కందాళం రామానుజాచార్యులు గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

కందాళం రామానుజాచార్యులు గారితో ముఖాముఖి

Share This
కందాళం రామానుజాచార్యులు గారితో ముఖాముఖి
 - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

 మృదుభాషణం, విశాల దృక్పథం, విద్వత్తు పోతపోసిన వ్యక్తిత్వం శ్రీ కందాళం రామానుజాచార్యులు వారిది. అజో- విభో - కందాళం ఫౌండేషణ్ కి 11 ఏళ్ళుగా డైరెక్టర్ గా , వెన్నుదన్నుగా ఉంటూ తెలుగు భాష మీద మక్కువతో ఏటా భారతదేశానికి వచ్చి తెలుగు నాటక నటీ నటులను ప్రోత్సహించి, ప్రతిభావంతులైన మహోన్నతులను అప్పాజోస్యుల సత్యనారాయణ గారితో కలిసి సన్మానించడం తమ అదృష్టంగా తలచే భోళాశంకరుడు కందళంరామానుజాచార్యులు వారు. పశ్చిమ గోదావరి జిల్లా ,తాడేపల్లిగూడెం మండలం పెంటపాడుకి చెందిన కందాళం జానకిరామాచార్యులు, పద్మావతి గార్ల ఇద్దరు సంతానంలో మొదటివారు. వీరికి ఒక సోదరి ఉన్నారు. వీరి శ్రీమతి ,శ్రీదేవి గారు , వీరికి పల్లవి, పవన్, ప్రియ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. 1983 లో అమెరికా వెళ్ళి అక్కడ కెమిస్ట్రి ప్రొఫెసర్ గా స్థిరపడి అక్కడే 1984లో ఒక తెలుగు పత్రిక కూడా నడిపిన తెలుగు భాషావీరాభిమాని రామానుజాచార్యులు వారు. అప్పాజోస్యుల వారికి కుడి భుజంగా ఉంటూ 22 ఏళ్ళ అజో--విభో సంస్థను పరిపుష్టి గావించేందుకు కందాళం చేర్చి ఎన్నో తెలుగు భాషా కార్యక్రమాలు తమ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ తెలుభాషకు సేవచేస్తున్న శ్రీకందాళం రామానుజాచార్యులు వారు అచ్చంగా తెలుగు పాఠకుల కోసం కొద్దిసేపు తన మనోభావాలను అచ్చంగా తెలుగు తో పంచుకున్నారు. "మనకంత మంది ఇంజనీర్లు అఖ్ఖర్లేదు. మనకి మంచి కళాకారులు కావాలి... మంచి సంగీతకారులు కావాలి. మంచి థియేటర్ ఫ్లో పీపుల్ కావాలి... మంచి జర్నలిస్టులు కావాలి. మనకి ఒక విషయాన్ని అభివ్యక్తీకరించి ప్రజలకు చెప్పేటటువంటి అటువంటి కోర్సులు కావాలి" అంటున్న విద్యావేత్త, కళారాధకుడు, ప్రముఖ ఎన్నారై రామానుజాచార్యులు వారితో కళ్యాణ్ ముఖాముఖి. 

 అచ్చంగ తెలుగు : నమస్కారమండీ..! రామానుజాచార్యులు గారు..!  మీ స్వగ్రామం , బాల్యం, విద్య గురించి మా అచ్చంగా తెలుగు పాఠకులకు  చెబుతారా..?

కందాళం రామానుజాచార్యులు :   నేను తాడేపల్లిగూడెం సమీపంలోని పెంటపాడు అనే గ్రామంలో పుట్టాను.. వృత్తి రీత్యా మా నాన్న గారు ప్రతి మూడేళ్ళకీ  ఒక ఊరు మారుతూ వచ్చారు.. విశాఖ, నర్సీపట్నంలో మూడేళ్ళు, విజయనగరం లో మూడేళ్ళు, శ్రీకాకుళంలో ముడేళ్ళు, బొబ్బిలిలో ఐదేళ్ళు నా ప్రస్థానం జరిగింది.  రకరకాలచోట్ల చదువుకోవడం జరిగింది. ఆ తరువాత విశాఖపట్నంలో మాస్ట్రస్ చేశాను,ఆ తరువాత క్రమంలో నేను మడ్రాస్ లో పిహెచ్ డి చేయటం జరిగింది. ఐటి నెట్ వర్క్స్ లో. అక్కడ నుంచి నేను అమెరికా వెళ్ళాను1983 లో.అప్పటి నుంచి అక్కడే అమెరికాలోనే ఉంటున్నాను.

      అచ్చంగతెలుగు :    విదేశాల్లో స్థిరపడ్డ మీకు తెలుగు భాషా సేవ పట్ల అభిరుచి ఎలా ఏర్పడింది.. ?

      కం.రా :   అయితే 1983లో అక్కడకు నే వెళ్ళినప్పుడు అక్కడి తెలుగు సంఘాలతో నాకు పరిచయం ఏర్పడింది.అమెరికాలో ఉండేటటువంటి తెలుగు సంఘాలైన  తానా అని, డిసిఐ అని, ఆట అని రకరకాల సంఘాలలో సభ్యునిగా ఉండేవాణ్ణి .అప్పుడు కూడా నాకు సాహితీ అభిలాష చాల ఎక్కువగా ఉండేది. అక్కడొక మాగజైన్ రన్ చేసే వాళ్ళం.   అంటే వెబ్ లు అవి లేని రోజుల్లో 1983 లో  'తెలుగు జ్యోతి ' అనే పత్రిక న్యూజెర్సీ నుంచి కేంద్రంగా  వచ్చేది. ఆ పత్రిక సంపాదకులుగా థిల్లాన్ రఘునాథ్ గారుండేవారు.. ఆయనకు సహాయకునిగా నేను పనిచేసేవాణ్ణి. ఆ పత్రికకు వ్రాయటం వంటి వాటి వల్ల సాహిత్యం పై మమకారం పెరిగింది. 1984 లో అప్పాజోస్యుల సత్యనారాయణ గారితో పరిచయం అయ్యింది. ఆయన సాహచర్యంతోనే తెలుగు సాహిత్యం పట్ల ఇంకా ఎక్కువ మక్కువ పెరిగిందని చెప్పవచ్చు.. అప్పటి నుంచి అంటే 1993 వ సంవత్సరం నుంచి 22 ఏళ్ళుగా ఇద్దరం కలిసి కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేయడం ఆనందం కలిగిస్తుంది.

   అ.తె :  మీ ఫౌండేషన్ ఎక్కువగా తెలుగునాటకోత్సవాలు నిర్వహిస్తోంది.. నాటకాల పై మీరు దృష్టి కేంద్రీకరించడానికి ప్రత్యేక కారణాలున్నాయా..?

 కం.రా : 1987 నుంచి ఇక్కడకు (ఇండియా) వచ్చినప్పుడల్లా క్రమం తప్పకుండా రవీంద్ర భారతిలో గానీ, త్యాగరాయ గాన సభలో గానీ తెలుగు నాటికలు చూసేవాణ్ణి. అప్పుడు మాకే మనిపించిందంటే అన్నీ పాతనాటకాలే చర్విత చరణం గా వేస్తూ ఉండటం కనిపించింది. ఆ సమయంలో నేను రచయితలను ఎందుకు కొత్తనాటికలు రావడం లేదని  అడిగాను. " సార్, కొత్త నాటకాల కు ప్రోత్సాహం లేదు మాకు.. అందుకే పాతవి వేసుకుంటున్నాం అన్నారు.అందుకని 1994 నుంచి మేమేం చేశామంటే మా సంస్థలో ప్రదర్శంచబడే నాటకాలన్నీ కొత్త నాటకాలే అయ్యుండాలి అని నిబంధన పెట్టాం. ఆ విధంగా తెలుగు నాటకంలో కొత్తనాటకాలొస్తాయన్న అభిలాషతో.. రచయితల సూచన మేరకు, దర్శకుల సూచన మేరకు, నటుల సూచన మేరకు నాటక  సమాజాల సూచన మేరకు,   1994 నుంచి నాలుగైదేళ్ళపాటు కొత్త నాటకాలు మా సంస్థ నుంచి ప్రదర్శింపజేశాం.  అయితే రచయితలు సాహిత్యం చదువుకోవక పోవడం వల్ల ఇతివృత్తం సరిగా రావటం లేదని, కథ సరిగా లేకుండా ఇష్టారీతిన వ్రాస్తుండటాన్ని గమనించాం. కారణం అన్వేషిస్తే నాటక రచయితలు సాహిత్యం చదువుకోవడం లేదని అర్ధమైంది. వారు సాహిత్యం చదువుకుంటే నాటకం ఇంకా సుసంపన్న మౌతుందన్న నమ్మకంతోటి, 1997-98 సంవత్సరం నుంచి, మేమేం చేశామంటే, తెలుగులో వచ్చిన ప్రఖ్యాత కథల్ని నాటకీకరణ చేసి, ప్రజలకి అందించాలని ప్రయత్నం చేశాం.. అది చాలా సక్సెస్ ఫుల్ అయ్యయి. కథానాటికల్ని వాటి కి చాలా కాలం మేం సేవ చేశాం. దానివల్ల నాటక రచయిత కు కథచదువుకోవడం వచ్చింది. కథారచయిత తో ఒక విధమైన రిసోసేషన్ వచ్చింది. వీరిద్దరి సంగమం తోటి మేం మంచి మంచి నాటకాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మధురాంతకం రాజారావు గారు వ్రాసిన 'ఎడారి కోయిల' మేం నాటకీకరణ చేసి అమెరికాలో కూడా ప్రదర్శించాం . సో ఈ విధంగా సేవచేస్తూ నాటకాన్ని బ్రతికించుకోవాలి, .. బ్రతికించినంత మాత్రాన ఏమీ జరగదు.. నాటకానికి లెవెల్ మార్చాలి, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకెళ్లాలి అనే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నాం. దీనివల్ల నాటక సమాజం నుంచి మాకు మంచి స్పందనొస్తోంది, ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందనొస్తోంది.. మీరుకూడా చూస్తున్నారు కదా.. ఎంతో బాగున్నాయ్ అని ప్రశంసిస్తున్నారు.అవన్నీ కుడా కొత్త నాటకాలు, మునుపెన్నడూ వేయని నాటకాలు. సో ఈ విధంగా మేం చేయడం జరుగుతోంది.

అ.తె  :  ప్రతిభామూర్తి పురస్కార గ్రహీతల ఎంపికలో  గీటురాయి ఏమిటో  తెలియజేస్తారా??

  కం.రా : ప్రతిభామూర్తి పురస్కారమనేది తెలుగు సాహిత్యానికే కాకుండా, తెలుగు కథానికే కాకుండా, తెలుగు నవలే కాకుండా, సంగీతం రావు బాలసరస్వతి గారికిచ్చాం, సామాజిక సేవలో చాలామండికిచ్చాం, డా. సుబ్బారావు గారికిచ్చాం, పి.వి నర్qఅసింహారావు గారికిచ్చాం.. ఆయనెప్పుడూ ఎవ్వరి వద్దా అవార్డు తీసుకోలేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ అవార్డ్ మాదే..! సో రకరకాల రంగాలలో వచ్చి , ఒక ఇరువై , ముఫ్ఫై ఏళ్ళ కు పైగా కృషిచేసి, నిరంతరం ఇప్పటికీ కూడా కృషీవలురు గా ఉంటూ వాళ్లకు, తమదైన ముద్రను తెలుగువాళ్ళకి ఇచ్చినటువంటీ ప్రతిభామూర్తినే మేం ఎంచుకుంటాం. సో రావికొండలరావు గారికి సన్మానం చేశాం.. ఆయన సినిమా యాక్టరని ఇవ్వలేదు... ఆయనొక కథకుడని ఇవ్వలెదు.. అయానొక నవలా రచయిత అని ఇవ్వలేదు... ఆయనొక సంపాదకుడనివ్వలేదు..ఆయనలో ఉండేటటువంటి బహుముఖీన విద్వత్తుకు మేం సలాం చేస్తూ  ఇచ్చినటువంటి అవార్డ్ ఇది.
       అదేవిధంగా లాస్ట్ ఇయర్ గొల్లపుడి మారుతీరావు గారికి ఇచ్చినప్పుడు కూడా అదే పరిస్థితిలో తీసుకురావటం జరిగింది. సో  ప్రతిభామూర్తి ఎంపిక అనేది  యాక్చువల్ గా నెక్ట్స్ ఇయర్ ప్రతిభామూర్తి ఎంపిక నేటి నుంచే ప్రారంభమవుతుంది. వడబోసి వడబోసి ఎందరో మహాను భావులున్నారు.. ఎందరో మహాను భావులున్నారు వారందరికీ ఇచ్చుకోలేము మేము.. అది మాత్రం చెబుతున్నాను. వాళ్ళిచ్చిన్నోళ్లే మహాను భావులు.. ఇక వేరే వాళ్ళు మహానుభావులు ఇక వేరే వాళ్ళు లేరు అనేదానిని మేమసలు ఒప్పుకోం. అయితే ఒక్క మనిషికే ఇవ్వగలం కాబట్టి, ఆ ఏడాది ఆ పర్టిక్యులర్ రంగానికి మేం తీసుకుంటాం. ఒక ఏడాది తెలుగు కథ, ఒక ఏడాది తెలుగు నవలఒక ఏడాది తెలుగు సాంఘిక సేవ, ఒక సారి సంగీతానికి సేవ చేసినవాళ్ళకి ఇస్తుంటాం, ఒక్కొక్క సారి పద్యనాటకానికి సేవ చేసిన వాళ్లకి ఇస్తుంటాం.. ఆ విధంగా రకరకాల  తెలుగులో ఉండేటువంటి  లలిత కళా ప్రక్రియలేవైతే ఉన్నాయో., వాటిలో ఒక్కొక్క భాగాన్ని ఎన్నుకుని, లబ్ధప్రతిష్టులైనటువంటి మహానుభావులకి, సత్కారం చేసుకుని, ప్రజలకి పరిచయం చేయడం జరుగుతుంది.

.తె : ఒక తెలుగు ప్రేమికునిగా  తెలుగు గడ్డ మీద వారికి తెలుగు గురించి  ఏమి చెప్పాలను కుంటున్నారు?

 కం.రానా ఉద్దేశ్యంలో ఏమిటంటే ఈ తెలుగనేటువంటిది  ఒక నిరంతర ఝరిలా వెళుతూ ఉంటుంది. మా ముండు కూడా తెలుగు నాటకం బ్రతికింది. మేం పోయిన తర్వాతకూడా తెలుగు నాటకం ఉంటుంది. ఈ విషయాన్ని నిస్సందేహంగా చెబుతున్నా..! అయితే ఈ ప్రక్రియ ను యువత చూసి  " ఓహో మహానుభావులున్నారు అని రేపు వచ్చే తరాల వాళ్లకు కూడా వాళ్ళు చేసుకుంటారనే నమ్మకం తోటి మేం చేస్తున్నాం. వాళ్లకొక ప్రేరణగా. అయితే మనం కాకుంటే మారొకరు చేస్తారు.

.తె :   మీరు ఒక ఒక ప్రొఫెసర్ గానే కాక అమెరికాలో ఒక   తెలుగు  పత్రిక కూడా నడిపారు కదా వాటి వివరాలు చెబుతారా..?

   కం.రా : అంటే పత్రిక , మీడియా ఏదైనా సరే మారుతూనే ఉంటుంది .. 2 ఏళ్ళ క్రితం ఉండే మీడియా ప్రక్రియ వేరు.. ఇప్పుడుండే మీడియా ప్రక్రియ వేరుముఖ్యంగా అంతర్జాలం వచ్చిన తర్వాత, సౌలభ్యాలు బాగా మారిపోయినాయ్. మా ఉద్దేశ్యంలో ఏంటంటే ఒకప్పుడు 1983 టైంలో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు, ప్రతి నెలా తెలుగు పత్రిక అచ్చు వేశా.. అక్కడే మా ప్రెస్ లోనే అచ్చు వేసేవాళ్లం. మెంబర్ షిప్ ఉన్న వాళ్ళకి మేం  పోస్టేజ్ చేసే వాళ్లం. ఇవ్వాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే, తెలుగు చదువుకోవాలంటే, తెలుగు కథ చదువుకోవాలనుకుంటే ఒక్క బటన్ నొక్కితే తెలుగు కథ వచ్చేస్తుంది. అట్లాగే ఇంటర్నెట్ మీద ఎన్నో తెలుగు పత్రికలు నడుస్తున్నాయ్. ముఖ్యంగా చెప్పాలంతే కౌముది అనే ఒక పత్రిక కాలిఫోర్నియా నుంచి నడుస్తోంది. తెలుగు వెలుగు, తెలుగునాడి అని, 'ఈ మాట' అని మరో పత్రిక , ఇందులోకూడా చాలా అద్భుతమైన లెవెల్స్ లో చేస్తున్నారు. అయితే ఇండియాలో కూడా జరుగుతోంది. పాఠకులున్నారా లేరా అనేదాని మీద రక్రకాల వాదనలున్నాయ్. చదవట్లేదు ఎక్కువమంది అంటారు. నేనొప్పుకోను. ఎందుకంటే మా సంస్థ ద్వారా మేము తెలుగు పుస్తకాలని ప్రపంచ వ్యాప్తంగా ఇస్తున్నాం. ఆవ్ఖ్F భోఓఖ్ ళీణ్ఖ్ అని ఒకటి పెట్టి , కొన్ని వేల పుస్తకాలు, ఇప్పటికి లక్ష పుస్తకాలు ప్రపంచంలో  ఎక్కడెక్కడో వున్న జనాలకి ఇచ్చాం .   రీడర్ షిప్ లేదు ఎవ్వరూ చదవట్లేదు అనే వాదనతో నేను ఏకీభవించను. దానికి నెంబర్స్ ఉన్నాయ్.. స్టాటిస్టిక్స్ ఉన్నాయ్. మేం ఎన్ని పుస్తకాలు మెయిల్ చేస్తామో మా దగ్గర లిస్ట్ ఉంది. చదివే పాఠకులు ఎప్పటికీ ఉంటారు... రేపూ ఉంటారు.. ఎల్లుండీ ఉంటారు.

 .తెఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్ సైట్ల వినియోగ ప్రభావం పిల్లల మీద ఏవిధంగా ఉందంటారు?

 కం.రా : నా ఉద్దేశ్యం, నా పర్సెనల్ ఉద్దేశ్యం  ఏంటంటే ఫేస్ బుక్ అనేది ఒక మీడియా. ఆ మీడియం ని ఒక్కోక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాడుకుంటున్నారు. ఈ ప్రక్రియలో కొంత మండి ఫేస్ బుక్ ని సద్వినియోగం చేస్తున్నారు. కొంతమండి దుర్వినియోగం చేసున్నారు.   కొంతమంది ఫేస్ బుక్ ని ఆయుధంగా వాడుకుంటున్నారు. ఒక వెపన్ గా వేరే వాళ్లను అటాక్ చెయ్యడానికి వాడూకుంటున్నారు. ఇది ఇప్పుడిప్పుడే వస్తున్న విప్లవం కాబట్టి మరో పదేళ్ళు ఆగితే గానీ  వీటి ప్రభావం యాక్చువల్ గా ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టతరమనిపిస్తుంది.

.తె.. :  పిల్లలకి   తెలుగు పట్ల మమకారం పెరగాలంటే మీ ఉద్దేశ్యంలో ఏంచేయాలని సూచిస్తారు..

  కం.రానేను చెప్పేదల్లా ఏంటంటే పిల్లలకి తెలుగు నేర్పండి. ఖర్చు నయాపైసా కాదు. ఒక భాష నేర్పండి. అమెరికా లో ఉన్న మా పిల్లలు ముగ్గురూ చక్కగా తెలుగు మాట్లాడతారు.. ఇండియా తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు అందరితో హాపీగా తెలుగు మాట్ళాడతారుతెలుగు గాని నేర్పక పోతే ఆ కమ్యునికేషన్ వారికుండదు,. నేను ముఖ్యంగా చెప్పేది అమెరికాలో ఉండేవారికి.
              ఇక్కడ కూడా మారుతోంది. ఇక్కడ కూడా తెలుగు సాహిత్యం మీదకాని పెద్దగా చోటు రావడం లేదు. దానికి పేరెంట్స్ కొంచెం శ్రద్ధ తీసుకుని చెప్పాలి. నేను ముఖ్యంగా అనేదేమిటంటే పిల్లలకి ఈ తెలుగును స్కూల్ నుంచి కూడా ధియేటర్ అనేది పెట్టాలి. అమెరికాలో ఐదవ క్లాసు నుంచి థియేటర్ ఏవిటంటే చెబుతారుమ్యూసిక్ అంటే ఏవిటో చెబుతారు. మనమంతా గూడా ఏవిటంటే  కాంటెంట్ ఎగ్జాంస్ కి ప్రిపేర్ చేయడం కోసం చేస్తున్న కృషి తప్ప ఒక వైశాల్యం ఉండటం లేదు వాళ్ళ మీదచాలా నారోగా ఉండి  ఏమీ చేయలేని పరిస్థితి వస్తోందినా ఉద్దేశ్యంలో   ఆల్ రౌండర్ గా ఉండాల ఒక వ్యక్తి.. దానికోసం చిన్నపిల్లల దగ్గర నుంచే వారికి సాహిత్యం నేర్పాలి. మ్యూజిక్ ను ఎలా అప్రిషియేట్ చెయ్యాలో నేర్పాలి. ఒక ధియేటర్ ను ఎలా అప్రిషియేట్ చెయ్యాలో నేర్పాలి. అది నిరంతరం జరిగే ప్రక్రియగా జరగాలనేది నా ఉద్దేశ్యం. పిల్లలకి నేను చెప్పే సందేశం అదే..!  కళల మీద కూడ మక్కువ పెంచుకుంటే చదువొక్కటే కాదు. లెక్కలు నాలుగు చేసినంత మాత్రాన  జీవితం కాదుఏం చేస్తున్నాడు అంటే ... ఇది కూడా చేస్తున్నాడు.. అన్నీ చెయ్యగలరు వీళ్ళు.

 .తె : కళల పట్ల మక్కువ విదేశాల్లో ఉన్నంతగా ప్రస్తుతం ఇక్కడ ఎందుకు లేదంటారు..?  తేడా ఎక్కడ జరుగుతోంది?

 కం.రా : నేనిక్కడ చదువుకున్నాను. మా పిల్లలు విదేశాల్లో చదువుకున్నారు. కాబట్టి నాకు రెండు సిస్టంస్ గురించి బాగా అవగాహనుంది. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో  థియేటర్ మీదగానిలిటరేచర్ మీద గానిచెప్పాలంటే 40, 50 శాతం దాని మీదే వాళ్ళు వెచ్చిస్తారు. గేంస్ మీదగాని, సో ఒక విధమైన బహుముఖీనమైన  జిజ్ఞాస వారిలో కలిగేలా చేస్తారు. పది ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత, ఆ కుర్రవాడు " నాకు మ్యూజిక్ నచ్చింది..అంటే  దీంట్లోకి  వెళతారు. మరొకరికి థియేటర్ నచ్చితే దాంట్లోకి వెళతాడు. ఇవాళ రకరకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయ్ఇవాళ ఇక్కడ ఇంజనీరింగ్  మెడిసిన్స్ తప్ప వేరే ఆప్షన్స్ లేకుండా అయిపోతున్నయ్ కుర్రాళ్లకిఅ ఒక్కటేనా. ఇవ్వాళ ఎంతో మంది ఇంజనీర్లు ఉపాధిలేక  ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. మనకంత మంది ఇంజనీర్లు అఖ్ఖర్లేదు. మనకి మంచి కళాకారులు కావాలి... మంచి సంగీతకారులు కావాలి. మంచి థియేటర్ ఫ్లో పీపుల్ కావాలి... మంచి జర్నలిస్టులు కావాలి. మనకి. ఒక విషయాన్ని అభివ్యక్తీకరించి ప్రజలకు చెప్పేటటువంటి అటువంటి కోర్సులు ఎందుకు పెరగట్లేదని తపనుండాలి. అది చిన్నప్పటి నుంచి చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశ్యం.

.తెఅజో -విభో- కందాళం ఫౌండేషన్ రాబోయే కాలం లో ప్రణళికలు ఏవిధంగా ఉండబోతున్నాయ్..?

 కం.రా :    ఇది మాకు శక్తి ఉన్నంత కాలం ఈ ఫౌండేషన్ ను ముందుకు నడిపించిఈ తెలుగు సమాజానికి మావంతుగా కొద్దిగా ఏదో మేం చెయ్యగలిగినంత  కృషి చేస్తామని తెలుగు ప్రజలకి చెప్తున్నా..!


.తె : ధన్యవాదాలండీ మీ.. అమూల్యమైన సమయాన్ని మా అచ్చంగా తెలుగు పాఠకుల కోసం వెచ్చించినందుకు కృతజ్ఞతలండీ కందాళం రామానుజాచార్యులు వారూ.

.రా : నమస్కారం

వీరితో అచ్చంగా తెలుగు ముఖాముఖిని క్రింది లింక్ లో చదవండి.


No comments:

Post a Comment

Pages