నెత్తుటి పువ్వు - 23 - అచ్చంగా తెలుగు
                                          నెత్తుటి పువ్వు - 23
మహీధర శేషారత్నం

(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ఒకరోజు లక్ష్మి రాజును నిలదీస్తుంది. ) 
డాక్టరు దగ్గరకెళ్ళు”.

          వెళ్ళాను, బాగానే ఉన్నాను.” ... పొడిగా జవాబు చెప్పాడు.
          లక్ష్మి ఎంతప్రయత్నించినా అతనిలో ఉత్సాహం రప్పించలేక పోయింది. కొడుకుని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇదివరటికంటే ఇప్పుడు కొడుకు మీద ప్రేమ పెరిగింది.
          గిల్టీ ఫీలింగ్ ఉన్నా తప్పుచేస్తూనే ఉన్నాడు. రోజా మాత్రం చాలా ఉత్సాహంగా ఉంది. ఆ అమ్మాయికి తనదంటూ ఒక జీవితం ఏర్పడినట్టు
          ఇదుగో, సినిమాకెళ్ళి చాలారోజులయింది. సినిమా కెళ్తామా? గోముగా అడిగింది లక్ష్మి, ఎప్పుడయినా వెళదాములే! నెలాఖరుగా... నసిగాడు.
          ఓస్! నా దగ్గరున్నాయిలే, అదే కారణం అయితే.. తేల్చేసింది ఇంక తప్పలేదు.
          టిక్కెట్టు లక్ష్మీ తెప్పించింది
          ఇంకా ఎన్నాళ్ళీ డొక్కుసైకిలు... బండి కొనచ్చుగా నీ కంటే చిన్న ఉద్యోగులు కూడా బళ్ళు కొంటూనే ఉన్నారు.
          ఆటోలో ఉన్నంతసేపూ లక్ష్మి గొణుగుతూనే ఉంది.
          అబ్బ ఊరుకో లక్ష్మీ ఇప్పుడు మనకి బండి అవసరంలేదు. ఉన్నప్పుడు తప్పకుండా కొంటాను...విసుక్కున్నాడు.
          అందర్లా మీరు బండిమీద దర్జాగా వెడుతుంటే చూడాలని ఉంటుంది.
          నిజమేకాని.... నువ్వు ఇంట్లోనే ఉంటావు. ఉద్యోగంకాదు. బాబు చిన్నవాడు, పైపెచ్చు ఇప్పుడు అందరూ స్కూలు బస్సులే. నాకు స్టేషన్ దగ్గరే... నలభై, ఏభైవేలు అప్పుచేసి కొనడం అవసరమా!
          ఆ చిట్ ఏదో కడుతున్నాంగా....
          అబ్బ! ఊరుకో లక్ష్మీ! మనం ఇంట్లో లేము....అయినా పెద్ద ఎమౌంటు జాగ్రత్తచేస్తే బాబు చదువులకి ఉపయోగపడుతుంది. మంచి కాన్వెంటులో చేర్చాలంటే డొనేషన్లు కట్టాలి తెలుసా!
          థియేటర్ లక్ష్మి మాటలు ఆపేసింది. సినిమా నుంచి వచ్చాక లక్ష్మీ సంతోషంగా నాగరాజుని చుట్టేసింది. తృప్తిగా నిద్రపోయింది. కాని నాగరాజుకి నిద్రరాలేదు. మనసులోంచి సరోజ తొంగిచూస్తూ నా సంగతేంటి? ఒంటరి బ్రతుకేనా? అని అడుగుతున్నట్టు అనిపించింది. లక్ష్మిని దగ్గరకు లాక్కుని గట్టిగా కళ్ళు మూసుకు పడుకున్నాడు. ఎప్పటికో నిద్ర పట్టింది.
*****
          పోలీసు స్టేషన్ లో ఫోను మోగింది. రైటర్ సత్యం ఫోన్ అటెండయ్యాడు.
          ఎస్.ఐ...ఊ! ఏం ఫోను”? అన్నాడు.
          ఏముందిసార్! ఎర్ర చెవులో ఒకామె ఇద్దరు పిల్లలతో చావడానికి దూకిందిట. పిల్లలు పోయారు. తల్లి చావు బతుకుల్లో ఉంది. హాస్పటల్లో చేర్చుకోవడానికి మననోమాట చెప్పమని....ఎవరో బాధ్యత గల పౌరుడు కాల్ చేసాడు. అతను కమలహాసన్ ఫ్యాన్ సందర్భం వచ్చినప్పుడల్లా కమలహాసన్ సినిమాల్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతూంటాడు. అందుకని అతని పేరు సత్యం అయినా ఎస్.ఐ. సరదాగాభారతీయుడుఅంటూ పిలుస్తాడు.
          సరే! పదండి, శంకరాన్ని, నాగరాజుని వెళ్ళమను, మన ఫొటోగ్రాఫర్ని వెంట బెట్టుకొని ఫొటోలుతీసి కేసుఫైలు చెయ్యమను.
(సశేషం)

No comments:

Post a Comment

Pages