కవిత్వం - అచ్చంగా తెలుగు

కవిత్వం 

 హరీష్.గొర్లె అంతర్మధనం కొంత ఒలికి, 
సమాజానికి సంధి చేస్తూ ,
అక్షరమొకటి మత్తుని గిల్లీ, 
ప్రపంచపు ఆలోచనలని తట్టి లేపింది. 
భావానికి బలం నింపి, 
రక్తంలో నిప్పురవ్వలు కదిలిస్తూ,
అడుగులకి వెలుగులిస్తుంది.
ప్రపంచాన్ని ప్రజల్ని చేస్తూ, 
వర్గ భేదాలని విదిలిస్తూ, 
వేల కంఠాలకి ఏకస్వరానిస్తుంది.
పోరాటానికి ప్రాణం పోసి, 
కవిత్వము కదిలిస్తుంది .
ప్రపంచాన్ని 
అందాల  వర్ణ పల్లకిలో మోస్తుంది.
తన చూపు తాకితే సౌంధర్యం, 
సమయానికి తను బందీ కాదు, 
తరాలు మారిపోతున్నా, 
కవిత్వానిది యవ్వన సంతకం ... 
****

No comments:

Post a Comment

Pages