కొబ్బరి రవ్వ లడ్డూ - అచ్చంగా తెలుగు

కొబ్బరి రవ్వ లడ్డూ

Share This

కొబ్బరి రవ్వ లడ్డూ

భావరాజు పద్మిని



ఇవాళ చాక్లెట్ డే ! ఈ చాక్లెట్లు వచ్చాకా, ప్రతి వేడుకకీ ‘సెలబ్రేషన్స్ ‘ కొనిస్తూ, కొని తెస్తూ, మన సంప్రదాయ తీపి రుచులు దూరమయ్యాయనే చెప్పచ్చు. కొత్త తరం వారికి చాలా వంటలు తెలియట్లేదు. సులువుగా తయారయ్యే రవ్వలడ్డూ చెయ్యటం ఎలాగో ఇవాళ మీకు నేర్పించేస్తానే !
కావలసిన పదార్ధాలు :
మూడు చెంచాలు నెయ్యి అరకిలో బొంబాయి రవ్వ కోరిన ఎండుకొబ్బరి – 100 గ్రా. (ఇప్పుడు సూపర్ మార్కెట్ల లో ఇది తయారుగా దొరుకుతోంది ) జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ లు –కావలసినన్ని 4 ఏలకులు పావుకిలో పంచదార ఒక కప్పు పాలు
తయారీ విధానం :ముందుగా ఒక మూకుడులో నెయ్యి వేసుకుని, జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ లు వేసి, వేగాకా, బొంబాయి రవ్వ, తురిమిన ఎండు కొబ్బరీ వేసి, ఎర్రగా అయ్యి, మంచి వాసన వచ్చేదాకా వేయించుని, ఒక బేసన లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ లో పంచదార, ఏలకులు వేసి, ఎక్కువ గ్రైండ్ చెయ్యకుండా బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ వేసిన బేసనలోనే పంచదార వేసి, కలిపి, తగినన్ని పాలు పోసుకుంటూ, ఉండ అవుతోందా లేదా చూసుకుంటూ, వేడి మీదే లడ్డూలు కట్టేయ్యాలి. కనీసం 10 రోజులు నిలవ ఉండే ఈ లడ్డూలు, అమృత ప్రాయంగా ఉంటాయి. తప్పక ప్రయత్నిస్తారు కదూ !
****

No comments:

Post a Comment

Pages