అఖిలాశ పుస్తక పరిచయం - అచ్చంగా తెలుగు
అఖిలాశ పుస్తక పరిచయం
కుంచె చింతాలక్ష్మి నారాయణ
కవి,రచయిత, డ్రాయింగ్ ఆర్టిస్ట్ 

ఓ...ప్రియసఖీ ! 
ఈ అఖిలాశ ప్రశంసలకు తూలిపోడు. విమర్శలకు క్రుంగిపోడు. ప్రశంసల విమర్శల హోరులో కళలో తాదాత్మ్యం చెందిన ఒక సమాధి స్థితిలో, పలక బలపం పట్టి అక్షరాలు దిద్ది అక్షరాలతో ఆడుకుంటాడు. విమర్శలున్నచోటే ప్రశంసలు ఉంటాయంటాడు. వెన్నెల వెలుగుల్లో హాయి హాయిగా మేలిమి బంగారు సిరిబొమ్మను ఆశ్వాదిస్తాడు. వెన్నెల్లో సిరిబొమ్మను ముస్తాబుచేసి పెళ్ళి కూతురులా చేసి మనువాడాలంటాడు. మాంగల్యంతో మానవసంబంధాలు ఎలా ముడిపడీ ఉన్నాయో వివరిస్తాడు. నేడు లోకం రూపాయి చుట్టూ తిరుగుతూ, రూపాయి మనుషులను ఎంత ఎత్తుకు తీసుకుపోతుందో, ఎంత దిగజారుస్తుందో మానవత్వం ఎలా మంటగలిసిపోతుందో కళ్ళకు కట్టినట్టు చూపుతాడు. రూపాయి జీవనాధారం అనుకుంటే పొరపాటు అంటాడు. జన జీవనానికి జీవనాధారం జలమవసరమని, మగువలకు మాంగల్యం విలవలను తెలియజేసేలా గొంతెత్తి చెప్తాడు. అమ్మ ప్రేమ అనంతం. అమ్మ ప్రేమే సత్యం అంటాడు. అమ్మే సర్వస్వం అంటాడు. వాన చినుకులతో దాగుడు మూతలాడుతాడు. వాగులు, వంకలు, నదుల్లో కలసి ప్రయాణిస్తాడు. వానలు కురిసి వంకలు పారి నదిలా ప్రవహిస్తూ, మలుపులు తిరుగుతూ, ఉన్నప్పటి ప్రకృతి అందాలు మన ముంగిట నిలుపుతాడు. కరువును తరిమికొట్టి, సంక్రాంతి పండుగ చేస్తానంటాడు. 
నాన్న బరువు బాధ్యతలు తెలిసినోడు. నాన్న జ్ఞానం అజ్ఞానం కాదని జీవనసూక్తియై పంచప్రాణాలు, పంచేంద్రియాలు మనిషిలో దాగున్న అజ్ఞాత శక్తిని వెలికితీస్తాయంటాడు. ఏమైందీవేళ అంటూ చిన్నారి పాపలను చేరదీస్తాడు. ఏది శాశ్వతమని అంతా మాయేనంటాడు. తల్లివేదనకు కారకులను వదలనంటాడు. కుబేరుల అవినీతికి, పేదలు ఆకలితో అలమటిస్తున్నారని కన్నీరు కారుస్తాడు ఈ భావికవి.  
 ఓ... ప్రియా గురువు అన్నింటిలో ఉంటాడని, గండం ప్రతిఒక్కరికీ తప్పదని నిశబ్దం వలదు కదా, అంటాడు. నాది దేహ ప్రేమ కాదు జీవప్రేమ అని అదే శాశ్వతం అంటాడు. కవితలల్లుతానంటాడు. ఒక్క క్షణంలో ఏమిజరుగునో కలకంటూ  'హితరేయేలికా నీకై వచ్చాను ఇలా' అంటాడు. సమస్య సమస్యతోనే సద్దుమణగదా? "సమస్యే సమస్యకు కారణం, కారకం, కష్టం మందార అఖిలాశ!" ,"వినవయ్యా వినవయ్యా ఓ తెలుగోడా! ", "ఓ...అఖిలనిఖిలం నీచుట్టూవున్న నగరీకులు అనాగరీకులు!", "నగరవాసులు వెళ్తున్నారు నిన్ను పట్టించుకోకుండా" అంటాడు. 
"హేయ్ ఏమనుకుంటున్నావ్?" అని కేకలు వేసి నా స్నేహితుడని," ఓ..నరుడా మేలుకో" అంటాడు. "నీవేలే నా కలం. నీవేలే నా గళం" అంటాడు. ఓ.. వీరసైనికుని గాధను, అతనికి దేశంపై ఉన్న  ప్రేమకు ఆనవాళ్ళుగా చేసిన నిశ్శబ్దవిప్లవాన్ని,ఎంతో అధ్భుతంగా కవి విశదీకరించాడు.      
పుస్తకాలకై సంప్రదించండి: 
johnybashacharan@gmail.com                                

No comments:

Post a Comment

Pages