హనుమా ! - అచ్చంగా తెలుగు

హనుమా !

సుజాత తిమ్మన


ఎంతటి భాగ్యము హనుమా...నీది...
శ్రీరామచంద్రుని  దాసువైనావు..
నిరం'తరము' రామనామ స్మరణలోన
జీవించు 'వరము' పొందినావు..
వా'నరము' అని పరిహసించిన రావణునికి
లంకా ధహనము చేసి... నీ శక్తినే చూపినావు..
దుర్లభమనుకున్నది సుగమమనితెలిపుతూ..
వియోగము కడతేర్చి...ఆలుమగల కలిపినావు..
ఆ హరి అవతార పురుషుడయిన శ్రీ రామచంద్రుని..
భక్తితో బంధించిన హృదయమును చీల్చి చూపినావు...
స్వామి సేవలో సర్వము మరచి ..రామబంటు వై..
రామాలయంలో ముందే  నీవుండి ..భక్తులకు కృప నొసగుతావు..
అందుకే...హనుమా అని తలచిన చాలును ...
భయములు తొలగి ..అన్ని వేళలా..శుభములు కలుగును..
ఆ మారుతి దయయున్నచాలును ..ఎల్లపుడు....దొరుకును 
ఇహమున శాంతి ..'పరమున' దైవ సాన్నిధ్యమొక్షం!!
************    ************    ********** 

No comments:

Post a Comment

Pages