ఒక్కసారి - అచ్చంగా తెలుగు
ఒక్కసారి
ప్రతాప వేంకట సుబ్బారాయుడు 


పొద్దంతా
కృష్ణారామా అనుకుంటూ
గదికి బంధీనవుతాను
ఈ వయసులో
ఏక భుక్తం మంచిదని
ఉప్పూ కారాల్లేని భోజనంతో
సరిపెట్టుకుంటాను
రొంపొచ్చినా, జ్వరం సలిపినా
వైద్యానికి డబ్బు దండగెందుకని
చిట్కావైద్యంతో 
ఉపశమనం పొందుతాను
నలుగురితో మాట్లాడ్డం
నాలుగు శుభకార్యాలకి వెళ్లడం
ఎప్పుడో మానుకున్నాను
రాను రాను నా అస్తిత్వం ప్రశ్నార్థకమై
జీవచ్ఛవానన్న బావన కలుగుతోంది
గాల్లో ప్రాణం కలిసేలోగా
ఒక్కసారి మాట్లాడవూ..
***

No comments:

Post a Comment

Pages