ఒత్తిడిని తగ్గించుకోడం ఎట్లా? - డా|| బి.వి.పట్టాభిరాం - అచ్చంగా తెలుగు

ఒత్తిడిని తగ్గించుకోడం ఎట్లా? - డా|| బి.వి.పట్టాభిరాం

Share This

మానసికంగా వచ్చే ఒత్తిడికి అనాదిగా అనేక రకాలుగా అర్థం చెప్తున్నారు. ఆ ఒత్తిడి తగ్గించుకోటానికి మార్గాలు కూడా కనిపెట్టారు. వాటిలో ముఖ్యంగా రిలాక్సేషన్ పద్ధతులైన సెల్ఫ్ హిప్నాటిజం యోగా సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రతి వ్యక్తీ జీవితంలో అప్పుడప్పుడు ఈ ఒత్తిడికి ఖచ్చితంగా గురవుతూంటాడు. ఆర్ధిక సమస్యలు, సామాజిక సమస్యలు, కుటుంబ పరిస్థితులే కాకుండా, కొన్ని సాధారణ పరిస్థితుల్లో కూడ ఈ ఒత్తిడికి గురవవచ్చు. ఒక స్త్రీ, పిల్లల్ని స్కూలుకి పంపించే తొందర పడుతుండగా, ఎవరో కాలింగ్ బెల్ కొట్టడం, అదే సమయానికి కుక్క ఆపకుండా అరవటం పిల్లలు తమలో తాము పోట్లాడుకోవడం, స్టవ్ మీద కూర మాడి పోవడం, పని మనిషి బజారుకి వెళ్ళి రాకపోవడం.......... ఇవి చాలు కాసేపు పిచ్చెక్కడానికి. అలాంటి పరిస్థితే రోజూ వుంటే, తప్పకుండా ఒక శుభముహూర్తంలో తీవ్రమైన మాన్సిక అలసటకు గురవుతారు. ఇది ఇల్లాళ్ళకే కాదు ఇంటాయనకు కూడా రావచ్చు. నిజం చెప్పాలంటే, మగవారికే ఎక్కువగా వుంటుంది. ఆఫీసులో అనేక సమస్యలు, తనకన్నా తక్కువ సర్వీసు వున్నవాడికి ప్రమోషన్ రావడం, బాస్ మరీ చిరాగ్గా మాట్లాడుతుండడం, పక్క సెక్షన్లో అమ్మాయి నాలుగు రోజుల్నుంచి రాకపోవడం, ప్యూను చెప్పిన మాట వినకపోవటం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనసులో ఏ మూలో దాగి మిమ్మల్ని వెధిస్తుంటాయి. ఇంటికొచ్చి తీరిగ్గా పేపరు చదువుకుందమనుకుంటే, భార్య కష్టాలు చెప్పడం, అవి వింటూ పేపరు చూస్తూ, పక్కనున్న రేడియో వింటూ మధ్య మధ్యలో  అల్లరిచేస్తున్న  పిల్లల్ని మందలిస్తూ - ఇలా అష్టావధానం చేసే భర్తలు ఎందరో వున్నారు. ఈ ఒత్తిడికి గురవటానికి కొన్ని ప్రత్యేక సంస్యలేవీ అవసరం లేదు, గడ్డిపోచలతో మదగజాన్ని కట్టిపాడేసినట్లు, చిన్న చిన్న విషయాలే మిమ్మల్ని ఇబ్బందిలో పడవేయగలవు.

డాక్టర్ ఎడ్వర్డ్ చార్లెస్వర్త్ అనే శాస్త్రజ్ఞుడు ఇటీవలే "బేలర్స్ కాలేజీ ఆఫ్ మెడిసిన్ " విద్యార్ధినీ విద్యార్ధులచే అమెరికాలో 'ఒత్తిడి ' గురించి సర్వే చేయించగా ఈ క్రింది విషయాలు బయటపడ్డయి.

ప్రతి సంవత్సరం ఒక మిలియన్ ప్రజలకు గుండెనొప్పి వస్తుంది, ముప్పై మిలియన్ల ప్రజలకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతోంది. ఎనిమిది మిలియన్ల మందికి కడుపులో పుండు పెరుగుతోంది. పన్నెండు మిలియన్ల మంది తాగుడు మొదలుపెడూతున్నారు. యాభై మిలియన్ల ప్రజలు మత్తు మాత్రలు మింగుతున్నారు.

అయితే ఈ సంఖ్యలను చూసి మీరు కంగారు పడిపోవలసిన అవసరం లేదు. మరో అంత మంది సకాలంలో జాగ్రత్త పడి ఆరోగ్యం కాపాడుకున్నారు. మీరు కూడా ఈ కోవలోకి రావచ్చు.

ఒత్తిడిని తగ్గించుకోవటానికి పద్ధతులు పాటించే ముందు, ప్రతి వ్యక్తీ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసిన నవరత్నాల్లాంటి తొమ్మిది విషయాలున్నాయి. అలసటలో కూడా ఆనందాన్ని కలిగించే విషయాలు ఇవి.

1. జీవితం ఒక సమస్య అని భావించ కూడదు. జీవితం ఒక ఆటలాంటిది. అది నవ్వుతూ ఆడతాను అనుకుంటే, సమస్యలను సునాయాసంగా పరిష్కరించుకోవచ్చు. కష్టాలు లేని జీవితం ఉప్పూ కారం లేని కూరలాంటిది. ఆ కష్టాలను ఎదుర్కొని విజయం సాధించినపుడే థ్రిల్ వుంటుంది.

2. మీ దైనందిన జీవితంలో అతి ముఖ్యమైనది ప్లానింగ్. మీరు చేయవలసిన పనులను ఒక పధకం ప్రకారం చేయాలి. అనవసరపు పనులను నెత్తిన వేసుకొని, అసలు పని పాడు చేసుకోకూడదు. ఏ రోజు పనులను ఆ రోజే చేసుకొనేలాగా, ఉదయమే ప్లానింగ్ చేసుకోవాలి. అతి ముఖ్యమైనవి, ముఖ్యమైనవి, మామూలువి అని మూడు భాగాలుగా విభజించుకొని సమయాన్ని బట్టి ముందు అతి ముఖ్యమైనవి, తరువాత ముఖ్యమైనవి, సమయం వుంటే మామూలువి చేయాలి. ప్లానింగ్ లేకుండా మనసుకి తోచిన పని చేస్తే ఫలితం శూన్యం. ఒత్తిడి అధికమవుతుంది.

3. దురదృష్టవశాత్తూ కొంతమంది అంగవైకల్యం వలన జీవితంలో ఓడిపోయినట్లు భావిస్తారు. ఇది చాలా తప్పు. ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగి విజయం పొందినవారెందరో వున్నారు. చెవిటి, మూగ, గుడ్డితనంగల హెలెన్ కెల్లర్ తన అంగ వైకల్యాన్ని లెక్క చేయక, జీవితాన్ని ఒక సవాలుగా స్వీకరించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అలా ఎందరో వున్నారు. కాబట్టి, అల్లంటివారు పదే పదే తమ మీద తామే జాలిపడకూడదు.

4. మీ తాహతుని మీరు తెలుసుకొని మసలుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. అందని ద్రాక్షపళ్ళు పుల్లన అనే సిద్ధాంతం అలవర్చుకోవడం మంచిది. మీ కన్నా ఉన్నత స్థితిలో వున్నవారిని చూసి ఈర్ష్యపడి, అసూయతో ఒత్తిడి పెంచుకోవడం కన్నా, మీకు వున్న దానితో తృప్తిపడటం నేర్చుకుంటే మీ జీవిత కాలం పెరుగుతుంది.

5. మొహమాటాలకు పోయి, ఎదుటివారి సమస్యలను, పనులను నెత్తిమీద వేసుకోవద్దు, తరువాత మీకు సమయంలేక, అనుకున్నది అందకపోవడంవలన విమర్శకు గురయి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు.

6. ముందుగా మీ ఆత్మస్థయిర్యాన్ని పెంచుకోవాలి. అసూయపరులు, ఇష్టం లేనివారు నోటికొచ్చినట్లు మాట్లాడినట్లు మీకు తెలిసినపుడు, లేదా మీకు ఎవరైనా అన్యాయం చేసినట్లు  మీకు తెలిసినపుడు, అది భరించి, వారిని క్షమించ గలిగితే, అది మీకు ఎంతో తృప్తిని ఇవ్వగలదు.

7. మీరు తలపెట్టిన ఫనిని పూర్తి చేసేవరకు ఆపకూడదు. ఒక పని సగం చేసి, మఒకటి మొదలెడితే, అది కూడా సగంలో ఆగిపోవచ్చు. చిట్టచివరకు ఏ పనీ పూర్తికాదు. దాని వలన సమయం వృధా, మిగిలేది వ్యధ మాత్రమే.

8. వున్నదానిలో తృప్తి పడడం కన్నా ఆనందం లేదు. మీరు జీవితంలో కావలసినవన్నీ సమకూర్చుకొన్న తరువాత కూడా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనే అత్యాశకు పోతే మిగిలేది నిరాశే. హిట్లర్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. అతను ఎంత సాధించినా తృప్తి లేదు. ఏనాడూ అతను మనశ్శాంతిగా పది నిముషాలు కూర్చోలేదు. చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.

9.ఆఖరిదైనా, అద్భుతమైనది రాజీపడడం. పరిస్థితులతో అవసరమయినపుడు రాజీ పడే తత్వం అలవర్చుకోవాలి. మొండితనానికి పట్టుదలకు పోతే మిగిలేది పరాభవమే. ప్రతి దేశ చరిత్రలో రాజీ పడి తమ జీవితాల్ని నందనవనం చేసుకున్న వ్యక్తులెందరో వున్నారు.

" ఈ నవరత్నాల్లాంటి సలహాలు చదువుకోటానికి బాగానే వున్నాయి. అయితే వాటిని అవలంబించడం అసాధ్యం కదా " అని కొందరు అనుకోవచ్చు. అటువంటివారు ఒక హిప్నాటిష్టు ద్వారా వాటిని స్వీకరించవచ్చు. మనో ధైర్యం అతిముఖ్యం.

No comments:

Post a Comment

Pages