ఎంత వాడితే అంత ‘వాడి’ పెరుగుతుంది! - అచ్చంగా తెలుగు

ఎంత వాడితే అంత ‘వాడి’ పెరుగుతుంది!

Share This
ఎంత వాడితే అంత ‘వాడి’ పెరుగుతుంది!
బి.వి.సత్యనగేష్

‘అమ్మా! నాన్న రోజూ ఆఫీసు నుంచి ఏవో పేపర్లు తెచ్చి పని చేస్తూ ఉంటారు. ఆఫీసులో పని చెయ్యరా?’ అన్నాడు ఎనిమిది సంవత్సరాల వయసున్న చంటాడు. ‘లేదు బాబూ! ఆఫీసులో పని పూర్తవకపోతేనే ఇంటికి పని తెచ్చుకుంటారు హోం వర్క్’ లాగ అని నచ్చజెప్పింది అమ్మ. ‘మరి నాన్నను ‘స్లో లేర్నర్స్’ క్లాసు లో వెయ్యరా ఆఫీసు వాళ్ళు?’ అంటూ అమాయకంగా అడిగాడు చంటాడు. ఆశ్చర్యపోవడం అమ్మ వంతయింది. నిజమే! కొంతమంది టేబుల్స్ పైన గుట్టలు గుట్టలు కాగితాలు, ఫైళ్ళు వుంటాయి. మరి కొంత మంది టేబుల్ ఇప్పుడే శుభ్రం చేసినట్లుంటుంది. ఇదంతా ఆ వ్యక్తీ పని చేసే తీరుబట్టి ఉంటుందంటున్నారు ఆర్గనైజేషనల్ సైకాలజిస్టులు. 1000 సిసి మోటార్ సైకిల్ ను ఒక వ్యక్తికి ఇచ్చి నడపమంటే చాలా చురుకుగా నడుపుతాడు. అదే మోటార్ సైకిల్ ను వేరే వ్యక్తికిస్తే మహా నెమ్మదిగా నడుపుతాడు. ఈ విధంగా నడపడానికి, మానసిక స్థితిగతులకు సంబంధం ఉంటుంది. ప్రతీ పనిని చాల నెమ్మదిగా చేసే అలవాటున్నవాడు ఆ అలవాటును గమనించి తగిన చర్యలు చేపడితే మంచి మారుపుతో బాటు ప్రగతిని సాధిస్తారు. శరీరానికి మంచి వ్యాయామం ఎలా అవసరమో, మనసు, మెదడులకు కూడా వ్యాయామం అంటే అవసరం. ‘జిం కి వెళ్లి శారీరక వ్యాయామం చేస్తే 4 ప్యాక్, 6 ప్యాక్ శరీర ధారుడ్యం, ఆకృతి వస్తాయి. దీనిని ‘ట్రైన్డ్’ అంటాము. శారీరక వ్యాయామం చెయ్యకపోతే ‘అన్ ట్రైన్డ్’ అంటాం. అలాగే, మన మెదడుకు మేత పెట్టే వ్యాయామాలు చేస్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది. మెదడుకి శిక్షణ ఈ అంశం పై జపాన్ కు చెందిన ప్రముఖ న్యూరో సైంటిస్ట్ ప్రొ|| రూటా కవాషియా అనేక ప్రయోగాలు చేసి, చక్కటి వ్యాయామాలను సూచించారు. ‘ట్రైన్ యువర్ బ్రెయిన్’ అనే ప్రోగ్రాంతో కొన్ని లక్షల మందికి తర్ఫీదునిచ్చేరు. ఈ న్యూరో సైంటిస్టు సూచించినదేమిటో చూద్దాం. చిన్న చిన్న లెక్కలు చేయటం కూడా మానసిక వ్యాయామంలో భాగమే అంటారు ఈ శాస్త్రవేత్త. 2x2 = 4, 6/2 = 3, 4+4 = 8, 17-9 = 8 లాంటి చిన్న లెక్కలను తయారు చేసుకుని, వాటిని వేగంగా చెయ్యడం సాధన చేస్తే మెదడు చురుకుగా పని చేస్తుందంటారు. లెక్కలతో ఒక పట్టిక తయారు చేసుకుని వేగంగా చేస్తూ మొత్తం మనం తీసుకున్న సమయాన్ని గమనించాలి. మనం తీసుకునే సమయం లేదా వ్యవధి తగ్గాలి. దీని వల్ల మన మెదడు వేగం పెరిగినట్లు చెప్పొచ్చు. రంగుల వ్యాయామం మరొక అంశం చూద్దాం. ఒక తెల్ల కాగితంపై పది రకాల రంగులున్న స్కెచ్ పెన్నులతో పది రంగుల పేర్లు ఇంగ్లీష్ లో రాయాలి. వరుసకు 5 నుండి 6 రంగుల చొప్పున 5 వరుసలలో రంగులు పేర్లు రాయాలి. ఇందులో ఒక విశేషం వుంది. రంగు పేరు రాసేటప్పుడు ఆ స్కెచ్ పెన్ను కలర్ పేరు రాయకూడదు. ఉదాహరణకు గ్రీన్ అనే పదాన్ని రెడ్ రంగున్న స్కెచ్ పెన్ తో రాయాలి. ఈ పట్టిక తయారు చేసుకున్న తరువాత ఇక ఎక్సర్సైజు చెయ్యటం ఎలాగో చూద్దాం. ఈ రంగుల పేర్లు సాధారణ స్పీడ్ లో చదవాలి. పట్టి పట్టి నెమ్మదిగా చదవకూడదు. చదివే పద్ధతిలో కూడా షరతు వుంది. రంగు పేరును చదవాలి కాని పదాన్ని చదవకూడదు. ఉదాహరణకు గ్రీన్ అనే పదం రెడ్ రంగుతో రాశి ఉందనుకుందాం. చదివేటప్పుడు ‘రెడ్’ అని చదవాలి కాని ‘గ్రీన్’ అని చదవకూడదు. మొత్తం పట్టికను తప్పులు లేకుండా సాధారణ స్పీడ్ లో చదవటం కొంచెం కష్టమే. అయినా సాధన ద్వారా సాధించవచ్చు. ఈ ప్రక్రియ మెదడుకు మంచి వ్యాయామం.

మన మెదడులో 1500 కోట్ల కణాలుంటాయి. ఒక సెకను వ్యవధిలో 30 బిలియన్ బైట్ ల సమాచారాన్ని ప్రాసెస్ చెయ్యగలుగుతుంది. మన కళ్ళు చూసే ‘చూపు’ అనే ప్రక్రియలో మెదడు 100 ట్రిలియన్ ఇంప్రెషన్స్ ను ఒక సెకనులో ప్రాసెస్ చెయ్యగలడు. మన మెదడు నుంచి శరీరంలో ఏ భాగానికైనా సమాచారాన్ని170 కి.మీ. వేగంతో చేరవేయ్యగలదు.

  పజిల్స్ కూడా మెదడుకు వ్యాయామాన్నిస్తాయి. “SUDOKU” లాంటి పజిల్స్, మెమరి గేమ్స్, పదాల పట్టికలు కూడా మెదడును పడును పెడతాయి. పజిల్స్, లెక్కలు చెయ్యకపోవడం ఒక మానసిక బద్ధకం. దీనిని అధిగమించి ఉత్తేజంలో ఉండడానికే ఈ వ్యాయామం అవసరం. వాస్తవానికి పజిల్స్ ప్రిస్ష్కరించ్చడంలో నిమగ్నులైతే ఆ ఆనందమే వేరు. మెదడు శక్తేమిటో తెలుసా? మన మెదడు యెంత గొప్పదో తెలుసుకుందాం. మన మెదడులో 1500 కోట్ల కణాలుంటాయి. ఒక సెకను వ్యవధిలో 30 బిలియన్ బైట్ ల సమాచారాన్ని ప్రాసెస్ చెయ్యగలుగుతుంది. మన కళ్ళు చూసే ‘చూపు’ అనే ప్రక్రియలో మెదడు 100 ట్రిలియన్ ఇంప్రెషన్స్ ను ఒక సెకనులో ప్రాసెస్ చెయ్యలేదు. మన మెదడు నుంచి శరీరంలో ఏ భాగానికైనా సమాచారాన్ని 170 కి.మీ. వేగంతో చేరవెయ్యగలదు. ఒక న్యూరాన్ నుంచి మరొక న్యూరాన్ కు మధ్య వేగం 268 కిమీ. అదీ మన మెదడుకున్న శక్తి సంపద. కొన్ని సందర్భాలలో కొంత మంది “I have done my best” అంటుంటారు. ఇది చాలా పొరపాటు. హద్డులనేవి మానసికమైనవి. ఉదాహరణకు ఒక ఇంజనీరింగ్ విద్యార్ధిని తీసుకుందాం. పరీక్షా ఫలితాలోచ్చాక తక్కువ మార్కులోచ్చాయనుకుందాం. ఇదేంటి అని ప్రశ్నిస్తే “I have done my best” అంటాడు. ప్రతీ రోజూ రెండు గంటల పాటు మొబైల్ ఫోను తోను, రెండు గంటలు ఇంటర్నెట్ తోనూ, ఒక గంట టెలివిజన్ తోను, మరొక గంట స్నేహితులతోనో గడిపి పరీక్షల ముందు మాత్రమె చదివి “I have done my best” అనడం అస్సలు సమంజసం కాదు. మన మెదడును అతి తక్కువగా వాడుకున్తామనేది శాస్త్రజ్ఞుల అంచనా. మెదడులోని ప్రతీ క్షణం (సెల్) అతి శక్తివంతమైనది. 1500 కోట్ల కణాల శక్తిలో ఏంటి శక్తిని మనం వాడుకుంటున్నామనే విషయాన్ని అంచనా వేయడానికి కొలబద్ద (లేక) ప్రమాణం లేదు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు మనకు “USER’S MANUAL” అనే పుస్తకాన్నిస్తారు. ఆ వస్తువును ఏ విధంగా వాడుకోవచ్చుననే విషయాన్ని వివరంగా విశదీకరిస్తారు ఈ పుస్తకంలో. కాని మన మెదడును రూపాయి నోటును ఏ పనికి, ఏ విధంగా వాడుకోవాలనే విషయం మాత్రం మనిషి విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. కనుక ఈ గొప్ప మెదడుకు వ్యాయామాన్నిస్తూ మేధాశక్తిని ఉపయోగించుకుంటే మన మనసు సహాయంతో అద్భుతాలు చెయ్యవచ్చు. వ్యాసకర్త: హైదరాబాద్ లోని మైండ్ ఫౌండేషన్ – సెంటర్ ఫర్ పర్సనల్ ఎక్సల్లెన్సు డైరెక్టర్

No comments:

Post a Comment

Pages