ భక్తి కి మెచ్చిన శివుడు ..తను వర్షం లో ప్రమాదానికి గురి అవ్వబోతుండగా కాపాడి ..ఆమెతో పాటు ఇంటికి వస్తాడు ...వెంటనే శివుడిని వెతుకుతూ నంది కూడా వస్తాడు ...అక్కడ శివుడి ప్రవర్తన చూసి నంది ఆశ్చర్య పడతాడు....శివుడు నందికి ఇలా చెప్పసాగారు .. )
"నందీ! భక్తి లో పరకాష్ట చెందిన వారు ఏమి చేసినా వారి  ఆలోచన అంతా వారు నమ్మిన భగవద్ రూపంలో  ఉంటుంది ..అలాంటిది ఈ నా బిడ్డ ..నా తల్లి శివమ్మ..పేరును సార్ధకం చేసుకుంది ..అవును నిజంగా తను నాకు అమ్మ ..ఎందుకంటే భక్తులు ఎలా భావిస్తే అలా ఉండే వాడ్ని నేను ..నన్ను తల్లిగా, తండ్రిగా ,గురువుగా ..భావిస్తే వారిని అలాగే చూసుకుంటాను ..కానీ ఎవరో కొద్ది మంది మాత్రమే తాదాత్మ్యంలో, నా భక్తీలో పులకరించిపోతారు "
నంది "ప్రభు! అవును తమరి భక్తుల అంతిమ స్తితి ,మీలో ,మీ రూపం లేని పరమాత్మ స్తితిలో ఐక్యం అవ్వడమే ,ఎవరు ఎవరిని పూజించినా, చివరికి అది చేరేది మీ దగ్గరకే..తమను భావించడమే ఆధ్యాత్మిక ధ్యానం , తమర్ని పూజించడమే యోగం ..ఎప్పుడూ ఉండేది తమరు మాత్రమే .ఎందుకు ఏమి చేస్తారో ..తమకు తెల్సు ..తమరు ఏమి చేసినా ,న్యాయ ధర్మ సూత్రాలకు మీరు కట్టుబడి ఉంటారు ..అలగే తమరి దేవతా రూపాలు  కూడా .తమరి గురించి చెప్పుటకు ఈ పాండిత్యం లేని పశువుకి ఏమి తెల్సు?" అన్నాడు.
నేను "నందీ ..నేను నీ నిష్కళంక భక్తికి మెచ్చి ,నిన్ను నా వాహనాన్ని చేసుకున్నా ..నీ యొక్క చిత్తశుద్ధి కి నేను కట్టుబడి ఉంటాను..నువ్వు మాత్రమే కాదు, ఎవరు నన్ను ప్రేమించినా, వారికీ అలా కట్టుబడి ఉంటాను ..అది నా తత్వం ..ఇది తెల్సి నాతో ఎలా ఉంటే అలా ఉంటాను ..అలాగే ఈ శివమ్మ కూడా .."అన్నాను.
నంది "చెప్పండి ప్రభు,  అమ్మ గురించి " అని అడిగాడు.
నేను "నంది ఒక చిన్న మనిషి యొక్క మనస్తత్త్వాన్ని చెబుతాను విను..ఎంతటి వాడు ఐనా తమ బిడ్డలను చూసుకుని ఎంతో ఆనందపడతారు ..వారి నుండి వారు ఏమీ కోరుకోరు ..వారు ఎప్పుడూ బాగుండాలి అని అనుకుంటారు .అలా తమ యొక్క బిడ్డ ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కుంటారు.
శివమ్మ కు చిరాకల కోరిక తను తల్లి అవ్వాలి అని ..కానీ ఆ కోరిక తీరలేదు..అది కోరిక కాదు ..మాతృత్వం ఒక దైవత్వం...అ విషయం మనసులో ఉంచుకుంది గాని ఎవరికీ చెప్పలేదు ..నాకు అన్ని తెల్సు .ఆమె .." అని చెబుతుండగా ఈలోపు వచ్చింది శివమ్మ ..
నేను "అమ్మా! చెప్పమ్మ ..నాకోసం ఏమి చేసావు? నువ్వుచేసి పెట్టే పాయసం అంటే ఎంత  ఇష్టమో నాకు..ఎవరికీ చెప్పలేదు ఇప్పటివరకు ..నంది ,మీ పార్వతి మాత వల్ల కూడా కాదు, ఇలా పాయసం చేయటం " అన్నాను.
కైలాసంలో శివయ్య చమత్కారం చూసి మురిసిపోతుంది ..పార్వతి మాత ..
నేను "అమ్మా, ఈ నందికి ఇవన్ని కైలాసం లో చెప్పవద్దు అని చెప్పు ..అక్కడికి వెళ్లగానే నంది ఆమె పక్షం వహిస్తాడు .." అని షికాయతు చేసాను.
శివమ్మ కి ఏమి అర్ధం కావటంలేదు .. శివయ్య కనపడటం ఏంటి, ప్రత్యక్షంగా ఉండటం ఏంటి, తనతో నిజంగా కడుపున పుట్టిన బిడ్డ లాగా చనువుగా ఉండటం ఏంటి ..మనసంతా ఆమెకు  మహాదేవుడు .అందుకే అంత ఆనందం ..
శివమ్మ కి ఒక మాట గుర్తుకు వచ్చింది "అత్త  ఎప్పుడైనా శివయ్య వస్తే నీ చేతి వంట తినిపించు, ఇక చూడు ఎక్కడికి  పోడు" గతంలో విన్న మాట.
శివమ్మ  "శివయ్య ,ముందు పాయసం చేసి చేసుకొని తీసుకువస్తా ఉండు " అంటూ లోపలి వెళ్ళింది.  కానీ మరిచిపోయింది తను పాలను చిన్న పిల్ల కోసం ఇచ్చిన విషయం ..
పార్వతి  మాత అంతా చూస్తోంది..
నేను "అమ్మా, పాలు అక్కడే ఉన్నాయ్ చూడు "అన్నాను గట్టిగ ..
వెంటనే అవి అక్కడ ప్రత్యక్షమయ్యాయి .. అంతే, శివమ్మ ఉత్సహంగా చేస్తోంది పాయసం ..
నేను "అమ్మా, బాగా చెయ్ ..ఇదిగో ముందే చెబుతున్నా, నా ఒక్కడికే పాయసం, ఎవరి కి ఇవ్వకు ,వాళ్ళకి కావాలంటే మళ్ళీ చేద్దూగాని " అన్నాను.
నంది హాస్యంగా "అదేంటి ప్రభు ,మేము తినకూడదా .." అన్నాడు.
నేను "మా అమ్మ చేసింది  నేనే తినాలి అంతే..కావాలంటే మీ అమ్మ చేసింది  నువ్వు తిను" అన్నాను.
నంది "అదేంటి ప్రభు ..మా అమ్మ చేసింది మీకు పెడుతుందిగా,అలాగే ఈ అమ్మ చేసింది మేము తినకూడదా?" అని అడిగాడు.
నేను "ఉండు నీ పని మా అమ్మ కు చెప్తా.." అన్నాను చిన్నపిల్లలు అన్నట్టు ..
నేను "ఎవరు ఎన్ని చెప్పినా పాయసం నాకు మాత్రమే ..కావాలంటే మీ అమ్మ చేసింది నువ్వు తిను .." అన్నాను.
ఇంతలో ,విష్ణు దేవుడు కైలసంలో ప్రత్యక్షమయ్యాడు .....పార్వతి మాత చూసింది ....
విష్ణు దేవుడు "సోదరి ,ఒక చిన్న విన్నపం"
అన్నాడు.
పార్వతి  మాత "ఏమిటి సోదరా ..మరి మహాదేవుడు ..ఒప్పుకుంటాడా లేదా?"అని అడిగింది.
విష్ణు దేవుడు "మరి ఆ పాయసం ఎవ్వరికీ పెట్టరట..నువ్వు నాకేమైనా పెట్టిస్తావా? " అని అడిగారు.
పార్వతి  మాత "సోదరా, నేను చేసి పెడతా పాయసం ..మనం వారిని బతిమలలేము "అంది.
విష్ణు  దేవుడు "అది కాదు సోదరి, నాకు కూడా అది తిందామని ఉంది ..ఆమె పెట్టే ప్రసాదాలు మహాదేవుడే కాదు, నేను కూడా  తింటాను ..ఆమె భక్తి అపురూప మైంది..ఆమెకు దేవుడు కూడా దాసుడే" అన్నాడు.
పార్వతి  మాత "అవును అవును ..తమరు ఇరువురూ ఒకరేగా ..ఆ సంగతి మర్చిపోయాను ..భక్తులు ఉంటే చాలు తమకు ..ఇంకేమీ వద్దు. సోదరా తమరు నేను చేసిన పాయసం తింటారా తినరా ?"అనడిగింది.
విష్ణు  దేవుడు "సోదరి పోనీ తమది తింటే మాకు అది కూడా పెట్టిస్తారా ..." అని అడిగాడు.
పార్వతి  మాత "  ఉండేది పాల సముద్రం లో..క్షీరసముద్ర రాజ తనయకు భర్త ..మీకు ఆ పాయసం ఎమదుకంట ?"అంది చలోక్తిగా.
విష్ణు  దేవుడు "భక్తి తో ఆమె ఇచ్చే చుక్క పాలు కూడా మాకు మహా నైవేద్యం "అంటూ   పైకి చూస్తూ మౌనం వహించాడు ...
ఇదే పరిస్తితి బ్రహ్మ లోకంలో కూడా.....
ఇక శివమ్మ ఇంట్లో ...
నేను "నంది ,ప్రపంచ భక్త చరిత్ర లో నేడు గొప్ప ఘట్టం చోటు చేసుకోబోతుంది .. చూసి తరించు..మనసు దోచుకునే  ఆమె భక్తికి జరగబోయే పరిణామాలు చూడు .... భగవంతుడైన నాకు  సైతం కంట నీరు తెప్పిస్తుంది ...మా అమ్మ శివమ్మ " అన్నాను.
నంది "శివమ్మను మనం కైలాసం తీసుకొని వెళ్దాం ..." అన్నాడు.
నేను "ఆమె కోరిక తీర్చి తప్పకుండా వెళ్దాం" అన్నాను.
సరదాగా పార్వతిమాత కూడా శివమ్మను శివయ్యను చూస్తుంది ...
విష్ణు  దేవుడు ,లక్ష్మి దేవి , బ్రహ్మ దేవుడు ,సరస్వతి దేవి , కైలాసం చేరారు. వారే కాదు అన్ని లోకాలు ,సప్త ఋషులు, సర్వ దేవతలు ..చూస్తున్నారు ..
అందరూ శివయ్య లీలను చూడబోతున్నారు.
నేను "ఇప్పుడు ఏమి జరగబోతుందో ..ఎవరి మనోనేత్రలకు అందకుండా చేశాను ..ఇక చూడు నంది ,భగవంతుడ్ని భక్తులు ఏమి చేయగలరో .." అన్నాను.
నంది కళ్ళలో ఆనంద బాష్పాలు ...అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ......
నేను "అమ్మ పాయసం తయారయ్యిందా ?"
అని అడిగాను.
(సశేషం)

No comments:

Post a Comment

Pages