గోదావరి నుంచి సబర్మతి వరకు - 7
-అవని
(జరిగిన కధ : ఖమ్మం నుంచి అహ్మదాబాద్ కు వెళ్ళే నవజీవన్ ఎక్ష్ప్రెస్ లో ప్రయాణిస్తూ గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటుంది ప్రణవి. కాకతీయ యూనివర్సిటీ లో గణిత శాస్త్రంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉంటుంది ఆమె. ఆహ్మేదాబాద్ లో జరగనున్న జాతీయ శాస్త్ర, సాంకేతిక సదస్సులో పాల్గొనేందుకు ఆమె అక్కడకు వెళ్తూ ఉంటుంది. భారతదేశంలోని ప్రముఖ గణిత శాస్త్రవేత్తల్లో ఒకడు కృష్ణమోహన్. వాళ్ళ ఇంటికే ప్రణవి వెళ్తుంది. కృష్ణమోహన్ భార్య గాయత్రి, తల్లి వేదవతి. వేదవతి గారు అడగ్గా, తన గురించి చెప్తూ ఉంటుంది ప్రణవి. ఆమెకు పెళ్లై ఒక బాబు ఉంటాడు. కాని, భర్త మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కృష్ణ ను ఎలా కలిసానో ఆమె చెప్తూ ఉంటుంది.)
అది నేను మొదటిసారి కృష్ణని కలిసిన రోజు..
డిల్లీలో జరిగిన ఓ జాతీయ సదస్సు..కృష్ణ,నేను..ఎదురు,ఎదురుగా కూర్చున్నాం.అప్పటివరకు ఒకరికి,ఒకరికి పరిచయం లేదు.
మా కళ్ళు మాత్రం ఒకరితో వొకటి మాట్లాడుకుంటున్నాయి.అంతరంగంలో ఏదో తెలియని ఆర్ధ్రత ఇద్దరిలో.ఏదో తెలియని ఆత్మీయత తట్టిలేపుతున్నట్టుంది.
సూటిగా నన్నే చూస్తున్నాడు .
నేను ఒకసారి తేరిపార చూసాను.కొంత అసహనం గా వున్నట్టు నటించాను.
తను ఏదో ఆలోచిస్తున్నట్టు శూ న్యంలోకి చూస్తున్నాడు.
మొహంపై చిరుదరహాసం..ఏదో తెలియని కాంతి నన్ను ఆకట్టుకుంది.
ఓసారి మాట్లాడాలనే ఆతృత,నన్ను తొందరపెడుతోంది.తనే మాట్లాడతాడని ఓ ఆశ నన్ను వెంబడిస్తోంది.
ఓ పక్క జోరుగా సెమినార్ సాగుతుంది.ఎవరి హడావిడి వారిది.
కాని కృష్ణ మాత్రం నిశ్చలంగా,నిర్మలంగా గంగ అంత స్వచ్చంగా కనిపించాడు నాకు.
మధ్యలో ఓ చిన్న విరామం..
మా తొలి చూపుల నిట్టూర్పులకు అంతరాయం కలిగిస్తూ మా పరిచయాలకు నాంది పలికిన ఓ సుముహూర్తం.
మీ పేరు తనే చొరవతీసుకొని అడిగాడు.
ప్రణవి చెప్పాను.
ఓంకారనాదమంత ప్రశాంతంగా వుంది అన్నాడు.నవ్వుతూ.
మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే వుంటారా..అడిగాను.
ఏవండి..అదేమైనా నేరమా..అన్నాడు.మళ్ళీ సరదాగా..
ఆ తొలిపరిచయం..మా మాటల ప్రవాహం..ఓ అనంత ఝరి..ఆ ప్రవాహంలో అన్నీ వుంటాయి.సప్త స్వర సంగమాలుంటాయి.ఓసారి ఎవరికీ అందని అలలు,అర్ధంకాని భావావేశాలు..అంతులేని బడబాగ్నులు ..ఎన్నో,ఎన్నెన్నో..ఏమీ అర్ధంకాని స్తితి మరోసారి..
బంధాలు ఇంత బలంగా వుంటాయి అని నాకు జీవితంలో మొదటిసారి తెలిసింది.
ప్రతి క్షణం అప్పుడే కరిగిపోయిందా అనే బాధ..మళ్ళీ మరో క్షణం మొదలయ్యిందన్న ఆనందం.
ఓ హరివిల్లు..సన్నని లేత ఎండ జీర..ఓ లేత గులాబి..దాని మీద వాలిన ఓ సీతాకోకచిలక..ఏదో తెలియని ఓ అనుభూతి..
మా పరిచయాన్ని ఎక్కడికో తీసుకెళ్ళింది.
ఎప్పుడు తన మాటల్లో నా పట్ల తెలియని ఓ అత్మీయత,అనురాగం..తను నా సొంతం..అన్న భావన,గత జ న్మ ల బంధమెదో ఇది అన్న ఫీలింగ్ నన్ను నిరంతరం వెంటాడేవి.
అంతా బావున్నట్టే వుండేది.
మళ్ళీ నాలోకంలోకి వచ్చి చూస్తే..కిం కర్తవ్యం..ఇది అతి పెద్ద ప్రశ్న.
సమాధానం చెప్పలేని,సమాధానం దొరకని ప్రశ్న.
కృష్ణ పరిచయంతో యుగమొక క్షణంలా గడిచిపోతోంది.
ఎంతసేపూ నా గురించేనా..నీ గురించి కూడా చెప్పొచ్చుకదా..ఓ రోజు అడిగేను క్రిష్ణని.
ఏం చెప్పమంటావు..ఎలా చెప్పమంటావు..?
సెలయేటి దగ్గర నిలబడి ఆ చప్పుడు వింటున్నప్పుడు మనకి వేరే శబ్ధాలు వినబడావు.ఇంకా ఏదైనా వినబడుతున్నా,ఆ చప్పుడు లొ అవి కలసిపోతాయి.అదొక హంసధ్వని రాగంలాంటిది.ఆ మాధుర్యాన్ని అనుభవించాలే కాని వర్ణించలేం.
అలాగే నీ మాటలు వింటున్నప్పుడు నాకు వేరే చప్పుడు వినిపించదు,చేయాలనిపించదు.
ఇక నా గురించి అంటావా..ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది.
అంటే..
మన గురించి మనం మాట్లాడకూడదు..మన పనులే మాట్లాడతాయి.
నీ పనుల గురించి,వివరాల గురించి కాదు..
కనీసం గాయత్రి,పిల్లలు,అమ్మ,నాన్న..అలాంటివి.
అందర్నీ నువ్వు చూసావు కదా..ఇంకా ప్రత్యేకంగా చెప్పడానికేముంది.
గాయత్రికి నువ్వు నాతో చనువుగా వుంటున్నట్టు అనిపించడం లేదంటావా..? తను ఏమైనా అనుకుంటుందా,,?
చూడాలి.. ముక్తసరిగా సమాధానం చెప్పాడు కృష్ణ.
అసలు గాయత్రితో నీకు సమస్య ఏమిటి..
చక్కని అమ్మాయి..మంచి తనానికి మడిగట్టినట్టు ఒద్దికగా వుంటుంది.అంతకన్నా ఎవరైనా ఏమి కోరుకుంటారు.
చూడ్డానికి పాలు తెల్లగా వుంటాయి,సున్నపు నీళ్ళు తెల్లగా వుంటాయి.కాని దేని తీరు దానికుంటుంది.
అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇలాగే వుంటాయా..సూటిగా వుండవా..
నువ్వు అర్ధం చేసుకున్నావు కాబట్టి..ఇలా చెబుతున్న సహనాన్ని కోల్పోలేదు.ఇలా నన్నెవరు అర్ధం చేసుకుంటారు చెప్పు.
సమయం,సందర్భం వచ్చినప్పుడు అన్నీ నేనే చెబుతాను..చెప్పాడు కృష్ణ.
కృష్ణా..మనం ఎటెలుతున్నాం..
మానవత్వం మంచికోసం,మమత ఆత్మీయత కోసం,అనురాగం అమరత్వంకోసం వెతుకుతున్నవేపు వెలుతున్నాం.
నీ మాటలన్నీ ఇలా అంతుచిక్కని అర్ధాల వేపు,ఘాడార్ధలోతులవైపు దార్లు తెరుచుకు చూస్తున్నట్టు వుంటాయి.
నువ్వు నీలాగ మాట్లాడు..నాలా కాదు..
నువ్వు పి.డి.ఎఫ్.కి అప్ప్లై చెయ్..
అంటే..అదే పోస్ట్, డాక్టరేట్ ఫెలోషిప్ కి..నీలాంటి ప్రతిభ వున్నవాళ్ళు అలా నిరుత్సాహంగా వుండకూడదు.
ఇప్పటికే సుడిగుండంలో కొట్టుకుంటూ..ఏం చేస్తున్నానో..ఏం చెయ్యాలో తెలియక చస్తుంటే మళ్ళీ ఇప్పుడది అవసరమా..
చూడు ప్రణవి..విద్య అనేది జ్నానాన్ని ప్రసాదించే ఓ వరదాయని.దాన్ని ఆస్వాదించినకొద్దీ దాంలో మాధుర్యం మనకి దొరుకుతుంది.మహాసాగరంలాంటిది విద్య అనుకుంటే ఆ సాగర లోతుల్లోని ముత్యాలకోసం వెతకటమే జ్నానం.ఆ భగవంతుడు నీకు జ్నానాన్ని,ఆ జ్నానాన్ని అందించడానికి విద్యార్ధుల్ని నీ చేతిలో పెట్టాడు.నీ జీవితకాలంలో నీ దగ్గర చదువుకున్న విద్యార్ధి ఒక్కడు వచ్చి,మీరు నాకు ఆ రోజు జీవితమంటే అర్ధమయ్యేలా ఓ పాఠం చెప్పారు..అదే నన్నీరోజు ఈ స్తాయిలో నిలబెట్టింది.అని చెప్పినప్పుడే నీ వృత్తికి సార్ధకత.
హోవర్డ్,కెల్లీ గురించి చెప్పాను కదా నీకు..
లైక్ ఎ ప్రొఫెసర్..లైక్ ఎ స్టూడెంట్..
విద్యా ప్రమాణాలు పడిపోయాయంటారు..వ్యవస్త మారాలి అంటారు..కానీ మార్పు మనదగ్గరే మొదలవ్వాలి అని మాత్రం గుర్తించరు.
ఇంత ఆవేదన వున్నవాడివి నువ్వు ఎందుకు వ్యవస్త గురించి ఆలోచించవు.
నువ్వు..నువ్వు అంటూ ప్రతీవాళ్ళు ఎదుటివాళ్ళ వైపు చూస్తూ కూర్చోడంవల్లే నిన్న కాక మొన్న స్వతంత్రం వచ్చిన చిన్న దేశాల్ని చూసి మనం సిగ్గుపడాల్సి వస్తోంది.
చెప్పేవాళ్ళు ఎక్కువ..చేసే వాళ్ళు తక్కువ.
ఎవరి భాద్యత వాళ్ళు చక్కగా నిర్వహించుకుంటూ పోతుంటే..వ్యవస్తలో ఊహించని మార్పులొస్తాయి.
కానీ చేస్తారా..
ప్రభుత్వ ఉద్యోగం కోసం పోరాటం..వీలైతే సవ్యంగా సాధిస్తారు..లేకపోతే పక్కదారులు కోసం వెతుకులాట..దాని పర్యవసానం పూర్తి సమాజం మీద పడుతోంది.
అవినీతి అనే భూతంతో సమాజాన్ని చిందరవందర చేస్తోంది.
జనన ధృవ పత్రం దగ్గర మొదలయ్యే లంచం..మరణ ధృవ పత్రం తో కూడా ఆగడం లేదు.
మధ్యలో జీవితమంతా మనిషి నలిగిపోతూనే వున్నాడు.
విద్యే కదా సమాజాన్ని మార్చే దిక్సూచి..ఆ విద్యని నేర్పేవాడే కదా మార్గదర్శి..
మరలాంటి మార్గదర్శకులు ఎలాంటి మార్గాన్ని నిర్దేశిస్తున్నారు..ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి.
మంచి వైపు మార్గాన్ని చూపించాలి.స్వార్ధాన్ని వీడాలి.
నవ జీవన నిర్మాణానికి పునాదులు వెయ్యాలి.
భవిష్యత్ మీద ఆశలు కల్గించాలి.
కృష్ణా..నీ ఆశలు,ఆలోచనలు,భావాలు,సిద్ధాంతాలు అన్నీ నిజంగా అద్భుతాలు.
అందుకే నువ్వు మాట్లాడుతూ వుంటే ..నేనో మరబొమ్మనైపోతాను.
నువ్వు రాసిన బౌండెడ్ గాప్ థియరీ నేను స్టూడెంట్స్, కి చెబుతున్నప్పుడు వచ్చిన రెస్పాంస్ మార్వెలస్..
రియల్లీ..హేట్సాఫ్..
బంగారం..నన్ను,నువ్వు..నిన్ను ..నేను పొగుడుకుంటూ కూర్చొంటే ఏమిటి లాభం.
నీలో చాలా సామర్ధ్యం వుంది..దాన్ని బయటికి తియి..పదిమందికి వుపయోగపడేలా చెయ్యి..
అదే నేను చెప్పేది..
పద ఆసుపత్రికెళ్ళి ఓ సారి చూసొద్దాం...
(సశేషం...)
No comments:
Post a Comment