ఈ దారి మనసైనది - 30 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 30
అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత. బాధగా ఉన్న కొడుకును గమనించి విషయం అడుగుతుంది ప్రియబాంధవి.)

గిఫ్ట్న్ అన్ని ముందు పెట్టుకొని కూర్చుని వున్న కొడుకును చూసి ఆశ్చర్యపోయింది ప్రియబాంధవి. ఆగిఫ్ట్స్మన్వితయిచ్చినవని తెలుసు. మన్వితే కాదు. అలాంటి గిఫ్ట్ చాలా మంది అమ్మాయిలు ఇచ్చారు అనురాగ్కి. కానీ మన్వితయిచ్చినవేసపరేట్ చేసి, అలా ఎందుకు కూర్చునివున్నాడోఅర్ధం కాలేదు. తిన్నగా కొడుకు వైపు చూస్తూ ... కాఫి కప్పు అందిస్తూ...
" అవన్నిమన్వితయిచ్చినవికదూ ! బయట పెట్టావెందుకు అడ్డంగా వున్నాయని ప్యాక్ చేసి పైన పెడ్తున్నావా?" అంది ప్రియబాంధవి కొడుకును గిఫ్ట్స్ ను చూస్తూ...
ఒక్కకణం ఆమె వైపు మౌనంగా చూసి, కాఫి కప్పు అందుకుంటుంటే అతని కళ్ళు ఎర్రగా వుండడం గమనించి కలవరపడింది ప్రియాబాంధవి.
“ఏంటి అనురాగ్ అలాగున్నావ్?” అత్రుతగా ప్రశ్నించింది ప్రియబాంధవి.
" అనురాగ్ మాట్లాడలేదు తల్లికి ఏలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు." ఏం జరిగింది నాన్న అంటూదగ్గరికి వెళ్లి తల నిమురుతూ ప్రేమగా అడిగింది.
" ఈ గిఫ్ట్లన్నీ మన్విత నాకు స్నేహంతో ఇచ్చిందనుకున్నామమ్మీ ! కాదట ..." అన్నాడు.
"మరి . " అంది అర్థం కానట్లుప్రియబాందవి.
"ప్రేమట.".....
"ప్రేమా ? " షాక్తిన్నది ప్రియబాంధవి.
గ్రీటింగ్స్ చెప్పి, గిఫ్ట్లు ఇస్తే ప్రేమ పుడుతుందా? ఒక చాక్ లెట్ చేతిలో పెట్టి‘ప్లీజ్ నన్ను ప్రేమించవూ !" అనడం ఎంత సిల్లీగా వుంటుందో ఇది కూడా అలాగే అన్పించింది. రెండు జడలతోఅమయాకంగా ముఖం పెట్టి, "ఆంటీ! ఆంటీ! అంటూ తన చూటర్ధాతిరిగిన మన్వితేనాఇలా అడిగింది.? ప్రేమంటే అంతతేలిగ్గా ఈవినింగ్ గ్రాండ్లో ఆడుకునే ఆట అనుకుంటుందేమో .
వెంటనే కొడుకు విూద అనుమానం వచ్చి....
"నువ్వు తననేమైనా ప్రేమిస్తున్నావా?" అడిగింది.
“వాళ్ల యింట్లో తనకి మనశ్శాంతి లేదని భాధపడుంటే అభిమానంగా, స్నేహంగా చూసుకున్నానుకాని ప్రేమ లేదు." అన్నాడు.
" మరి నువ్వు ఓపెన్గాచెప్పెయ్యి అనురాగ్"
" చెప్పాను మమ్మీ !నాకీ విషయం నిన్ననే తెలిసింది. మీరు నిన్నసైన్స్ ఎగ్జిబిషన్లో వున్నప్పడు నన్ను ఎవరూ లేచి చోటుకి తీసికెళ్లి తన మనసులో మాట చెప్పింది. నేను కాదంటే బ్రతకనంది తనలోలేందిదీక్షితలో ఏం కన్పించిందో చెప్పమంది దీక్షితకి తనకి నేలకీ, ఆకాశానికి వున్నంత తేడా నేను చూపించాలట. అప్పడే తను ఒప్పకుంటుందట" అన్నాడు.
ప్రియభాంధవిముఖంలోకి ఒక విధమైన వెలుగు ప్రవేశించింది. తన కొడుకు దీక్షితను ప్రేమిస్తున్నాడా? ఎంత తీయని వార్త ! కొడుకు ఎదిగే కొద్ది ఏ తల్లి అయినా రాబోయే కోడలి గురించి కొన్ని కలల్ని ఏర్పరచుకుంటుంది. ప్రస్తుతం తన కలల్లో ఎలాంటి కోడలు వుందోఅలాగే ఉందిదీక్షిత.
మౌనంగా వున్న తల్లి ముఖంలోకి చూడకుండా ఎటో చూస్తూ...
 "ఎక్కడైనా ఒక్క గిన్నె నిండా మకరందాన్ని నింపి బలవంతంగా తాగమంటే తుమ్మెద తాగుతుందామమ్మీ ! ఎప్పటికీ తాగదు. తను ఎంచుకున్న పుష్పం పైనే వాలుతుంది. ఈ విషయం మన్విత అర్థం చేసుకోకపోతోంది..అన్నాడు అనురాగ్ 
దీన్ని అర్థం చేసుకోవాలంటే వాళ్లలో వుండే బాధని మనసుతో తాకాలి. అలా తాకినప్పడే ఆ బాధలోని అర్ధం, విలువ బయట పడతాయి. 
అయినా తన కొడుక్కి ఈ బాధలేంటి? ఈ అమ్మాయి లేంటి? ఈ జ్ఞాపకాలను ముందేసుకొని కూర్చోవడమేంటి? దేన్నైనా భరించవచ్చుకాని ఈ హృదయ కల్లోలాన్ని తట్టుకోవటం అంత సులభం కాదు. 
మాతృ వాత్సల్యంతో ఆలోచిస్తూ...
కొడుకును ఓదార్చటానికి ప్రయత్నిస్తూ - - - -
" మన్విత నెమ్మదిగా అర్థం చేసుకుంటుందిలే అనురాగ్! చిన్న పిల్లకదా ! మంచిగా నాలుగు మాటలు మాటడితే అదే ప్రేమనుకుంటోంది," అంది ప్రియబాంధవి.
 "ఆ నమ్మకం నాకు లేదు మమ్మీ ! ఈ రోజు మన్వితమణికట్ల దగ్గర నరాలను బ్లేడుతో కోసుకొని చచ్చిపోవటానికి సిద్ధపడింది. నేనే హాస్పిటల్లో జాయిన్ చేసి ఇప్పటివరకు అక్కడే వుండి వచ్చాను." అన్నాడు.
అలా అంటున్నప్పడు అతని కళ్లలో సన్నటి నీటి పొర కదిలింది.
అది చూడగానే వణికింది ప్రియబాంధవి.
"అయ్యో! పిచ్చి పిల్ల అంత పని చేసిందా? ఎన్నోసార్లు తన దగ్గరికి వచ్చి " నా జీవితం ఎందుకిలా వుంది అంది? అన్ని కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి. అందరిలా సంతోషంగా వుండలేక పోతున్నాను ఎందుకు? ఒక్క రోజు కూడా మమ్మీ నన్ను ప్రేమగా పిలవదు. దగ్గరకు తీసుకోదు. ఏ రోజు మెచ్చుకోదు. ఏది అడిగినా విసుకుంటుంది. కసురుకుంటుంది. ఇలా ఎన్ని రోజులు? " అంటూబాధపడేది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages