దీపావళి - అచ్చంగా తెలుగు

దీపావళి

ఓ.సుబ్రహ్మణ్యం


వచ్చింది దీపాల పండగ
తెచ్చింది సంబరాలు మెండుగా
గోరంత దీపం ఊరంతా  వెలుగు
ఆనందం మనకు ఎలలేని వేడుక
కిటకిటలాడె లోగిళ్ళు
పిటపిటలాడె కన్నేపిల్లల పరవళ్ళు
ఇంటింటా పిండివంటల జోరు
కేరింతలతో పిల్లల హోరు
చిటపట చిటపట మ్రోగె టపాసు
పూల మెరుపుతో వెలిగె మతాబు
వెలిగించు  ఓ దీపం
తొలగించు చీకటి అజ్ఞానం
దీపావళి శుభాకాంక్షలతో
మీ చేరిక
ఈ అక్షర మాలిక
****

No comments:

Post a Comment

Pages