జోక్స్ - అచ్చంగా తెలుగు

"జోక్స్"

-ప్రతాప వెంకట సుబ్బారాయుడు

  1. "నువ్వు ఆఫీసులో ఉండగా రోజూ మీ ఆవిడో..పిల్లాడో వచ్చి చూసిపోతుంటారేమిటి?"
"అదా..నేను నిద్రలో ప్రాణం వదుల్తానని ఓ జోతిష్కుడు చెప్పాడు అందుకని"
*****అదిగో(..మీరు నవ్వి టెన్షన్ ఫ్రీ అయ్యారు..*****
  1. "వాడి ప్రాణం తీసుకు రావడానికి నువ్వు భూలోకం వెళ్లాలి కదా! ఇంకా ఇక్కడే ఉన్నావేం" గద్దించాడు మిస్టర్ యమ
"వాడెలాగూ..ఇంకాస్సేపట్లో విమానం ఎక్కుతాడు..మళ్లీ నేను అక్కడిదాకా ఎందుకనీ.."బద్ధకంగా అన్నాడు యమ భట్.
*****అదిగో(..మీరు నవ్వి టెన్షన్ ఫ్రీ అయ్యారు..*****
 
  1. "టీచర్ను పెళ్లి చేసుకోవడమ్ పెద్ద పొరబాటైందిరా?"
"ఏ చిన్న తప్పు చేసినా బెత్తంతో కొడుతోంది..గోడ కుర్చీ వేయిస్తోంది.."
*****అదిగో(..మీరు నవ్వి టెన్షన్ ఫ్రీ అయ్యారు..*****
  1. రైల్వే ఎంక్వయిరీలో-
"బాబ్బాబు..ఫలాన రైలు కాస్త తొందరగా వచ్చే సూచనేమన్నా ఉందా?" "ఎందుకు?" "మా ఆవిడ పుటింటికి వెళ్లబోతోంది..మనసు మార్చుకుంటుందేమోనని.."
*****అదిగో(..మీరు నవ్వి టెన్షన్ ఫ్రీ అయ్యారు..*****
  1. "మీ ఆయన గొప్ప సినిమా డైరెక్టరు అవుతాడనుకుంటే..జైలు కెళ్లాడేమిటే?"
"ఆ(..కాస్త వెరైటీగా ఉంటుందనీ హీరోయిన్ కి విలన్ తో పాట పెట్టించి..రాళ్లూ..రప్పలూ వేయించాడు.."
*****అదిగో(..మీరు నవ్వి టెన్షన్ ఫ్రీ అయ్యారు..*****
***

No comments:

Post a Comment

Pages