చేయి అందించి మన ప్రేమ గెలిపించవా 
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు
9642618288
పల్లవి:నీలాల నింగిలో చందమామ నీకొరకై వేచెను ఈ కలువ భామ    
వెన్నెల వీడి నను చేరగ రావా కలిసెదము హృదయముల వ్యధలు తీర్చగా װనీలాలװ
చరణం:1
సఖా లాలించే పాటవై రావా  నన్ను మురిపించే మాటవైపోవా  װసఖాװ
నిన్ను చేరే క్షణం ప్రేమ పులకించదా తీపి అధరాల రుచి చూడ భాగ్యమీయవా  װనీలాలװ
చరణం:2
నీలి మేఘాల కబురంపలేదా కోటి రాగాల ఉయ్యాలలూగ   װ నీలి װ
రేయి స్వప్నాలనూ నన్ను వేధించక చేయి అందించి మన ప్రేమ గెలిపించవా װనీలాలװ
  ****
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment