శింజారవానికి మంథా శృతిలయలు - అచ్చంగా తెలుగు

శింజారవానికి మంథా శృతిలయలు

Share This

శింజారవానికి మంథా శృతిలయలు

బ్నిం 


పద్మభూషణ్ రాజారెడ్డి దంపతులు, పద్మశ్రీ శోభానాయుడు, స్వప్న సుందరి భాగవతుల సేతురాం, కళాకృష్ణ, అనుపమ కైలాష్  వీరి నాట్యానికి నేపథ్య గీతాల్ని అందిస్తున్న మంథా శ్రీనివాస్, శ్రీమతి హరిప్రియ వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకొని డిస్టిన్షణ్ స్థాయిలో డిప్లమాలో పట్టభద్రులయ్యారు.
       వృత్తిరీత్యా డిజైన్ ఇంజనీర్ అయినప్పటికీ నాట్యసంగీత రంగానికి ఎనలేని సేవలందిస్తున్నాడు శ్రీ మంథా.
       పంచారామాలు, త్యాగరాజ పంచకీర్తనలు, శబరిగిరీశ శరణం వంటి ఎన్నో నృత్యరూపకాలను స్వరరచన చేశారు. గాత్ర సహకారం అందించారు. ‘రాగాలయ’  విద్యాసంస్థను స్థాపించి సర్టిఫికెట్, డిప్లమో, సంగీత విశారద వంటి కోర్సులలో శిక్షణనిస్తున్నారు.
       పిల్లలకు సులువుగా సాధనకు అనుగుణంగా సంగీతంపై ఆసక్తి, అభిరుచి పెరగాలనే ఉద్దేశంతో ప్రప్రథమంగా కర్ణాటక కరోకీన్ ను రూపొంచించారు. 2006 లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘కళాపరిచయం’ వేసవి సంగీత శిక్షణ కార్యక్రమంలో భాగంగా తులసీదాసు విరచిత నామరామాయణ గానామృతాన్ని 200  మంది చిన్నారులకు అందించి, దాన్ని సీ.డి. రూపంగా వెలువరించి రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖవారి మన్నన పొందారు. రాష్ట్ర రాష్ట్రేతరాల ప్రసిద్ధ కళావేదికలపై తన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.
       అష్టాదశపీఠాలపై రాధమ్మకు నేను రాసిన నృత్యరూపకానికి శ్రీ వల్లి శర్మ సంగీత దర్శకత్వంలో ఈయన గాత్ర మాధుర్యాన్ని మొదట వినే అవకాశం నాకు కలిగింది. నేచురల్లీ అప్పటి నుంచీ ఆయన అభిమానినయ్యాను.

No comments:

Post a Comment

Pages