కార్తిక మాస ప్రశస్తి... - అచ్చంగా తెలుగు

కార్తిక మాస ప్రశస్తి...

Share This

కార్తిక మాస ప్రశస్తి...

గోపీనాథ్ పిన్నలి 


. సీ. కార్తిక మాసంబె కమనీయమై దోచు ... దివ్య ధామము జేయు దీపములతొ
ఇంటింట వనితలూ యిరుగు పొరుగుల జేరి ... కదిలింతురిటకు గైలాస కొండ
ఊరూర యుపవాస, వన భోజనాలతో ... జీర్ణ పుష్టియు, చెట్ల చిక్కదనము
సాగర తీరాల సరిగంగ స్నానాలు ... పుణ్య దంపతులకు బూర్తి ముదము !!
తే.గీ. ఇట్లు కార్తికంబును భక్త హృదుల నెల్ల
స్వాస్థ్య పరచును నిత్యమూ స్వచ్ఛముగను !
మార్గశిరమదిగో భక్తి మదిని నింపి
విష్ణు ధామంబు సేయుగా విశ్వ మంత!!
2. సీ. చెఱకు తోటలు జూడు చెలిమితో నిల నిండ ... గుడము వాసన నింపు ఘమఘుమలును !!
చెక్కెర మిల్లుకూ చేతి నిండా పని ... గల్పించు మరి మంచి గాల మిదియె !!
జిహ్వ కది సవాలు చిలుక చేరని జామి .. సీత ఫలాలదే సౌరు యనగ!!
ఉసిరి గుత్తులు నోరు నూరించు, మరి నీడ, ... అనిలమది మనకు నవసరంబె!!

ఆ.వె. పూలు, పండ్లు తొలుత వేలుపులకె ఇచ్చి
నగము నీడ వాటి నారగింప
శక్తి, భక్తి, ముక్తి కార్తికంబు సృజన
సంప్రదాయ పరుల సంపదదియె !!

( చక్కెరను తెలంగాణ, రాయల సీమలలో చెక్కెరా అని వ్యవహరిస్తుంటారని తెలుస్తున్నది. గుడము ... బెల్లము,  చిలుక చేరని జామి...చిలుక కొట్టని జామకాయ, అనిలము...గాలి,, నగము .. చెట్టు)

No comments:

Post a Comment

Pages