ప్రకృతి మాతకు నీరాజనం - అచ్చంగా తెలుగు

ప్రకృతి మాతకు నీరాజనం

Share This

ప్రకృతి మాతకు నీరాజనం 

భావరాజు పద్మిని  


అమ్మ తరువాత ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి అందిస్తుంది - ప్రకృతి మాత. అందుకే, త్వరలో రానున్న 'అచ్చంగా తెలుగు' అంతర్జాల మాస పత్రిక' ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రకృతి మాతకు అక్షర నీరాజనం అందించాలని సంకల్పించాము. ఈ సందర్భంగా మేము నిర్వహిస్తున్న పోటీల వివరాలు...
అచ్చంగా తెలుగు మాస పత్రిక - ప్రకృతి కధల పోటీ
--------------------------------------------------పరిపూర్ణ గురుఅనుగ్రహంతో ముందడుగు వేస్తూ, ఫిబ్రవరి 23 న మీ అభిమాన 'అచ్చంగా తెలుగు' అంతర్జాల మాస పత్రిక రెండేళ్ళు పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భంగా, మనకు అమ్మ తర్వాత అమ్మలా లాలించే 'ప్రకృతి మాత' ప్రత్యేక సంచికను తీసుకురావాలని సంకల్పించాము. ఇది పత్రికా రంగంలో ఇంతవరకూ ఎవరూ చెయ్యని ప్రయోగం.అమ్మ వంటి ప్రకృతికి మనం సమర్పించే అక్షర నీరాజనం.ద్వితీయ వార్షికోత్సవం జరుపుకోనున్న ఈ సందర్భంలో నిర్వహించే కధల పోటీల వివరాలు... 1. ఒకరు ఒక రచనను మాత్రమే పంపాలి. 2. కధాంశం ప్రకృతికి సంబంధించినది అయ్యి ఉండాలి. 3. కధ నిడివి సమస్య కాదు, కాని, కనీసం వర్డ్ ఫైల్ లో 5 పేజీలకు తగ్గకుండా ఉండాలి. ఖచ్చితంగా యూనికోడ్, లేక వర్డ్ లోనే(తెలుగులో) పంపాలి. 4. కధ మీ స్వంతమేనని, ఎవరి రచనలకు అనుకరణ, అనుసరణ కాదన్న హామీ పత్రాన్ని జత చెయ్యాలి. 5. మొదటి మూడు బహుమతులు గెలుచుకున్న రచయతలకు, ప్రతి తెలుగు మనసు, తమ ఇంట్లో తప్పక ఉండాలని కోరుకునే విలువైన పుస్తకాలు, ప్రశంసా పత్రం బహుమతిగా అందించబడతాయి. ఇవి కాక, సాధారణ ప్రచురణ కోసం తీసుకున్న ప్రతి కధకి, పుస్తకాల బహుమతి ఉంటుంది. 6. రచనలు పంపాల్సిన ఈమెయిలు : chinmayii02@gmail.com.సబ్జెక్టు లో 'ప్రకృతి కధల పోటీకి' అని తప్పనిసరిగా రాసి పంపాలి. 7.రచనలు మాకు చేరాల్సిన చివరి తేదీ - 8.2.16 ప్రోత్సహిస్తున్న రచయత మిత్రులు, ఆత్మీయులు అందరికీ కృతజ్ఞతాభివందనలతో అచ్చంగా తెలుగు సంపాదక వర్గం. కేవలం కధలే కాక, ఈ సంచికకు కవితలు, ప్రత్యేక వ్యాసాలు, హాస్య వ్యాసాలు, పద్యాలు, ప్రకృతిపై వచ్చిన సాహిత్యం, సినిమాలు, ఇలా మా పత్రిక శీర్షికలలో ఉన్న వాటికి సరిపోయే ఏ రచనలనైనా పంపవచ్చు. ప్రచురించిన ప్రతి రచనకు, ఎప్పటిలాగే మంచి పుస్తకాలు బహుమతిగా మీ ఇంటికే పంపబడతాయి. మీ అందరి ప్రోత్సాహానికి కృతజ్ఞతాభివందనలతో అచ్చంగా తెలుగు సంపాదక వర్గం.

No comments:

Post a Comment

Pages