- అచ్చంగా తెలుగు

||నేను రైతుని||
వాసుదేవమూర్తి శ్రీపతి
                                                                8639127850నేను రైతుని! అన్నదాతని!!
ఖచ్చింతంగా కాలే కర్మ
రాయించుకుని పుట్టిన వాణ్ణి
దైవం నుండి దళారి వరకూ
అందరిచేత దగా చెయ్యబడ్డవాణ్ణి
విత్తనం నుండి ప్రభుత్యం వరకూ
అందరిచేతా చిన్న చూపు చూడబడ్డవాణ్ణి
నేను రైతుని!!
ఒకప్పుడు కొత్త పంట ఇంటికి రాగానే
సంక్రాంతి సంబరాలు జరుపుకునేవాణ్ణి
గుళ్ళో ఉన్న దేవుడికీ
గుమ్మంలోకొచ్చిన హరిదాసుకీ
చేతికొచ్చినంత దానమిచ్చి సంతోషపరిచేవాణ్ణి
ఇప్పుడు ప్రతి రోజూ శివరాత్రి జరుపుకుంటున్నవాణ్ణి
నేను రైతుని! అన్నదాతని!!
అయ్యా! ఆకలి నన్నూ, నా కుటుంబాన్ని చంపేస్తొంది
ఓ వంద ధర్మం చేస్తారా..!
పూట గడుపుకోవడానికి కాదు
పురుగుల మందు కొనుక్కోవడానికి!!                                 ***                               

No comments:

Post a Comment

Pages