బ్రెడ్ ఉప్మా - అచ్చంగా తెలుగు

బ్రెడ్ ఉప్మా

Share This

బ్రెడ్ ఉప్మా

- జి. లీలాసౌజన్య


పొద్దున్నే త్వరగా చేసుకోగలిగిన టిఫిన్ లలో బ్రెడ్ ఉప్మా ఒకటి, వేడిగా తింటేనే దీని రుచి. కావలసిన పదార్ధాలు : బ్రెడ్ స్లైస్ లు :10 టమాటో లు : 3 ఉల్లిపాయలు : 2 పచ్చిమిర్చి : 2-3 కర్వేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు, కారం, కొంచెం వెన్న /నెయ్యి. పోపుకి : ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా మినప్పప్పు, 2 చెంచాలు మినప్పప్పు, గుప్పెడు వేరుసెనగ పప్పు, రెండు ఎండుమిర్చి. తయారీ విధానం : ముందుగా బ్రెడ్ స్లైస్ లకు కొంచెం వెన్నకాని, నెయ్యి కాని రాసి, టోస్టర్ లో గాని, పెనం మీద గాని, కాల్చుకోవాలి. తర్వాత ప్రతి బ్రెడ్ ను 4 ముక్కలుగా చేసి, ప్రక్కన పెట్టుకోవాలి. (మెత్తగా ఇష్టపడే వాళ్ళు బ్రెడ్ ను టోస్ట్ చెయ్యాల్సిన పని లేదు. అలాగే ముక్కలు చేసుకుని, వాడుకోవచ్చు. ) టమాటో లు, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని, పచ్చిమిర్చి నిలువుగా చీల్చాలి. స్టవ్ పై బాండి పెట్టుకుని, 3, 4 చెంచాలు నూనె పోసి, పోపు సామాన్లు అన్నీ వేసి, వేయించాలి. చివర్లో కర్వేపాకు వేసి, తరిగిన ఉల్లిపాయలు వేసి, వెంటనే ఉప్పు వెయ్యాలి. (ఉల్లిపాయలు ఉప్పు వేస్తె చాలా త్వరగా వేగుతాయి. ) ఉల్లిపాయ వేగాకా, టమాటో ముక్కలు వేసి, మగ్గాకా కారం, పసుపు వేసి, చివర్లో బ్రెడ్ ముక్కలు వేసి, బాగా కలపాలి. వేడిగా తింటే, కరకర లాడుతూ ఉంటాయి బ్రెడ్ ముక్కలు.

No comments:

Post a Comment

Pages