నారాయణా! వాసుదేవా! - అచ్చంగా తెలుగు

నారాయణా!  వాసుదేవా!

పెయ్యేటి రంగారావునారాయణా!  వాసుదేవా!
రఘుకులతిలకా!  రామచంద్రా!  || నారాయణా||
ఊహాలలోనే వున్నావంటే,
నీ ఉనికే అది కల్పన ఐతే,
పురాణమ్ములు పుక్కిటివేనా?
వేదములన్నీ అనృతమేనా?  ||నారాయణా||
గూని చానకు అందము నిడితివా?
చెల్లి కృష్ణకు వలువల నిడితివా?
భక్తకుచేలకు భాగ్యము నిడితివా?
కథలేనా అవి కల్పనలేనా? ||నారాయణా||
అన్నమయ్యకు ఆగుపించితివా?
రామదాసును కరుణించితివా?
త్యాగయ పోతన తరణమందిరా?
కల్లలేనా అవి కల్పనలేనా? ||నారాయణా||
నీ ఉనికే మరి నిజమే ఐతే
భక్తుల బ్రోచే త్రాతవె ఆయితే
పేదగుండెలో వాసముండవా?
నిను ధ్యానించే ధ్యాసనీయవా?  ||నారాయణా||
కోర్కెలు వలదు, కామము వలదు,
సంపద వలదు, భోగము వలదు
నిను ధ్యానిస్తూ, నిను స్మరియిస్తూ
నిను చేరుకొనే వరము నీయవా? ||నారాయణ||
**************

No comments:

Post a Comment

Pages