శ్రీధరమాధురి – 10 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి – 10

Share This

శ్రీధరమాధురి 10

(ప్రేమ గురించి, ప్రేమించుకునే వారి గురించి, పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజి అమృత వాక్కులు )

  • బెషరతైన ప్రేమ ఒక వేడుక వంటిది... షరతులతో కూడిన వివాహం నరకం వంటిది. 
  • ఆమె ఒకతన్ని ఇష్టపడుతోంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. నిజానికి వారు ఒకే కులం, మతం వంటి వాటికి చెందినవారు. కాని తల్లిదండ్రులు ఇష్టపడట్లేదు, ఎందుకంటే అబ్బాయి కేవలం గ్రాడ్యుయేట్. అతను ఒక కుటుంబాన్ని ఏర్పరచి, పోషించేందుకు సరిపడా సంపాదిస్తున్నాడు. ఇక్కడ తల్లిదండ్రులు దాచిన విషయం ఏమిటంటే, వాళ్ళమ్మాయి ఒక అమెరికా లో ఉండే అబ్బాయిని పెళ్ళిచేసుకోవాలని, వారి కోరిక. ఆ అమ్మాయి అబ్బాయిని, చాలా గాడంగా ప్రేమిస్తోంది, అలాగే అబ్బాయి కూడా. ఆమె మనసులో అబ్బాయి ఆలోచనలు నిండి, ఆమె మానసికంగా అతనితో జీవించిన తరువాత, ఆమె తల్లిదండ్రులు వారికి నచ్చిన అబ్బాయినే పెళ్ళాడమని చెప్పడం భావ్యమా ? నా దృష్టిలో ఇది అధర్మం అవుతుంది. వారు మనసులో భార్యాభర్తల్లా జీవించారు. ఆ అమ్మాయి మరెవరినో పెళ్లి చేసుకోవడం అసాధ్యమని నాకు తెలుసు. ఈ పెద్దలు ఎప్పటికి మేల్కుంటారు ? 
  • షరతులు విధించని ప్రేమే మీ నిజమైన ఉనికి కావాలి. 
  • మీరు గొప్ప పనులను చేయనక్కర్లేదు. చిన్న చిన్న పనులనే బేషరతైన ప్రేమతో చెయ్యండి... అదే మహత్కార్యం అవుతుంది.. 
  • చాలా వరకూ ప్రేమ నిబంధనలు కలిగిఉంటుంది. చాలా షరతులు... బేషరతైనది ఏమీ ఉండదు. చాలాసార్లు ప్రేమ పేరుతో మనం ఆచరణాత్మకంగా చూపించేదంతా కేవలం ‘స్వార్ధం’. ప్రేమలో షరతులు విధించకుండా ఉండాలి. ఇది ఒకరు తన మెదడు, దేహం అనే హద్దుల్ని దాటినప్పుడే సాధ్యం. వీటిని అధిగమించినప్పుడే బేషరతైన ప్రేమ సాధ్యం. మేము దాన్ని ‘అతీతమైన ప్రేమ’ అంటాము. అటువంటి విషయాల్లో, ఉనికి కూడా ‘అతీతమైన ఉనికి’ అవుతుంది, ‘ అతీతమైన  జీవనం’ అవుతుంది. అందుకే మేము సాకులు వెతక్కుండా జీవించమంటాం. కారణాలు వెతక్కుండా ప్రేమించండి. కారణాలు వెతికితే, మీ ఆకృతి మిమ్మల్ని ఆడిస్తుంది. అందుకే దీన్ని అధిగమించండి. 
  • తెలిసిన వారిని ప్రేమించడం సామాన్యం అవుతుంది ...

తెలియని వారిని (దైవాన్ని) ప్రేమిస్తే అది అసామాన్యం అవుతుంది.   
  • ఒకవేళ ఒక బంధం డబ్బు చెల్లించడం ద్వారానే నిలబడుతున్నట్లు అయితే, దాన్ని వదిలివెయ్యండి. దాన్నుంచి బయటపడే ధైర్యం చెయ్యండి. ఒకవేళ ప్రేమను పొందేందుకు డబ్బు ఇవ్వడమే మార్గామయితే, ఆ వ్యక్తిని తన్ని తగలెయ్యండి. వారు మీకు యెంత దగ్గరి వారైనా సరే. ప్రోత్సహించకండి. ప్రేమ అన్నింటినీ పంచుకునేందుకు మనల్ని ప్రేరేపిస్తుంది, నిజమే. కాని దబాయించి కాదు. 
  •  బేషరతైన ప్రేమ బానిసత్వం కాదు, బాంధవ్యం కాదు. నిజానికి, అది అన్ని బంధాల నుంచి మీరు విడివడడానికి తోడ్పడాలి. 
  • అతను – గురూజి, నేను ఒకమ్మాయితో జనవరి 2014 లో జరగబోయే వివాహానికి ముందుగా  ‘ప్రీ నుప్టియల్ అగ్రిమెంట్ ‘ సంతకం పెట్టేందుకు  ఒక మంచి రోజు చూసి చెప్తారా ?

నేను – అదేంటి ? అతను – గురుజి, అది పెళ్ళికి ముందు ఒక ఒప్పందం. ఒకవేళ పెళ్లి విఫలమయితే, ఆమెకు ఏమి చెందుతాయో, నాకు ఏమి చెందుతాయో... పిల్లలను ఎవరు చూసుకుంటారో... దానికి యెంత డబ్బును ఇవ్వాలో, ఇల్లు, కార్ వంటి వాటికి యజమాని ఎవరో... యెంత డబ్బును కట్టాలో... ఇటువంటివి అన్నీ అందులో ఉంటాయి. నేను – హ హ హ హ ... అద్భుతమైన చాతుర్యం. ముందుగానే మనం పెళ్లి చెడిపోతుందనే షరతుతో మొదలు పెడుతున్నాం. ఖచ్చితంగా ఇది పనిచెయ్యదు. ప్రేమ నిబంధనా రహితమైనది. పెళ్లిలో షరతులు విధించడం నేను చూస్తున్నాను. ఇదింకా బాగుంది... పెళ్లి కాంట్రాక్టు. అద్భుతం, ఇదొక వ్యాపార లావాదేవీ. నేను నిన్ను చూసి నిజంగా గర్వపడుతున్నాను. రెండు రోజుల తర్వాత ఫోన్ చెయ్యి. నేను పంచాంగంలో మంచి రోజు చూసి చెప్తాను. కాని, అది పెళ్లిని దృష్టిలో ఉంచుకుని కాదు, విడాకులని దృష్టిలో పెట్టుకుని, చూసి చెప్తాను. ఇది చాలా మూర్ఖంగా అనిపించింది...      
  • సాకులు లేకుండా జీవించండి, షరతులు విధించకుండా ప్రేమించండి. 
  • దైవంతో నా సంభాషణల్లో...

దైవం – ఊహ, భయం అనేవి చాలామంది మనసుల్లో నన్ను సృష్టించాయి. తర్కం, నిబ్బరం అనేవి, కొందరి మస్తిష్కంలో నన్ను చంపేసాయి. కాని, నేను ఇప్పటికీ స్థూలంగా కనబడని ఒక అంశాన్నే ఇష్టపడతాను. నేను – ఏమిటది స్వామి ? దైవం – ‘నాపై నిబంధనా రహితమైన ప్రేమ, నా సృష్టి అంతటినీ సమానంగా ప్రేమించడం.’   
  • ప్రేమ స్వర్గం వంటిది... కాని నిబంధనలు లేనిది కాకపొతే, నరకంలా గాయపరుస్తుంది. 
  • ఒకసారి మీకు వివాహం అయితే, ప్రేమలో షరతులు మొదలు. నువ్వు నన్నే ప్రేమించాలి, ఇతరులను కాదు. నిబంధనా రహితమైన ప్రేమ వివాహం తరువాత నిబంధనలకు గురౌతుంది. పెళ్ళయ్యాకా కూడా బేషరతైన ప్రేమను అందించాలంటే, మీకు గొప్ప ధైర్యం ఉండాలి. అటువంటి వ్యక్తి నిజంగా అణగని వ్యక్తి అయి ఉంటాడు. 
  •    “ డబ్బు ప్రేమను ఇస్తుందా ?” అని నన్నొకరు అడిగారు. ఎంతటి పిచ్చి ప్రశ్న ! డబ్బు కొన్ని పనులను చెయ్యగలదు. కొన్నింటిని చెయ్యలేదు. మనం డబ్బు యొక్క పరిమితుల్ని అర్ధం చేసుకోవాలి. డబ్బుతో ఇంటిని కొనగలం, BMW కార్ ను కొనగలం, ఫ్రిజ్ ను కొనగలం, కాస్తంత శృంగారాన్ని కూడా కొనగలం , కాని నిశ్చయంగా ప్రేమను కాదు. డబ్బును యాంత్రికంగా సంపాదిస్తాం. అందులో సహజత్వం లేదు... ప్రేమ పూర్తిగా సహజమైనది, స్వచ్చమైనది. 

No comments:

Post a Comment

Pages