// శ్రీలలితా ప్రణమామ్యహం // - అచ్చంగా తెలుగు

// శ్రీలలితా ప్రణమామ్యహం //

Share This

// శ్రీలలితా ప్రణమామ్యహం //

(గేయం)

-రచన : వసంత శ్రీ

 

 శ్రీ చక్రపురనివాసి పసిడి పాదాలకిదే వందనం,

ప్రజనెల్ల పాలించు శివుని పట్టపురాణి శ్రీలలితా ప్రణమామ్యహం

శక్తివే నీవు-కంచి కామాక్షీ ,
వరములలిచ్చే వీవు మా విశాలాక్షీ,
అనుక్షణము మముబ్రోవు అన్నపూర్ణ,
నిరతము నీ ధ్యానము వీడని మనసివ్వు నాకు

llశ్రీ చక్రll

మాతల్లి భువనేశ్వరీ
నీవుతప్ప నాకు వేరేదీ కోరని మనసీయమ్మా ,
నీ చరణాలను భక్తితో కొలువగా
స్థిర చిత్తము నాకీయమ్మా .
పరమేశ్వరుని కూడి మమ్ము కాపాడమ్మా

llశ్రీ చక్రll

గురుగుహజననీ,మోక్ష ప్రదాయిని
మంజుల చరణీ శ్రీలలితే,
వాసనాక్షయము చేసి మమ్ము నీదరిచేర్చ
ఏ పుణ్యఫలమో మా శ్యామలంబా

శ్రీ చక్ర పురనివాసి పసిడి పాదాలకిదే వందనం,
ప్రజనెల్ల పాలించు శివుని పట్టపురాణి శ్రీలలితా ప్రణమామ్యహం.

No comments:

Post a Comment

Pages