టెలీ షాపర్ - అచ్చంగా తెలుగు

టెలీ షాపర్

Share This

టెలీ షాపర్

- వసంత శ్రీ

కాలింగ్ బెల్ మోగేసరికి ముఖానికి నలుగుపిండి రాసుకుంటున్న భామ వెళ్లి తెలుపు తీసింది.కెవ్..మని కేకకి అదిరిపడి,వచ్చినదెవరా అని చూస్తె-కొరియర్ బాయ్. చెయ్యి కడుక్కుని సంతకం పెట్టి పేకెట్ తీసుకుని లోపలికొచ్చి, కేవ్ మని కేక..ఈసారి ఈ కేక భామది.

భామ భర్త కిషోర్ నెట్ లో చూసి ఫ్లిప్కార్ట్,ఈ-బే  లలో కనిపించిన వస్తువునల్లా ఆర్డర్ చేసేస్తుంటాడు.ఇంటినిండా కొత్త పేకెట్లే... ఒకసారి విప్పి చూసి వదిలెయ్యడమే. కనీసం విప్పి ,వాడడానికి కూడా  ఇంట్రెస్ట్ ఉండదు ఇంక.కళ్ళ దగ్గర పెట్టుకుని టీవీ  చూస్తూ ఉంటె కదిలే మిషన్-ఇది బరువు తగ్గిస్తుందట.ఇది కిందటి వారం వచ్చింది. అది చూసి భామ-ఎందుకండీ డబ్బులు దండగ కాస్త సాయంత్రమో,ఉదయమో-నడుస్తూ బయటికెళ్తే-నలుగురూ కనిపిస్తారు,నవ్వుతూ పలకరించడం అవుతుంది.వస్తూ ఏ కూరలో,ఇంటి సరుకులో తెచ్చుకోవడం అవుతుంది అంది భామ.దానికి కిశోర్ –‘ఉదయం ఆఫీస్ కెళ్ళే హడావిడి,వచ్చి రిలాక్స్ అవకుండా-బయటికెళ్ళడం నచ్చదు, 'నాకు హాయిగా టీవీ  చూస్తూ  డ్రాయింగ్ హాల్ లో ఇలా ఎక్సర్ సైజ్ చెయ్యొచ్చు,వారానికోసారి వెళ్లి ఇంటికి కావలసినవి తెచ్చుకోవచ్చులే’ అన్నాడు. ఇంకా నీ మేకప్ టిప్స్ అంటూ వెక్కిరింపు మొదలెట్టాడు.టమాటా కోసి ఆ చేతిని ముఖానికి రాసుకుంటుంది భామ.'ఆచేత్తోనే పచ్చిమిర్చి ,వెల్లుల్లి కూడా రాసేసుకుంటావేమో అలవాట్లో పొరబాటుగా'-సెటైర్ .

ఇక్కడ్నించీ ఆ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.డబ్బు దండగ అని తానంటే,నువ్వు చెప్పులకీ,హ్యాండ్ బాగ్స్ కీ ఖర్చు చెయ్యవా అంటాడు. ‘అవి నేను బయటికెళ్లినప్పుడు వాడేవి,ఇలా ఇంట్లో దొంతులు పెట్టేలా రెండు,మూడు కొనాలా’- భామ.

చిలికి-చిలికి గాలివాన ఇద్దరూ ఉద్యోగస్తులే.సగం జీతం దాచుకున్నా ఇంటి ఖర్చులకి పావువంతు వాడినా..ఇంకా మిగిలినవి ఇలా ఖర్చు చేసేస్తుంటారు. వీళ్ళకి పెళ్ళై ఏడాదిన్నర అయింది.ఇరువైపులా పెద్దలు దగ్గర లేకపోవడంవల్ల-వండుకోకుండా హోటల్ లో తినడం చాలా మామూలు సంగతే. ఇద్దరి తండ్రులూ ఉద్యోగాల్లో ఉన్నరింకా.భామ తండ్రి-లైఫ్ ఇన్సూరెన్స్ లో, కిషోర్ తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ లో పని చేస్తున్నారు.ఏవో పెళ్ళిళ్ళూ, ఫంక్షన్స్ అంటూ ఎప్పుడూ ఏదో హడావిడి .కనక వీళ్ళే 2నెలలకో  వెళ్ళొస్తుంటారు.

************* భామకీరోజు చాల చికాగ్గా ఉంది మనసు. పెద్ద వాదన అయ్యిందివాళ ఎప్పటిలాగే.ఇంటినిండా అట్టపెట్టెలు అల్మరలనిండా.షాప్ కెళ్ళి కొంటే ధర,క్వాలిటీ చెక్ చేసి ఇంకో కంపెనీ వస్తువు కూడా చూసి,రెండిoటినీ కంపేర్ చేసి చూసి అప్పుడు పక్కన తనూ ఉంటుంది –కాబట్టీ , వద్దంటే మానేసే చాన్స్ ఉంటుంది.కానీ ఈ ఆన్లైన్వ షాపింగ్  వల్ల  వెనకా ముందూ ఆలోచన ఉండక కంటికి కనబడింది ఆర్డర్ చేసే- ఆ ఉత్సాహానికి అడ్డుకట్ట,సెకండ్ థాట్ లేక డబ్బు దుబారా తనకి ఇరిటేషన్. కిషోర్ కి ఇవాళ ఆఫీస్ లో ప్రాజెక్ట్ పని ఉందని వెళ్ళిపోయాడు.వెళ్తూ  ఇన్కంటాక్స్ రిటర్న్స్ ఫైల్స్ కి  నింపిన ఫార్మ్స్,ఇవి దాచు,వచ్చే వారం సబ్మిట్ చెయ్యాలని  ఇచ్చాడు.అంతకుముందు జరిగిన ఆర్గ్యుమెంట్ తో విసుగ్గా ఉండడంతో అలాగే కూర్చుండిపోయింది భామ.చానల్స్ మారుస్తూ -టీవీ చూస్తోంది కానీ ఏమీ అర్ధం కావట్లేదు.

ఫోన్ మోగితే తీసింది తన ఫ్రెండ్ లాస్య ఫోన్ అది. లాస్య పేరు చూడగానే చాలా ఆనందం కలిగింది.తన చిన్నప్పటి ఫ్రెండ్.ఒకే ఊరు.ఇప్పుడు ఇక్కడే తనూ ఉద్యోగం చేస్తోంది.ఎంచక్కా ఇంకో రెండేళ్ళ దాక పెళ్లి చేసుకోనని వాళ్ళ తల్లితండ్రుల్ని ఒప్పించి ఇక్కడ పేయింగ్ గెస్ట్ ఎకామడేషన్ లో ఉంటోంది.

‘ఒక్కర్తినే ఉన్నా,రా’ చెప్పింది భామ,వెంటనే బయల్దేరి వచ్చింది లాస్య.వస్తూనే-’ఏంటోయ్ చాల డల్ గా ఉన్నావ్?సెలవు రోజు శ్రీవారు లేరనా?’మేలమాడింది. ’అది కాదే’అంటూ చెప్పుకొచ్చింది.’ప్రేమలేక కాదు గానీ-ఇరిటేషన్ పెరిగి,అది లైఫ్ మీద ప్రభావం చూపిస్తోంది. ‘ఎప్పుడూ ‘ఇల్లూ,ఉద్యగమే కాదు సరదాగా చిన్న ట్రిప్ ప్లాన్ చెయ్యండి ‘అంది లాస్య. ‘నాకు లీవ్ ప్రాబ్లెం లేదు తనకి ఈ వారం బిజీ,తర్వాత ఫ్రీ అవుతారు.కానీ ఈ అట్ట డబ్బాల పార్సేల్సే మా గొడవలకి కారణం,డబ్బు ఖర్చుపెట్టి, తనది తప్పుకాదని వాదన.ఒక్కసారైనా ఇవన్నీ తీసి చూపిస్తే ఎన్ని కొన్నారో తెలుస్తుందేమో అనిపిస్తుంది ’ అంది భామ.

'నీ ప్రాబ్లం చిన్నదే,కానీ భరించడం కష్టం.'అంది లాస్య.

ఒక పని చేద్దామా?మనం  ట్రిప్కెళ్తే ఇబ్బందేమీ లేదుగా వస్తావా అడిగింది భామని.

***************

‘లాస్య వచ్చింది ఇవాళ.మా క్లాస్మేట్స్ ఇంకో ముగ్గురూ కలిసి ఊటీ వెళ్దామని అంటోంది,వరసగా 4 రోజులు సెలవలొచ్చా యిగావాళ్ళంతా ప్లాన్ చేసారు మీరు ఏమంటారు?’ -ఇంటికి వచ్చాక కిషోర్ తో చెప్పింది భామ.

‘వెరీగుడ్ వెళ్లిరా. నేనెలాగూ ఇంకో 4,5 రోజులు పరమ బిజీ.రాత్రి లేట్ అయితే-నువ్వు ఇంట్లో ఒక్కర్తివీ ఉన్నావనిమనసుకి అనిపిస్తుంటుంది.సో. మీ కంపెనీ గెస్ట్ హౌస్ లో ఉంటారు కాబట్టి ఆ ప్రేపరేషన్ చూసుకోండి మరి .

'ఆ(.. లాస్య ఆపని చూస్తోంది' అంది భామ.

‘అయితే ఇంకేం హేపీ జర్నీ‘చెప్పాడు.

రెండు రోజులు గడిచాయి.సడన్ గా రాత్రి 11 గంటలకి గుర్తొచ్చింది కిషోర్ కి తను పేపర్స్ సబ్మిట్ చెయ్యాలి,ఎలాగు నింపి పెట్టాడు ఎక్కడున్నాయో?వెళ్ళే హడావిడిలో భామ ని అడగడం మర్చిపోయాడు.ఘాట్ సిగ్నల్స్ ఉండవని సెల్ ఆఫ్ చేస్తానంది,తనే రోజూ పొద్దున్న,రాత్రి ఫోన్ చెస్తూ ఉంటుంది.ఇప్పుడు అలసిపోయి నిద్ర పోతుంటే లేపడమా,వద్దా?రేపు కొత్త ఫార్మ్స్ తీసుకుని నింపొచ్చు కానీ చూద్దాం-అనుకుంటూ తన ముఖ్యమైన కయితలు పెట్టే చోట చూసాడు.అక్కడ లేవు,భామ సర్టిఫికెట్స్ ఫైల్స్ లో పెట్టిందేమో అంటే అక్కడ లేదు,బెడ్ రూమ్,హాల్,గెస్ట్ రూమ్ ఇలా అన్నీ అల్మరాలూ వెదకడంతో తన ఆన్లైన్ షాపింగ్ డబ్బాలన్నీ పైకి తియ్యాల్సోచ్చింది.ఫిట్నెస్ ఎక్విప్మెంట్ ఐటమ్స్,వాడకపోయినా చెక్కు చెదరకుండా ఇలా అల్మారాలలో...మరీ ఎక్కువే కొన్నా.అప్పటికి అనిపించింది-అందుకే భామ అరుస్తుంటుంది కోపంతో.గంటన్నర వెదికాడు కానీ ఆ ఫార్మ్స్ మాత్రం దొరకలేదు.సరే ఇంక ఇప్పటికి ఆపేసి రేపు చూద్దాం ఫోన్ చేస్తే భామే చెప్తుంది ఎక్కడ పెట్టిందో-అనుకుని ఆన్నీ తిరిగి సర్దడం మొదలెట్టాడు. మర్నాడు పొద్దున్న భామ ఫోన్ తో నిద్దర లేచాడు కిషోర్. ఆ ఫార్మ్స్ అలమరలో పరచిన న్యూస్ పేపర్ కింద భద్రంగా ఉందని చెప్పింది భామ.

’హమ్మయ్య ఒక పని సులువైంది’అంటూ-"సారీ డియర్ రాత్రి వెదకడానికి అల్మేరలల్లో చూస్తె నేను ఎన్ని కొన్నానో తెలిసింది.ఈ విషయంలో నిన్ను బాగా విసిగించాను.ఇంక నీకు చెప్పకుండా తొందరపడి కొననే వస్తువులూనూ "ఒప్పుకున్నాడు కిషోర్. ఫోన్ పెట్టి భామ పక-పకా నవ్వుతూనే ఉంది,ఏమైంది అడిగింది లాస్య,మాధవీ.’ కిషోర్ కి ఏదైనా అనుకుంటే-అయేదాకా నిద్రపోరని నాకు తెలుసు.నేను లేకపోవడం వల్ల ఆ ఫార్మ్స్ వెదుకుతారనీ తెలుసు.మొత్తానికి తన బజారు తనే చూసుకుని అతని దుబారా అర్ధం చేసుకున్నందుకు నేను చాల హేపీ.థాంక్యూ లాస్య.నీ ట్రిప్ నాకు జీవితంలో ఒక చికాకుని దూరం చేసింది’-ఆనందంగా చెప్పింది భామ.

No comments:

Post a Comment

Pages