పచ్చ నోటు – పిచ్చి నోటు.. - అచ్చంగా తెలుగు

పచ్చ నోటు – పిచ్చి నోటు..

Share This

పచ్చ నోటు – పిచ్చి నోటు..

కృష్ణ కసవరాజు


ఆదరా బాదరాగా రాత్రి తొమ్మిది ఇంటికి మా అత్తగారి ఫోన్ మ్రోగింది ...చెప్పండి అన్న..మా అమ్మాయి కి ఇవ్వండి చాల అర్జెంట్ అంటోంది..ఆవిడ హడావుడి చూసి నాకేం అర్ధం కాలేదు కాసేపు...
ఆ..ఆఆ...ఆః...ఓ..అమ్మో......అరె..........ఆ...ఉహు...అయ్యూ..అన్న శబ్దాలే తప్ప ఏమి అర్ధం కావడం లేదు... నాకు టెన్షన్ పెరిగిపోతోంది... ఇలా ఓ అరగంట గడిచాక ఫోన్ పెట్టేసి వంటింట్లో కి వెళ్లి...గబా గబా సర్దేస్తోంది..ఇళ్ళు మారుతున్నమా ఏందీ ఏమిటి హడావుడి అన్న ..
అబ్బే అస్సలు పలికే స్టేజి లో లేదు...వంటింట్లో నుంచి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది చీరలన్ని తీసి కిందపదేసింది. ..ఏమిటే..నన్ను సహాయం చెయ్యమంటావా అని అడిగా ... ఏమక్కర్ల..dont disturb అనింది...వామ్మో...ఇదేదో...సీరియస్ విషయం లాగుందే అనుకున్న .లేకపోతే ఇంగ్లీష్ వాడదు ..మా ఆవిడ..
అర్ధరాత్రి దాక సాగింది ...ఈ శోధన...tv lo అ.నీ.శా వాళ్ళు వెతుకు తుంటే బనీను వేసుకొని జాలి గా చూస్తున్న అవినీతి చేప లా వుంది నా పరిస్థితి.. ఇదంతా ఎందుకో ఈ పాటికి మీకు అర్ధమయ్యేవుంటుంది..
జేబులో పెట్టుకున్న ఆరు ఐదువందల నోట్ల లో..మూడు తగ్గి వుంటాయి ఆఫీస్ కి వెళ్లేసరికి...ఎవర్ని అడగాలో..తెలిదు...ఇంటావిడ ని అడిగితే నోట్ల సంగతి ఎలా వున్నా నోట్లో వున్నా పళ్ళ సంగతి ..చూసుకోవాలి గా...
అవన్నీ ఇలా వంటిట్లో డబ్బాలకి...చీరల మధ్య చేరాయని నిన్న నే తెలిసింది..ఇంట్లో వున్నా hide మనీ నే ఇంత వుంటే..దేశం లో వున్నా బ్లాకు మనీ ఎంత వస్తుందో బయటకి..
లక్షల జీతాలు వస్తున్న పదిరోజులు కుడా రావడం లేదు ..ఇచ్చిన డబ్బులతో వీళ్ళు నగలు ..చీరలు ఎలా కొంటున్నారా అని డౌట్ వుండేది..ఇప్పుడు అర్ధమైపాయింది..
నెలాఖరు లో కుడా వంటిట్లో అయిదువందల నోటు కనిపిస్తే ఇదేదో బ్రమ అనుకోని వెళ్ళిన సందర్భాలు అనేకం..
మొగవాళ్ళ కళ్ళు తెరిపించి...నిజం తెలిసేలా చేసి...hide మనీ ని బయటకు రప్పించిన మోడీ గారికి నమస్కారం చెప్పుకుందాం ఓ సారి...
 ********

No comments:

Post a Comment

Pages