కడుపుగాసం - అచ్చంగా తెలుగు

కడుపుగాసం

కృష్ణ మణి

ఏమున్నది సారు
కడుపుకాలి ఒకడుంటే
పెయ్యిబరువెక్కి
నోరు గులాగులాంటోడు ఇంకొకడు
ఇత్నం కొనవోతే
తక్వ ధర ఎక్వ లాభమని
గుంజి గుంజి చేత్లవెడతరు
ఏమ్మున్నది సారు
నాగలి సాగక తిప్పలైతే
ట్రాక్టర్ సౌండుకు
గుడ్లు తెలేశినై ఎడ్లు
ఏమ్మున్నది సారు
తడందక ఎండిపోతే ఒకపారి
నీళ్లేక్కువై మురుగవట్టే ఒకపారి
ఏమ్మున్నది సారు
శేనుకు మందుగోడుతుంటే
కారాపి నక్షలు సూస్కుంటా
నొసల్తోని ఎక్కిరిస్తరు
ఏమ్మున్నది సారు
చేశేదేమి లేక
నాగలి తాళ్ళు
చెట్టుకు యాలాడవట్టే
ఏమ్మున్నది సారు
ఇంకేమిలేదు సారు
ఉన్నదమ్ముకొని
ఊరవతల జీతముండాలే
పొరల మంచి చెడ్డ మరిశి
కడుపుగాసం బతుకులాయే
ఏమున్నది సారు
ఇంకేమున్నది?
****

No comments:

Post a Comment

Pages